MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • వ్యాపారం
  • వీడియోలు
  • Home
  • Entertainment
  • అశ్వత్థామని ఆడుకున్న అవినాష్‌, కామెడీ అనుకుంటే ఫైర్‌ చూపించాడే?.. వేడెక్కించిన నామినేషన్‌

అశ్వత్థామని ఆడుకున్న అవినాష్‌, కామెడీ అనుకుంటే ఫైర్‌ చూపించాడే?.. వేడెక్కించిన నామినేషన్‌

అశ్వత్థామ 2.0 అంటూ హౌజ్‌లోకి వచ్చిన గౌతమ్‌ ఎర్రి పుష్పం అవుతున్నాడు. తాజాగా ఆయన్ని అవినాష్ ఎదుర్కొన్నాడు. ఓరేంజలో ఫైర్‌ అవుతూ రచ్చ చేశాడు. 
 

Aithagoni Raju | Published : Oct 14 2024, 11:41 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌ ఆరువారాలు పూర్తి చేసుకుంది. ఏడుగురు కంటెస్టెంట్లు ఇప్పటి వరకు ఎలిమినేట్‌ అయ్యారు. ఈ ఆదివారం కిర్రాక్ సీత ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. ఆమె టాస్క్ ల్లో యాక్టివ్‌గా లేకపోవడం, గేమ్‌ ఆడాల్సి వచ్చిన ఆడలేకపోవడంతో ఓటింగ్‌ తగ్గిపోయింది. చివరకు ఎలిమినేట్‌ కావాల్సి వచ్చింది. ఇక ప్రస్తుతం హౌజ్‌లో 15 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. గత వారం వైల్డ్ కార్డ్ ద్వారా 8 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మొదట్లో 14 మందితో షో ప్రారంభం కాగా, ఐదు వారాలకు ఆరుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్‌ అయ్యారు. ఎనిమిది మందికి, వైల్డ్ కార్డ్ ద్వారా మరో ఎనిమిి మంది మాజీ బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వడం విశేషం. 
 

25
Asianet Image

అయితే ఈ సారి ఎంటర్‌టై్‌మెంట్‌ పాళ్లు పెంచారు. మొదట్లో వచ్చిన వాళ్లంతా సీరియస్‌ గేమ్స్ ఆడుతున్నారు. దీంతో ఎంటర్‌టైన్‌మెంట్‌కి స్కోప్‌ పెంచి అవినాష్‌, రోహిణి, హరితేజ, టేస్టీ తేజ, గంగవ్వలను దించారు. వీరితోపాటు గౌతమ్‌ (అశ్వత్థామ), నయని పావణి, మెహబూబ్‌ వంటి వారిని హౌజ్‌లోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత షో మరింత ఆసక్తికరంగా మారింది. పాత వాళ్లు డల్‌ అయ్యారు, కొత్తవాళ్లు రెచ్చిపోయారు. బిగ్‌ బాస్‌ షోఇప్పుడు రక్తికట్టించేలా సాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏడోవారం ప్రారంభమైంది. కీలకమైన నామినేషన్ల ప్రక్రియ వాడివేడిగా సాగింది. 
 

35
Asianet Image

అయితే ఈ సారి కాస్త భిన్నంగా ప్లాన్‌ చేశారు బిగ్‌ బాస్‌. నామినేట్ చేయాలనుకున్న వారికి సరైన కారణం చెప్పాల్సి ఉంటుంది. అయితే ఏది సరైనదో కిల్లర్ లేడీస్‌ హరితేజ, ప్రేరణలు నిర్ణయిస్తారు. వాళ్లు ఓకే చేస్తేనే నామినేషన్‌ ఓకే అవుతుంది. అదే సమయంలో ఎవరు నామినేట్‌ చేయాలనుకుంటున్నారో, వారిలో ఇద్దరు పోటీపడి సాధించాల్సి ఉంటుంద. ఈ క్రమంలో రోహిణి.. గౌతమ్‌ని నామినేట్‌ చేసింది. అలాగే నిఖిల్‌.. టేస్టీ తేజని, యష్మి.. తేజని, మణికంఠ నిఖిల్‌ని, అవినాష్‌ మణికంఠని, గౌతమ్‌.. విష్ణు ప్రియాని నామినేట్‌ చేశారు. ఈ ప్రక్రియ ఇంకా సాగుతూనే ఉంది. ఈ వారం మొత్తంగా తొమ్మిది మంది నామినేట్‌ అయినట్టుసమాచారం. సోమవారం ఎపిసోడ్‌లో ఐదుగురు నామినేట్‌ అయినట్టుగానే చూపించారు. 

45
Asianet Image

ఇదిలా ఉంటే ఇందులో ఇప్పటి వరకు కామెడీ చేసే అవినాష్‌ ఒక్కసారిగా తనలోని మరో యాంగిల్‌ చూపించారు. రోహిణి.. గౌతమ్‌ని నామినేట్‌ చేస్తూ ఆయన ఆవేశంలో మైక్‌ని ఇరగ్గొట్టడాన్ని ఆమె తప్పుపట్టింది. అది నచ్చలేదని తెలిపింది. బిగ్‌ బాస్‌ ప్రాపర్టీస్‌ని అలా బాధ్యతరహితంగా చేయడం పట్ల తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈ క్రమంలో గౌతమ్‌ అవినాష్‌ ప్రస్తావన తీసుకొచ్చాడు. దీంతో ఇద్దరు రెచ్చిపోయారు. గౌతమ్‌ ఎగిరిపడుతుంటే, అవినాష్‌ ఆయన్ని మించి రెచ్చిపోయాడు. కామెడీ కాదు, ఈ సారి ఫైర్‌ చూపించాడు. ఎప్పుడూ నవ్వించే అవినాష్‌లో ఈ సీరియస్‌ యాంగిల్‌ అందరిని ఆశ్చర్యపరిచింది. అశ్వత్థామ 2.0 అంటూ రచ్చ చేసిన గౌతమ్‌ ఎర్రిప్పల 
 

55
Asianet Image

ఇక ఏడో వారం నామినేషన్లలో నిఖిల్‌, పృథ్వీరాజ్‌, యష్మి, హరితేజ, మణికంఠ, నబీల్‌, గౌతమ్‌, ప్రేరణ, టేస్టీ తేజ లు నామినేట్‌ అయినట్టు తెలుస్తుంది. అయితే వీరిలో ఎవరు ఈ వారం ఎలిమినట్‌ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. గౌతమ్‌, మణికంఠ, పృథ్వీరాజ్‌ల మధ్య ఫైట్ ఉండబోతుందని, వీరిలోనే ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందట. సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ ఎనిమిదవ బిగ్‌ బాస్‌ షో ఇప్పటికే ఆరు వారాలు పూర్తి చేసుకన్న విషయం తెలిసిందే. 

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories