- Home
- Entertainment
- మోక్షజ్ఞ హీరోగా పరిచయం కాబోతున్న ఫస్ట్ మూవీ ఇదే? బాలయ్య త్రిబుల్ రోల్.. డైరెక్టర్ ఎవరంటే?
మోక్షజ్ఞ హీరోగా పరిచయం కాబోతున్న ఫస్ట్ మూవీ ఇదే? బాలయ్య త్రిబుల్ రోల్.. డైరెక్టర్ ఎవరంటే?
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ హీరోగా ఎంట్రీకి సంబంధించిన సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ క్రమంలో లేటెస్ట్ గా అదిరిపోయే అప్ డేట్ వినిపిస్తోంది.

ప్రశాంత్ వర్మతో ఆగిపోయిన మోక్షజ్ఞ తేజ మూవీ
నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ తేజ హీరోగా ఎంట్రీకి సంబంధించిన సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా పరిచయం కాబోతున్నట్టు గతంలో ప్రకటించారు. ఈ చిత్రం ద్వారా బాలయ్య కూతురు తేజస్విని కూడా నిర్మాతగా టర్న్ తీసుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ మూవీ ఆగిపోయింది. బాలయ్యకి, దర్శకుడు ప్రశాంత్ వర్మకి మధ్య క్రియేటివ్ డిఫరెంట్స్ కారణంగా ఈ మూవీ నుంచి ప్రశాంత్ వర్మ తప్పుకున్నట్టు సమాచారం.
KNOW
మోక్షజ్ఞ తేజ కొత్త లుక్ వైరల్
ఈ నేపథ్యంలో మోక్షజ్ఞ తేజ హీరోగా పరిచయం ఎప్పుడు ఉంటుంది? దర్శకుడు ఎవరు? అనేది సస్పెన్స్ గా మారింది. తాజాగా మోక్షజ్ఞ తేజ లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది. హైదరాబాద్‌లో బంధువుల పెళ్లిలో మోక్షజ్ఞ మెరిశారు. నందమూరి ఫ్యామిలీ, నారా ఫ్యామిలీ సైతం ఇందులో పాల్గొన్నారు. చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్, నారా భువనేశ్వరి ఇలా అంతా ఇందులో సందడి చేశారు. ఈ ఫంక్షన్‌లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు మోక్షజ్ఞ తేజ. చాలా స్లిమ్‌గా కనిపిస్తున్నారు. అందంగానూ మారిపోయాడు. హీరోగా పర్‌ఫెక్ట్ సూట్ అయ్యేలా ఉన్నారు.
క్రిష్ దర్శకత్వంలో మోక్షజ్ఞ తేజ ఎంట్రీ
దీంతో ఆయన హీరోగా సినిమాకి సంబంధించిన చర్చ మళ్లీ మొదలైంది. మోక్షజ్ఞ తేజ హీరోగా ఎంట్రీ ఎవరి దర్శకత్వంలో ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా తెలుస్తోన్న సమాచారం మేరకు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ సీనియర్ దర్శకుడితో ఉండబోతుందట. క్రిష్ దర్శకత్వంలో ఆయన హీరోగా పరిచయం కాబోతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, దర్శకుడు క్రిష్ ఈ ప్రాజెక్ట్ పై వర్క్ చేస్తున్నారట.
ఆదిత్య 999లో మోక్షజ్ఞ తేజ ?
బాలయ్య, సింగీతం శ్రీనివాస రావు కాంబినేషన్‌లో వచ్చిన `ఆదిత్య 369` ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు దీనికి సీక్వెల్ `ఆదిత్య 999`ని ప్లాన్ చేస్తున్నారు. ఆ మధ్య `అన్ స్టాపబుల్` షోలోనే బాలయ్య ఈ విషయాన్ని ప్రకటించారు. తన దర్శకత్వంలోనే ఈ మూవీ ఉంటుందని, ఇందులో తనతోపాటు మోక్షజ్ఞ కూడా నటిస్తారని తెలిపారు. అయితే ఇందులో కొన్ని మార్పులు జరిగాయట. దర్శకుడిగా క్రిష్‌ని ఎంపిక చేసినట్టు సమాచారం. ప్రస్తుతం క్రిష్ `ఆదిత్య 999` స్క్రిప్ట్ వర్క్ లో ఉన్నారని, ఇందులో బాలయ్య హీరోగా నటిస్తారని, ఆయన త్రిపాత్రాభినయం చేయబోతున్నట్టు సమాచారం. ఇందులో ముఖ్య పాత్రలో మోక్షజ్ఞ కనిపిస్తారని, ఇదే ఆయన తొలి సినిమాగా ఉండబోతుందని సమాచారం. టైమ్ ట్రావెల్ కథతోనే ఇది సాగుతుందని, పాస్ట్ నుంచి ఫ్యూచర్ కి వెళ్లడం ఈ చిత్ర కథగా ఉండబోతుందని టాక్.
`అఖండ 2`తో రాబోతున్న బాలయ్య
ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలయ్య `అఖండ 2`లో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. `అఖండ`కి సీక్వెల్‌గా ఈ మూవీ రాబోతుంది. సెప్టెంబర్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. మరోవైపు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో మూవీ చేయనున్నారు బాలయ్య. ఇది దసరా తర్వాత ప్రారంభం కానున్నట్టు సమాచారం.