ఒక్క ఓటుతో ఆస్కార్ అవార్డు మిస్సైన ఏకైక ఇండియాన్ సినిమా ఏదో తెలుసా?
టాలీవుడ్ నుంచి ఆర్ఆర్ఆర్ సినిామా తొలి ఆస్కార్ ను సాధించింది. అయితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆస్కార్ సాధించిన సినిమాలు చాలా ఉన్నాయి. అయితే ఒక్క ఓటు తేడాతో ఆస్కార్ మిస్సైన సినిమా గురించి మీకు తెలుసా?

టాలీవుడ్ నుంచి తొలి ఆస్కార్ సినిమా
టాలీవుడ్ నుంచి తొలి ఆస్కార్ సాధించిన సినిమాగా ఆర్ఆర్ఆర్ రికార్డు సాధించింది. ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈసినిమా.. బెస్ట్ మ్యూజిక్ క్యాటగిరీలో నాటు నాటు పాటకు ఆస్కార్ వరించింది. తెలుగు సినిమాను హాలీవుడ్ స్థాయిలో నిలబెట్టింది సినిమా. అయితే అందుకు ముందు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆస్కార్ సాధించిన వారు చాలామంది ఉన్నారు. అంతే కాదు.. ఆస్కార్ ను ఒక్క ఓటుతో కోల్పోయిన సినిమాలు కూడా ఉన్నాయి.
భారత్ నుంచి ఆస్కార్‌కు వెళ్లిన తొలి చిత్రం
ఇండియా నుంచి ఆస్కార్ కు వెళ్లిన తొలి చిత్రం మదర్ ఇండియా. 1957 అక్టోబర్ 25న విడుదలైన 'మదర్ ఇండియా' బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఈసినిమా రిలీజ్ అయ్యి 68 ఏళ్లు పూర్తయ్యాయి.. మెహబూబ్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నర్గీస్, సునీల్ దత్, రాజేంద్ర కుమార్, రాజ్‌కుమార్, కన్హయ్యలాల్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరీలో ఆస్కార్‌కు భారత్ నుంచి వెళ్లిన తొలి సినిమా 'మదర్ ఇండియా'. కానీ, ఈ సినిమా అవార్డు గెలవడంలో విఫలమైంది. కేవలం ఒక్క ఓటుతో ఆస్కార్‌ను కోల్పోయింది.
అత్యంత ఖరీదైన సినిమా'
'మదర్ ఇండియా' ఆ కాలంలో అత్యంత ఖరీదైన సినిమా. 60 లక్షల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా 8 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇది పెట్టిన ఖర్చుకు 13 రెట్లు ఎక్కువగా వసూలు చేసింది. 'మదర్ ఇండియా' ఒరిజినల్ సినిమా కాదు. 1940లో వచ్చిన 'ఔరత్' సినిమాకు ఇది రీమేక్. ఒరిజినల్ సినిమాకు కూడా మెహబూబ్ ఖాన్ దర్శకుడు. కన్హయ్యలాల్ రెండు సినిమాల్లోనూ ఒకే పాత్ర చేశారు.
పేద పిల్లాడు మదర్ ఇండియా నటుడయ్యాడు
'మదర్ ఇండియా'లో బిర్జు (సునీల్ దత్) చిన్నప్పటి పాత్రను సాజిద్ ఖాన్ పోషించారు. ముంబైలోని ఓ మురికివాడకు చెందిన సాజిద్‌ను, గుంపులో నిలబడి ఉండగా చూసి మెహబూబ్ ఖాన్ సినిమాలో తీసుకున్నారు. ఈ రకంగా ఓ పేద పిల్లాడు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.
మదర్ ఇండియా ను రిజెక్ట్ చేసిన దిలీప్ కుమార్
రాధ (నర్గీస్) కొడుకు పాత్రను దిలీప్ కుమార్ చేయాలని దర్శకుడు మెహబూబ్ ఖాన్ కోరారు. కానీ అంతకుముందు నర్గీస్‌తో హీరోగా నటించడంతో, ఆమె కొడుకుగా నటించడానికి దిలీప్ కుమార్ నిరాకరించారు.
చరిత్ర సృష్టించిన సినిమా
అనితా గుహకు ఈ సినిమా ఆఫర్ వచ్చింది. కానీ నర్గీస్‌తో సైడ్ రోల్ చేయడానికి ఇష్టపడక, ఆమె ఆఫర్‌ను తిరస్కరించారు. ఆ పాత్ర కుంకుమ్‌కు దక్కింది. ఆమె రాజేంద్ర కుమార్ భార్యగా నటించారు. ఇక చాలా తక్కువ టైమ్ లో.. ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన మదర్ ఇండియా.. భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కానీ ఆస్కార్ ను మాత్రం సాధించలేకపోయింది. కానీ బాలీవుడ్ లో చరిత్ర సృష్టించిన సినిమాగా నిలిచింది.