- Home
- Entertainment
- Mrunal Thakur: `హాయ్ నాన్న` నుంచి నయా లుక్.. ఆత్మహత్య ఆలోచన నుంచి పాన్ ఇండియా హీరోయిన్‌గా బర్త్ డే బ్యూటీ
Mrunal Thakur: `హాయ్ నాన్న` నుంచి నయా లుక్.. ఆత్మహత్య ఆలోచన నుంచి పాన్ ఇండియా హీరోయిన్‌గా బర్త్ డే బ్యూటీ
నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న మృణాల్ ఠాకూర్ జర్నీ.. అత్యంత స్ఫూర్తిదాయకంగా సాగింది. ఇండస్ట్రీని వదిలేద్దానుకునే స్థితి నుంచి ఇప్పడు మోస్ట్ పాపులర్ పాన్ ఇండియా హీరోయిన్‌గా ఎదిగిందీ బ్యూటీ

Mrunal Thakur
తెలుగులోకి సడెన్‌గా, సర్‌ప్రైజింగ్‌గా దూసుకొచ్చిన బ్యూటీ మృణాల్ ఠాకూర్. అంతకు ముందు కెరీర్ పరంతో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. వచ్చిన అవకాశాలను కోల్పోయింది. సీరియల్ నటి అంటూ చిన్నచూపు, నటన రాదంటూ హేళన, అవకాశాలు రాకపోవడం వంటి కారణాలతో అనేక స్ట్రగుల్స్ ఫేస్ చేసింది మృణాల్. ఒకానొక సమయంలో ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకుంది. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చిన అనేక కష్టాలు పడింది.
దశాబ్దం పోరాటం అనంతరం ఇప్పుడు మృణాల్‌కి లైఫ్ వచ్చింది. ఇప్పుడు ఆమె టైమ్ వచ్చింది. `సీతా రామం` ఆమెకి బ్రేకిచ్చింది. `లవ్ సోనియా, `సూపర్ 30`, `బాట్లా హైజ్`, `ఘోస్ట్ స్టోరీస్`, `తుఫాన్`, `ధమాఖా`, `జెర్సీ` చిత్రాలు ఇవ్వని బ్రేక్.. `సీతారామం` ఇచ్చింది. పాన్ ఇండియా వైడ్‌గా క్రేజ్‌ని, గుర్తింపుని తెచ్చిపెట్టింది. దీంతో ఇప్పుడు హిందీతోపాటు తెలుగు, తమిళం చిత్రాల్లోనూ అవకాశాలను అందుకుంటుంది. బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంది.
తెలుగులో ఇప్పటికే రెండు సినిమాలకు కమిట్ అయ్యింది మృణాల్. నానితో `హాయ్ నాన్న` చిత్రంలో నటిస్తుంది. నానికి జోడీగా కనిపించనుంది. ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్ లో ఆమె మెరిసింది ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి కొత్త లుక్‌ని విడుదల చేశారు. నేడు మంగళవారం మృణాల్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ఆమె కొత్త లుక్‌ని రిలీజ్ చేయగా, ఇది ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
ప్లజెంట్ లుక్‌లో కట్టిపడేస్తుంది మృణాల్. ఆమె చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది. వెనకాల బ్యాగ్ ధరించింది. బ్యాక్ డ్రాప్‌లో నాని ఉన్నాడు. ఇందులో మృణాల్ వైట్ డాట్స్ పర్పుల్ కలర్ డ్రెస్ ధరించింది. నిండుదనంతో కనిపిస్తుంది. చెవిపోగులు, ముక్కు పుడక, చేతికి రింగ్ ఇలా ఆద్యంతం అందంతో కట్టిపడేస్తుందీ బ్యూటీ. శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 21న పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ కాబోతుంది.
ఇదే కాదు విజయ్ దేవరకొండతో పరశురామ్ చిత్రంలో నటిస్తుంది. `వీడీ 13`పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాత. ఇటీవల ఈ చిత్రం ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంతోపాటు మరో బంపర్ ఆఫర్ మృణాల్‌ని వరించిందని తెలుస్తుంది. రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా మృణాల్ పేరు వినిపిస్తుంది. ఆల్మోస్ట్ కన్ఫమ్ అయినట్టు టాక్.
Mrunal Thakur
అటు హిందీలోనూ ఆమె బిజీగా ఉంది.అక్కడ `పూజా మేరీ జాన్`, `పిప్పా`, `ఆంఖ్ మిచోలి` చిత్రాలు చేస్తుంది. ఈ సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఈ ఏడాది రెండు సినిమాలు రాబోతున్నాయి. ఇటు తెలుగులోనూ ఓ సినిమా విడుదల కానుంది. ఇలా ఈ ఏడాది మూడు సినిమాలతో రచ్చ చేయబోతుందీ బ్యూటీ. అదే సమయంలో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లకి ఝలక్ ఇస్తుంది. వరుస ఆఫర్లు దక్కించుకుంటూ వారికి పోటీగా మారిందీ హాట్ బ్యూటీ. నేడు ఈ అమ్మడు తన 31వ బర్త్ డే జరుపుకుంటుండటం విశేషం.