ఫ్యామిలీ నుంచి నాకు సపోర్ట్ లేదు, కారణం అదే.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్
సినిమాల విషయంలో ఫ్యామిలీ సపోర్ట్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఇండస్ట్రీలో తాను చేసిన ఒంటరి పోరాటం కూడా గుర్తు చేసుకున్నారు.

ఇండస్ట్రీలో స్టార్ డమ్ కోసం చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్న హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ స్టార్ ఇమేజ్ కోసం ఎంతో ప్రయత్నిస్తుంటారు. కాని ఫలితం లేకు వదిలేసిన వాళ్లు ఇంకొంత మంది. అదేంటో కొందరు హీరోయిన్లకు మొదటి సినిమాతోనే స్టార్ డమ్ అలా వచ్చిపడుతుంటుంది. అలాంటి హీరోయిన్లలో మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు.
టాలీవుడ్ లో మొదటి సినిమాతోనే స్టార్ డమ్ వచ్చిన తారలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆలిస్ట్ లో సీతా రామం బ్యూటీ కూడా ఉంది. సీతారామం సినిమాతో సంచలన విజయాన్ని సాధించింది మృణాల్. ఈ సినిమాతో టాలీవుడ్ నుంచి భారీ ఆఫర్లు కూడా అందుకుంటుంది చిన్నది.
సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడ రెచ్చిపోతుంటుంది బ్యూటీ. వరుసగా హాట్ హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తుంది చిన్నది. ఇండస్ట్రీలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా.. తట్టుకుని నిలబడింది మృణాల్. ఆ ధైర్యంతోనే ఇండస్ట్రీలో కొనసాగుతుంది. అంతే కాదు తన అభిప్రయాలు ఏవైనా పబ్లిక్ గా ఏభాయం లేకుండా చెప్పేస్తుంటుంది మృణాల్.
ఇక తాజాగా తన మూవీ కెరీర్ గురించి.. తన ఫ్యామిల సపోర్ట్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది మృణాల్. తాజాగా ఓ స్టేజ్ పై మాట్లాడుతూ .. మాది మరాఠీ ఫ్యామిలీ .. నేను యాక్టింగ్ వైపు రావడం మా పేరెంట్స్ కి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే మా ఫ్యామిలీలో సినిమాకు సబంధించిన వారు లేరు అని అన్నారు మృణాల్.
అసలు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి వారికిపెద్దగా తెలియకపోవడమే అందుకు కారణం. అందువల్లనే వారునన్ను సపోర్ట్ చేయలేకపోయారు అన్నారు. నేను ఒంటరిగా ఇండస్ట్రీలోకి వచ్చి.. ఒంటరిగానే పోరాటం చేశాను అన్నారు మృణాల్. అందుకే నాలో ఈ ధైర్యం అంటూ కామెంట్లు చేసింది హీరోయిన్.
Sita Ramam Mrunal Thakur
నేను టీవీ సీరియల్స్ లో నటిస్తూ వెళ్లాను. అక్కడ వచ్చిన గుర్తింపు నన్ను సినిమాల వైపు తీసుకుని వెళ్లింది. నేను ఎంచుకున్న కథలు .. పాత్రలు నాకు మంచి పేరును తీసుకుని వస్తున్నాయి. ఇప్పుడు చాలామంది నన్ను స్మితా పాటిల్ తో పోల్చుతున్నారు. నిజంగా నేను ఈవిషయంలో గర్విస్తున్నాను అన్నారు.
నాకు ఫ్యామిలీ నుంచి సపోర్ట్ రాకపోయినా.. ఇప్పుడు నా ఫీల్డ్ గురించి.. నా స్టార్ డమ్ గురించి మా పేరెంట్స్ కూడా తెలుసుకున్నారు. అందుకే ప్రస్తుతం నా విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్పుకొచ్చ్చారు. మృణాల్. ప్రస్తుతం ఈ హీరోయిన్ నానీతో 30వ సినిమాలో నటిస్తున్నారు. నానీ 30 తో ఆమె ఇమేజ్ పాన్ ఇండియాకు వెళ్ళేలా ప్లాన్ చేస్తున్నారు.