- Home
- Entertainment
- Krishna Mukunda Murari: కృష్ణని మోసం చేసిన ముకుంద.. అందరి ముందు అడ్డంగా ఇరుక్కుపోయిన మురారి!
Krishna Mukunda Murari: కృష్ణని మోసం చేసిన ముకుంద.. అందరి ముందు అడ్డంగా ఇరుక్కుపోయిన మురారి!
Krishna Mukunda Murari: స్టార్ మా లో ప్రసారం అవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. పెళ్లి అయిన ప్రేమికుడిని తిరిగి దక్కించుకోవాలని చూస్తున్న ఒక ఆడదాని కధ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 15 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో పూజ పూర్తయిన తర్వాత కృష్ణకి పసుపు కొమ్ము ఇచ్చి ముడుపు కట్టి రామ్మా..మీ దాంపత్యం బాగుంటుంది అని చెప్తారు పంతులుగారు. వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటే నేనేం అయిపోవాలి అనుకుంటుంది ముకుంద. బయటికి మాత్రం కృష్ణ.. పద నీకు నేను తోడుగా వస్తాను అంటూ ఆమె వెనకే వెళుతుంది ముకుంద.
దారిలో ఆమెని మాటల్లో పెట్టి అక్కడ వాయినం ఇస్తున్నారు నువ్వు కూడా తీసుకో.. నీకు చాలా మంచిది అని చెప్పి కృష్ణ దగ్గర ఉన్న ముడుపు తీసుకుంటుంది ముకుంద. అమాయకంగా ముడుపు ముకుంద చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది కృష్ణ. నేను చేస్తున్నది తక్కువ నాకు తెలియదు కానీ నాకు మురారి ప్రేమ దక్కాలి.
కృష్ణ వెళ్లిపోయిన తర్వాత మా ఇద్దరి పెళ్లి జరిగేలాగా చూడు అని ముడుపు కట్టేస్తుంది ముకుంద. ఏం చేస్తున్నావు అంటూ అక్కడికి వస్తాడు మురారి. నాకు నేను న్యాయం చేసుకుంటున్నాను అంటుంది ముకుంద. అది పక్క వాళ్ళకి అన్యాయం కదా అంటాడు మురారి. ఎలాగూ తను వెళ్ళిపోతుంది కదా అంటుంది ముకుంద. అంతలోనే కృష్ణ వచ్చి ముడిపేది అని అడుగుతుంది.
నేనే కట్టేశాను అంటుంది ముకుంద. ఒక్కసారి గా షాక్ అవుతుంది కృష్ణ. కంగారు పడకు మీ ఏసీపీ సారే కట్టారు అని అబద్ధం చెప్తుంది ముకుంద. ఆ మాటకి సంతోషిస్తుంది కృష్ణ. ఆ తర్వాత గుడి బయటికి వచ్చి చూసేసరికి ఇందాక ఉన్న ముసలి జంట అక్కడ ఉండరు. అదే విషయం రేవతి తో చెప్తుంది కృష్ణ. నువ్వు ఒక పూట భోజనం పెడితే సరిపోతుంది అనుకున్నావా అందుకే నేను మన ఆశ్రమం వాళ్లకి ఫోన్ చేశాను.
వాళ్లు కార్లో వచ్చి ముసలి జంటని తీసుకుని వెళ్లి మన ఆశ్రమంలో పెట్టారు. ఇక వాళ్లకి తిండికి ఏ లోటు ఉండదు అని చెప్తుంది భవాని. ఆవిడ మంచితనానికి అందరూ మెచ్చుకుంటారు. టైం అయింది బయలుదేరుదాం అంటుంది భవాని. నేను కృష్ణ వాళ్ళతో వస్తాను రెస్టారెంట్ దగ్గర కలుద్దాము అని భవానితో చెప్తుంది ముకుంద. కృష్ణ కూడా తమతో పాటు రమ్మంటుంది.
పిచ్చి మొహం ది ఎప్పుడు తెలుసుకుంటుందో ఏంటో అంటూ కోడల్ని మనసులోనే తిట్టుకుంటుంది రేవతి. మరోవైపు కారులో వస్తున్న ముకుంద ఇప్పుడు మనం అందరినీ చాలా సంతోషంగా ఉన్నాము ఈ సమయంలో మంచి పాట పెట్టి కృష్ణ అంటుంది. కార్ డ్రైవ్ చేస్తున్న మురారి ఉంగరం తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. పొరపాటున కృష్ణ చూసిందంటే నిలదీస్తుంది.
ఏం చేయటమో ఏంటో అంటూ మొహం డల్ గా పెట్టుకుంటాడు. అదేంటి పెద్దతయ్య మాట్లాడుతున్నందుకు సంతోషించవలసిన ఏసీపీ సర్ సంతోషించడం లేదు. రివర్స్ లో నువ్వు ఓవర్ ఎగ్జైట్ అవుతున్నావు అని ముకుందతో అంటుంది కృష్ణ. ఎలాగూ త్వరలో కృష్ణ వెళ్ళిపోతుంది ఇప్పుడు మా ప్రేమ పెళ్లి సంగతి తెలిస్తే ఇంట్లో చెప్పేస్తుంది అని మనసులో అనుకుంటుంది ముకుంద.
ఆ తర్వాత రెస్టారెంట్ కి వెళ్తారు మురారి వాళ్లు. అప్పుడే రేవతి వాళ్లు కూడా వస్తారు. మురారి కి ఒక వైపు కృష్ణ ఒకవైపు ముకుంద కూర్చుంటారు. ముకుందని లేవమని ఆ ప్లేస్ లో తను కూర్చుంటానని అంటుంది రేవతి.తను ఆల్రెడీ కూర్చుంది కదా నువ్వు వెళ్లి అక్కడ కూర్చో అని భవాని చెప్పడంతో తప్పక కృష్ణ పక్కన కూర్చుంటుంది ముకుంద. మీరిద్దరే రెస్టారెంట్ కి రావలసింది మీకు ప్రైవసీ దొరికేది అనవసరంగా మేము కూడా వచ్చాము అంటుంది భవాని.
ఎప్పుడూ ఇంట్లోనే తింటాం కదా అత్తయ్య అప్పుడప్పుడు ఇలా తింటే బాగుంటుంది అంటుంది ముకుంద. కొడుకు జేబులోంచి చెయ్యి తీయకపోవటానికి గమనించి ఏం జరిగింది అని అడుగుతుంది. ఏం లేదు నేను హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను మీరు ఈ లోపల ఆర్డర్ ఇవ్వండి అని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తాడు మురారి. తరువాయి భాగంలో భవాని వడ్డిస్తుంటే చాలు అంటూ చెయ్యి అడ్డు పెడతాడు మురారి. అప్పుడు అందరికీ ఉంగరం కనిపిస్తుంది. ఉంగరం ఎక్కడిది అంటూ నిలదీస్తుంది రేవతి. సమాధానం చెప్పలేక కంగారు పడతాడు మురారి.