- Home
- Entertainment
- Krishna Mukunda Murari: హద్దులు దాటిన ముకుంద ప్రవర్తన.. అన్నింటికీ తెగించిన మురారి!
Krishna Mukunda Murari: హద్దులు దాటిన ముకుంద ప్రవర్తన.. అన్నింటికీ తెగించిన మురారి!
Krishna Mukunda Murari: స్టార్ మా లో ప్రసారమవుతున్న కృష్ణ ముకుందా మురారి సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. పెళ్లి అయినా తన ప్రేమికుడిని దక్కించుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తానంటున్న ఒక ప్రేమికురాలి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 19 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో మీ లవ్ ప్రపోజ్ చేసుకోండి నేను రీల్స్ చేసి పెడతాను బోలెడన్ని వ్యూస్ వస్తాయి అంటాడు మధు. మురారి వద్దంటున్నా వినిపించుకోకుండా అతని చేతిలో రోజ్ పెడతాడు మధు. మురారి రోజ్ ని కృష్ణకి ఇస్తూ ఇన్నాళ్లు నా ప్రేమని చెప్పటానికి భయపడ్డాను కానీ ఇప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోతావేమో అని భయం వేస్తుంది.
అందుకే చెప్తున్నాను అంటూ ఐ లవ్ యు చెప్పి ఆమెకి రోజ్ ఇస్తాడు. ఇద్దరూ హగ్ చేసుకుంటారు. సీన్ సూపర్ గా వచ్చింది అంటాడు మధు. సిగ్గుపడి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కృష్ణ. ఇదంతా చూసిన ముకుంద కోపంతో రగిలిపోతుంది. సీన్ కట్ చేస్తే పనిచేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు రేవతి వాళ్లు.
అంతలో అక్కడికి వచ్చిన ప్రసాద్ పెద్ద వదిన లేదు కదా అంటూ నసకుతాడు. విషయం అర్థం అవుతుంది ఆడవాళ్ళకి కానీ ఏమీ మాట్లాడను. వదిన రెండు పెగ్గు లే కదా బాటిల్ ఎక్కడ ఉందో చెప్పు అని రేవతిని రిక్వెస్ట్ చేస్తాడు. మీ అన్నయ్య సిలిండర్ వెనకాతల పెట్టి ఉంటారు చూడు అంటుంది రేవతి. ఇప్పుడే మా ఆయన పట్టుకెళ్ళారు అని మధు భార్య చెప్పటంతో వీడు నాకే పోటీ వస్తున్నాడు అనుకొని కొడుకు దగ్గరికి వెళ్తాడు ప్రసాద్.
మీ ఆయన, మీ ఆయన వచ్చారు కానీ మా ఆయన ఏంటి ఇంకా రాలేదేంటి అని నవ్వుతుంది రేవతి. అంతలోనే ఈశ్వర్ కూడా వస్తాడు. ఏం కావాలి అని అడుగుతుంది రేవతి. మీ ఆడవాళ్లకు ఏంటి చెప్పేది అంటూ నేరుగా సిలిండర్ దగ్గరికి వెళ్లి నెలుకుతాడు. అక్కడ బాటిల్ కనిపించకపోవడంతో వచ్చి రేవతి వాళ్ళని అడుగుతాడు. ఆడవాళ్ళ మేమేం చెప్తాము అంటూ కాసేపు ఆట పట్టించి ప్రసాద్ దగ్గర ఉన్నట్లుగా చెప్తారు రేవతి వాళ్లు.
అప్పటికే తండ్రి కొడుకులు బాటిల్ కోసం గొడవ పడుతూ ఉంటారు. ఈశ్వర్ వెళ్లి ఆ బాటిల్ లాక్కుంటాడు. నీకు కంపెనీ ఇస్తాను అన్నయ్య అని బ్రతిమాలుకుంటాడు ప్రసాద్. అవసరమైతే నా కంపెనీ రాసిస్తాను గాని ఈ కంపెనీ మాత్రం వద్దు అని అక్కడినుంచి వెళ్ళిపోతాడు ఈశ్వర్. అలా అంటాడు కానీ నేను లేకుండా మా అన్నయ్య తాగలేడు అనుకుంటూ ఈశ్వర్ ని ఫాలో అయిపోతాడు ప్రసాద్.
మరోవైపు మురారి దగ్గరికి వచ్చి ఎంగేజ్మెంట్ రింగ్ ఎందుకు తీసేసావు అని అడుగుతుంది ముకుంద. నీకు నాకు ఎంగేజ్మెంట్ ఏంటి అందుకే తీసేసాను అంటాడు మురారి. అలా అని నువ్వు అనుకుంటే సరిపోతుందా నేను కూడా అనుకోవాలి కదా అంటూ ఐ లవ్ యు చెప్తుంది ముకుంద. అప్పుడే అటుగా వస్తున్న మధు ఈ మాటలు విని షాక్ అవుతాడు.
ఇప్పుడే రేవతి పెద్దమ్మకి రెడ్ హ్యాండెడ్ గా పట్టిస్తాను అనుకొని ఆమె దగ్గరికి వెళ్తాడు. నాన్న నన్ను డైవర్స్ తీసుకొని మరో పెళ్లి చేసుకోమంటున్నాడు నేను అలాగే చేసుకుంటాను కానీ ఆ చేసుకునేది నిన్నే అంటూ షాక్ ఇస్తుంది. అలా ఎప్పటికీ జరగదు కృష్ణ ఒకవేళ వెళ్ళిపోతే ఒంటరిగా అయినా ఉంటాను అంటాడు మురారి. నాతో సవాలు విసరకు అవసరమైతే నేను ఎంత దూరమైనా వెళ్తాను అంటూ సవాల్ విసిరితుంది ముకుంద.
నువ్వు వెళ్ళగా లేనిది నేను మాత్రం వెళ్ళలేనా అంటూ మొండిగా మాట్లాడుతాడు మురారి. అలా అయితే అసలు విషయం ఇంట్లో చెప్పేస్తాను అంటూ బెదిరిస్తుంది ముకుంద. ఈ మాటలు విని విని విసిగిపోయాను ఇంట్లో చెప్పి నాకు సాయం చేసిన దానివి అవుతావు అంటాడు మురారి. ఇద్దరూ ఒకరికి ఒకరు ఛాలెంజ్ చేసుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అప్పటికే మధు, రేవతిని తీసుకు రావటంతో ఈ మాటలన్నీ వింటుంది రేవతి. ఈ విషయం మధు ఇంట్లో అందరికీ చెప్పేస్తాడని భయపడి మధు చెంప పగలగొడుతుంది రేవతి.
వాళ్ళిద్దరూ మామూలుగా మాట్లాడుకుంటే నువ్వు తప్పుగా అనుకుంటావా ఈ విషయం పెద్ద పెద్ద మీకు తెలిసిందంటే షూట్ చేసేస్తుంది అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏం జరిగిందో అర్థం కాక అయోమయం లో పడతాడు మధు. తర్వాత ఆలోచనలో ఉన్న మురారి కి కళ్ళు మూస్తుంది కృష్ణ. ఏమైంది అంటాడు మురారి. ఎందుకు అంత చికాకుగా ఉన్నారు మీ మూడు ఎవరు పాడు చేశారు.. ఇకమీదట మీకు ఇలాంటి బాధ ఉండకూడదని ఒక బ్రహ్మాండాన్ని చూపిస్తాను అంటూ కళ్ళు మూసి తన గదికి తీసుకువెళ్తుంది కృష్ణ. అక్కడ రకరకాల ఫోజ్లతో వున్న తన ఫోటోలు గోడకి తగిలించి వాటిని మురారికి చూపిస్తుంది. వాటిని చూసి ఆనందపడతాడు మురారి. తరువాయి భాగంలో క్లోజ్ గా ఉన్న మురారి కృష్ణలను చూసి అసూయతో రగిలిపోతుంది ముకుంద.