పెళ్లి, భర్తపై మృణాల్ ఠాకూర్ క్రేజీ కామెంట్.. ద్రోహం చేస్తారేమో అని భయం
ప్రేమ, కాబోయే భర్త గురించి హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ముఖ్యంగా లవ్ బ్రేకప్ గురించి క్రేజీ కామెంట్స్ చేశారు.

ప్రేమ, భర్త గురించి మృణాల్ ఠాకూర్ కామెంట్
తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సందడి చేసిన మృణాల్ ఠాకూర్ ఇప్పుడు గ్యాప్ ఇచ్చింది. ఇతర భాషల్లో వరుసగా సినిమాలతో బిజీగా ఉంది. ముఖ్యంగా హిందీలో ఆమె బిజీగా ఉంటోంది. అయితే ఇటీవల హీరో ధనుష్‌తో పలు సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లలో మెరిసి వార్తల్లో నిలిచింది. వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే వార్తలు ఊపందుకున్నాయి. వీటిని ఖండించిన మృణాల్ తాజాగా ప్రేమ, కాబోయే భర్తకి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె కామెంట్స్ వైరల్‌గా మారాయి.
KNOW
ప్రేమలో ద్రోహాన్ని సహించలేను
ప్రేమలో తనకు అతిపెద్ద భయం ద్రోహం అని చెప్పింది మృణాల్ ఠాకూర్. యూట్యూబర్, పాడ్ కాస్టర్ రణ్ వీర్ అల్లాబాడి కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తనకు ముందున్న ప్రేమ ఇప్పుడు లేదని తన భాగస్వామి చెబితే అంగీకరిస్తానని, కానీ ద్రోహం చేస్తారేమో అనే భయం తనని వెంటాడుతుందని మృణాల్ చెప్పారు. నిజమైన ప్రేమే తనకు ముఖ్యమని, స్కూల్, కాలేజీ ఫ్రెండ్స్ ఇప్పటికీ టచ్‌లోనే ఉన్నారని, వారితో రిలేషన్ కంటిన్యూ అవుతుందన్నారు.
లవ్ బ్రేకప్ జీవితంలో భాగమే
అన్నీ సరిగ్గా ఉన్న వ్యక్తితో జీవించాలని తాను కోరుకోవడం లేదని, తన జీవితంలో ఎదురైన సవాళ్ల గురించి మృణాల్ చెప్పారు. ప్రేమలో విఫలమైనా, అది జీవితంలో ఒక భాగమని తాను అంగీకరించినట్టు తెలిపారు. తాను చాలా ప్రాక్టికల్‌గా ఉంటానని, ఇవన్నీ జీవితంలోని అనుభవాల నుంచి నేర్చుకున్నట్టు తెలిపారు మృణాల్. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ధనుష్ మంచి స్నేహితుడు మాత్రమే
ముంబైలో జరిగిన 'సన్ ఆఫ్ సర్దార్ 2' సినిమా ఈవెంట్ లో ధనుష్, మృణాల్ మాట్లాడుకుంటున్న వీడియో బయటకు రావడంతో, ఇద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు వ్యాపించాయి. అలాగే మృణాల్ పుట్టినరోజు వేడుకలో ధనుష్ పాల్గొన్నారని వార్తలు వచ్చాయి. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో ధనుష్ నటించిన 'తేరే ఇష్క్ మే' చిత్ర రచయిత, నిర్మాత కనికా థిల్లాన్ ఏర్పాటు చేసిన విందులో ధనుష్, మృణాల్ పాల్గొన్నారు. మృణాల్, ధనుష్ సోదరీమణులను ఇన్ స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారని వార్తలు వచ్చాయి. దీనిపై మృణాల్ స్పందిస్తూ ధనుష్, తాను మంచి స్నేహితులం మాత్రమే అని చెప్పారు. రూమర్స్ లో నిజం లేదని తెలిపారు. ధనుష్.. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యను వివాహం చేసుకుని, 18 ఏళ్ళు కలిసి జీవించి, ఇద్దరు పిల్లల తర్వాత 2022 లో విడాకులు తీసుకున్నారు.
మృణాల్ ఠాకూర్ మూవీ లైనప్
ప్రస్తుతం దక్షిణాది సినిమాల్లో మృణాల్ నటిస్తున్నారు. `సీతా రామం` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మృణాల్ సీతగా గుర్తిండిపోయింది. ఆ తర్వాత నానితో `హాయ్ నాన్న`లో నటించి ఆకట్టుకుంది. దీంతోపాటు విజయ్ దేవరకొండతో `ఫ్యామిలీస్టార్`లో హీరోయిన్‌గా చేసింది. కానీ ఈ సినిమా ఆడలేదు. ప్రస్తుతం అడవిశేష్‌తో `డెకాయిట్`లో, అలాగే అల్లు అర్జున్-అట్లీ మూవీలో నటిస్తుంది. హిందీలో మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.