- Home
- Entertainment
- Krishna Mukunda Murari: ముకుందతో కన్నీరు పెట్టించిన మురారి.. వియ్యంకుడు మాటలకు షాకైన భవాని?
Krishna Mukunda Murari: ముకుందతో కన్నీరు పెట్టించిన మురారి.. వియ్యంకుడు మాటలకు షాకైన భవాని?
Krishna Mukunda Murari: స్టార్ మా లో ప్రసారమవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకులు హృదయాలని గెలుచుకుంటుంది. పెళ్లయినప్పటికీ తన వెంట పడుతున్న మాజీ ప్రేమికురాలి నుంచి తప్పించుకోలేక ఇబ్బంది పడుతున్న ఒక వ్యక్తి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 16 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో మీరు ఆర్డర్ ఇస్తూ ఉండండి నేను హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను అంటూ వాష్ బేసిన్ దగ్గరికి వెళ్తాడు మురారి. ముకుంద కూడా నేను వాష్ రూమ్ కి వెళ్తాను అంటూ మురారి దగ్గరికి వెళ్తుంది. అప్పటికే ఉంగరం తీయటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు మురారి. మురారి చేయి పట్టుకొని ఆపుతుంది ముకుంద. మన ఎంగేజ్మెంట్ ని బ్రేక్ చేద్దామనుకుంటున్నావా అంటూ నిలదీస్తుంది.
ఇది కృష్ణకి, ఆదర్శ్ కి చేస్తున్న అన్యాయం అంటాడు మురారి. ఎలా అన్యాయం అవుతుంది ఇప్పటికిప్పుడు నువ్వు ఆదర్శ్ ని తీసుకొని రా అప్పుడు నీకోసం ఆలోచించను లేదంటే నాలుగు రోజులలో వెళ్లిపోయే కృష్ణని ఆపు అప్పుడు నీ వైపు కన్నెత్తి చూడను కానీ ఈ రెండు జరగవు అందుకే మనం మన ప్రేమని మళ్ళీ బ్రతికించుకుందాం అంటుంది ముకుంద.
అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మురారి. భోజనాలు చేస్తుండగా మురారి చేతికి ఉన్న ఉంగరాన్ని చూస్తారు రేవతి వాళ్లు. ఎక్కడిది అంటూ నిలదీస్తారు. ఏం సమాధానం చెప్పాలో తెలియక తడబడతాడు మురారి. ఇందాక గుడిలో కమిషనర్ గారు కనిపించారు కదా ఆయనే గిఫ్ట్ గా ఇచ్చారు అని అబద్ధం చెప్తాడు మురారి. లంచ్ పూర్తవడంతో అక్కడ నుంచి అందరూ బయలుదేరుతారు.
ఇంటికి వచ్చిన తరువాత ఒంటరిగా ఉన్న మురారి కృష్ణ ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేస్తాడు. అది కృష్ణ తయారుచేసిన పర్సు. అందులో కొంచెం డబ్బుతో పాటు ఒక లెటర్ కూడా ఉంటుంది. ఇందులో ఐ లవ్ యు అని రాసి ఉంటుందా అంటూ చాలా ఎక్సైట్మెంట్తో ఆ లెటర్ తీసి చదువుతాడు మురారి. ఈ జన్మకి మీరే నా దేవుడు అంటూ రాసి ఉంటుంది ఆ లెటర్ లో.
అంటే కృష్ణ కి నా మీద భక్తి భావం తప్పితే ప్రేమ లేదన్నమాట అని బాధపడతాడు మురారి. అప్పుడే తన వేలికి ఉన్న ఉంగరాన్ని చూసుకొని వాష్ రూమ్ కి వెళ్లి బలవంతంగా ఉంగరాన్ని తీసి పడేస్తాడు. అదే సమయంలో కిందన కృష్ణ పాయసం తయారు చేసి అందరికీ ఇస్తుంది. పాయసం ఇస్తున్నప్పుడు మీ ఏసీబీ సార్ ఏడి ఇలా రమ్మను వాడితో మాట్లాడాలి అసలే రేపటి నుంచి ఇంట్లో ఉండను అంటుంది భవాని.
ఇంట్లో ఉండరా అని ఆశ్చర్యంగా అడుగుతుంది కృష్ణ. అవును ఏం పండగ చేసుకుంటావా అని నవ్వుతుంది భవాని. ఆశ్రమంలో హాస్పిటల్ కట్టించటానికి వెళ్తున్నాను వెళ్లి మీ ఆయన తీసుకురా అనటంతో డాబా మీదకి వెళ్లబోతుంది కృష్ణ. అంతలోనే ముభావంగా మెట్లు దిగుతూ కనిపిస్తాడు మురారి. గిఫ్ట్ చూసి ఆనందంగా నాకు థాంక్స్ చెప్తారు అనుకుంటే ముభావంగా ఉన్నారేంటి అనుకుంటుంది కృష్ణ.
పరధ్యానంగా ఉన్న మురారి మెట్లు దిగుతూ కాలుజారుతాడు. కృష్ణ పట్టుకుంటుంది. చూసుకొని నడవాలి కదా అంటారు రేవతి, భవాని. తన చేతికి ఉంగరం లేదు అని ముకుంద కి తెలిసేలాగా చెయ్యి పెడతాడు మురారి. చేతికి ఉంగరాన్ని లేకపోవడం చూసి కన్నీరు పెట్టుకుంటుంది ముకుంద. నేను రేపు హాస్పిటల్ కి వెళ్తున్నాను ఏదైనా అవసరమైతే ఫోన్ చేయండి అంటూ అందరికీ జాగ్రత్తలు చెప్తుంది భవాని.
అంత ధైర్యంగా నువ్వు నాకు ఉంగరం తొడిగినప్పుడు నేను కూడా అంతే ధైర్యంగా నా ప్రేమని కృష్ణకి తెలియజేయాలి.. నేను కృష్ణతో ప్రేమగా ఉంటేనే ముకుంద నా జోలికి రాదు అనుకుంటాడు మురారి. తన చేతికి ఉంగరం లేదు అని పదేపదే చూపిస్తున్నట్లుగా పాయసాన్ని తింటాడు మురారి. అతని ప్రవర్తనికి బాధపడుతుంది ముకుంద. తన గదిలోకి వెళ్లి ఏడుస్తుంది. నేను తొడిగిన ఉంగరం పెట్టుకోవడం మురారికి ఇష్టం లేనట్లుగా ఉంది.
నా ఎమోషన్స్ ని పట్టించుకోవడం లేదు అలా అయితే నేను వేరే రూట్లో వస్తాను ఆ దారిని ఎప్పటికీ మూయలేవు అనుకుంటుంది ముకుంద. తరువాయి భాగంలో ఊరు వెళ్తూ ముకుంద కి జాగ్రత్తలు చెప్తుంది భవాని. ఇంకా ఎన్నాళ్ళు ఒంటరిగా ఉంటుంది తను నేను శాశ్వతంగా ఇంటికి తీసుకు వెళ్ళిపోతాను. కోర్టులో పిటిషన్ వేస్తాను ఆదర్శ లేడు కాబట్టి ఈజీ గానే విడాకులు వస్తాయి అంటాడు ముకుంద తండ్రి. ఆ మాటలకి కుటుంబ సభ్యులందరితోపాటు ముకుంద కూడా షాక్ అవుతుంది.