- Home
- Entertainment
- Krishna Mukunda Murari: తీరని వేదనలో ముకుంద.. కనికరం చూపించమంటూ వేడుకుంటున్న కృష్ణ!
Krishna Mukunda Murari: తీరని వేదనలో ముకుంద.. కనికరం చూపించమంటూ వేడుకుంటున్న కృష్ణ!
Krishna Mukunda Murari: స్టార్ మా లో ప్రసారమవుతున్న కృష్ణ ముకుందా మురారి సీరియల్ మంచి కంటెంట్ తో టాప్ సీరియల్స్ సరసన స్థానం సంపాదించుకుంటుంది. తన మాట కాదన్నందుకు మాట్లాడొద్దు అంటూ కొడుకు, కోడలికి శిక్ష వేసిన ఒక అత్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 28 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో భోజనం ఏమి లేకపోవడంతో మంచినీళ్లు తాగుతాడు మురారి. పైకి వచ్చిన తర్వాత కాస్త మంచినీళ్లు అయినా తాగవలసింది అని భార్యతో అంటాడు మురారి. తాగాలనిపించలేదు అందుకే తాగలేదు ఉంటుంది కృష్ణ. నువ్వు ఆకలికి ఉండలేవు బయటకి వెళ్లి తిందాం పద అంటాడు మురారి. మీరు కూడా ఆకలిగా ఉండలేకపోతున్నారా అంటుంది కృష్ణ.
ఆకలితో ఉండడం మాకు ట్రైనింగ్ లోనే అలవాటు అంటాడు మురారి. బయటికి వెళ్లొద్దు, ఆకలితో ఉంటేనే మన తప్పు తెలుస్తుంది అనుకున్నారో ఏమో పెద్ద అత్తయ్య. ఆకలితోనే ఉందాము, ఈ రాత్రికి ఓర్చుకుంటే రేపటి నుంచి మన ఇద్దరికి నేను వంట చేస్తాను అంటుంది కృష్ణ. అంతవరకు ఆకలికి ఆగగలవా అంటాడు మురారి. ఏ దేవత అయినా నాలుగు పళ్ళు పంపిస్తే బాగుండు అనుకుంటుంది కృష్ణ.
ఇంతలో తలుపు శబ్దం అవ్వటంతో నిజంగా దేవత వచ్చేసిందా అంటూ కంగారుపడుతుంది కృష్ణ. మురారి వెళ్లి తలుపు తీసేసరికి అక్కడ ఎవరూ ఉండరు. కింద పళ్ళు పెట్టిన ప్లేట్లు రెండు ఉంటాయి. అవి తీసుకొని లోపలికి వచ్చేస్తాడు మురారి. రేవతి కామ్ గా అక్కడినుంచి వెళ్ళిపోతుంది. అక్కడ ఎవరూ లేరు కదా నిజంగానే దేవత వచ్చి ఉంటుందా అంటుంది కృష్ణ. అవును నిజంగానే ప్రతి ఇంటికి ఒక దేవత ఉంటుంది.
ఆ దేవత పేరు అమ్మ అంటాడు మురారి. ఈ పళ్ళు రేవతి అత్తయ్య తీసుకొచ్చారని నాకు తెలుసు అంటుంది కృష్ణ. మరి ఏమి తెలియనట్లు ఎందుకు అడిగావు అంటాడు మురారి. మీరు ఊహించారో, లేదో అని అడిగాను అంటుంది కృష్ణ. అమ్మ గురించి కోడలు నువ్వే అర్థం చేసుకున్నావు అలాంటిది కొడుకుని నేను అర్థం చేసుకోలేనా అంటాడు మురారి. నవ్వుకుంటూ ఆ పండ్లు తింటారు ఇద్దరూ.
మరోవైపు ముకుంద బాధపడుతూ కృష్ణ వల్లే మురారి అందరితోపాటు నాకు కూడా దూరమయ్యాడు. మురారిని ఎదురుగా చూస్తూ మాట్లాడకుండా నేను ఉండలేను ఏం చేయాలి అనుకుంటూ ఆవేదన పడుతుంది. మరోవైపు స్నానం చేసి వచ్చి భర్తని లేపుతుంది కృష్ణ. ఈరోజు నువ్వు కొత్తగా కనబడుతున్నావు అంటాడు మురారి. తల దువ్వి జడ వేస్తారా అని భర్తని అడుగుతుంది కృష్ణ. నున్నగా గుండు చేస్తాను, దువ్వె పని ఉండదు అంటూ భార్యని ఆటపాటిస్తాడు మురారి.
నవ్వుకుంటూ మీరు త్వరగా రెడీ అయి వస్తే టిఫిన్ పెడతాను అంటూ కిచెన్ లోకి వెళ్తుంది కృష్ణ. అక్కడ రేవతి ముందు మాట్లాడదు కానీ అక్కడ ఎవరూ లేకపోవడం చూసి పెళ్లి బాగా జరిగిందా అంటూ మాటలు కలుపుతుంది రేవతి. గొడవలతోనే జరిగింది అంటుంది కృష్ణ. నందిని సంతోషంగా ఉందా, మొత్తానికి ఘటికురాలివే పెళ్లి చేయకుండా ఇంటికి రావద్దన్నానని పెళ్లి చేసే వచ్చావు అంటూ కోడల్ని మెచ్చుకుంటుంది రేవతి.
మురారి ఫీలవుతున్నాడా అని అడుగుతుంది రేవతి. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం గమనించిన భవాని, రేవతి మీద కేకలు వేస్తుంది. మనం వెలివేసిన మనుషులతో నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని నిలదీస్తుంది. నేనేమీ మాట్లాడలేదు అంటూ సాక్షిగా కృష్ణని చూపిస్తుంది. నేను అత్తయ్య ఏమీ మాట్లాడుకోలేదు ఆవిడ పని ఆవిడ చేసుకుంటున్నారు నా పని నేను చేసుకుంటున్నాను అంటుంది కృష్ణ.
ఎవర్ని నమ్మిస్తున్నావు, నా మాటల్ని ఖాతరు చేయకుండా అత్త కోడళ్ళు ఇద్దరు ముచ్చట్లు పెట్టుకుంటున్నారా? నిన్ను కూడా వెలివేయమంటావా అంటుంది భవాని. వద్దత్తయ్య మీరు ఆవిడ చేతి భోజనమే తినాలి, ఆవిడని వెలివేస్తే మీరందరూ హోటల్ భోజనం తినవలసిందే అంటుంది కృష్ణ. వాళ్లకి హోటల్ భోజనం పడదు కృష్ణ, నేను వండితేనే వాళ్ళు తృప్తిగా భోజనం చేస్తారు అంటూ కబుర్లు ఆడుకుంటారు అత్త కోడళ్ళు ఇద్దరు.
మాట్లాడుకోవడం లేదు అంటూనే పేరంటానికి వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు ఏం జరుగుతుంది అంటూ గధమాయిస్తాడు ప్రసాద్. మీ అత్తయ్య మీతో మాట్లాడలేదు అంటే నేను నమ్మను అంటాడు ఈశ్వర్. కృష్ణ అసాధ్యురాలు అందర్నీ బుట్టలో వేసి మాట్లాడిస్తుంది అంటుంది ముకుంద. ఇంకాపండి చాలు నేను ఇప్పటివరకు రేవతి తో మాత్రమే మాట్లాడాను.
మీరందరూ వచ్చి కృష్ణతో మాట్లాడుతున్నారు మీ అందరికీ ఏమైంది అంటూ కోప్పడుతుంది భవాని. తరువాయి భాగంలో మీ ఒడిలో పెరిగిన బాల కృష్ణుడే కదా కాస్త కనికరం చూపించవచ్చు కదమ్మ యశోదమ్మ అంటూ భవాని వినేలాగా అంటుంది కృష్ణ.ఇటు కన్న తల్లి అటు పెంచిన తల్లి ఇద్దరు మాట్లాడుకో ముఖం చిన్న పుచ్చుకున్న ఆ కృష్ణుడిని చూడండి అంటూ కన్నీరు పెట్టుకుంటుంది కృష్ణ.