MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మోక్షజ్ఞ సినిమాకి బడ్జెట్‌ ఎంతో తెలిస్తే మైండ్‌ బ్లాకే? టాలీవుడ్‌లోనే సరికొత్త రికార్డు? బాలయ్య నమ్మకం అదే!

మోక్షజ్ఞ సినిమాకి బడ్జెట్‌ ఎంతో తెలిస్తే మైండ్‌ బ్లాకే? టాలీవుడ్‌లోనే సరికొత్త రికార్డు? బాలయ్య నమ్మకం అదే!

బాలయ్య తన కొడుకు మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బడ్జెట్‌ తెలిస్తే మాత్రం మతిపోవాల్సిందే.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 19 2024, 02:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

నందమూరి ఫ్యామిలీ నుంచి మూడో తరం నటులు చిత్ర పరిశ్రమలోకి క్యూ కడుతున్నారు. జూ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌, తారకరత్న, చైతన్యకృష్ణ హీరోలుగా చేశారు. ప్రస్తుతం తారక్‌, కళ్యాణ్‌ రామ్‌లు మాత్రమే హీరోలుగా రాణిస్తున్నారు. మరోవైపు నాల్గో తరం నటులు వస్తున్నారు. నందమూరి జానకీ రామ్‌ కొడుకు ఎన్టీఆర్‌ సైతం సినిమాల్లోకి వస్తున్నాడు. దర్శకుడు వైవీఎస్‌ చౌదరి ఆయన్ని పరిచయం చేస్తున్నారు. 

కెమెరాలు లేని ప్రాంతంలో నాగమణికంఠ చేసిన పనికి షాక్‌ః బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్
. 

27

ఈ క్రమంలో ఇటీవలే బాలయ్య కొడుకు మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు మూవీని కూడా అనౌన్స్ చేశారు. `హనుమాన్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో మూవీ ఉంటుందని వెల్లడించారు. ఈ సినిమాతో బాలయ్య చిన్న కూతురు తేజస్విని నిర్మాతగా మారడం విశేషం. సుధాకర్‌ చెరుకూరితో కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీని భారీ స్థాయిలో ప్లాన్‌ చేస్తున్నారు బాలయ్య. 

37

మైథలాజికల్‌ అంశాలతో మూవీని తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తుంది. సోషియో ఫాంటసీ ఎలిమెంట్లు, మైథలాజికల్‌ అంశాలను ముడిపెడుతూ పీరియాడికల్‌ ఫిల్మ్ గా తెరకెక్కిస్తున్నారని టాక్‌.  ప్రస్తుతం దీనికి సంబంధించిన వర్క్ జరుగుతుంది. అయితే ఇది ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్ లో భాగంగా ఉంటుందని సమాచారం.

సినిమా అనౌన్స్ మెంట్‌ సందర్భంగా ప్రశాంత్‌ వర్మనే ఈ విషయాన్ని వెల్లడించారు. అంటే `హనుమాన్‌` సినిమా ఎలిమెంట్లని టచ్‌ చేస్తుందని, దానికి దీనికి లింక్‌ ఉంటుందని టాక్‌. ఇప్పటికే `జై హనుమాన్‌` పేరుతో సీక్వెల్‌ని ప్రకటించిన విషయం తెలిసిందే. 
 

47

ఇదిలా ఉంటే మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ సినిమాని భారీ స్థాయిలో ప్లాన్‌ చేస్తున్నారు. బడ్జెట్‌ విషయంలో రాజీపడటం లేదట. సాధారణంగా ఓ హీరో డెబ్యూ ఫిల్మ్ అంటూ భారీ స్థాయిలో ఉన్నా, యాభై, ఆరవై కోట్లకి మించి ఉండదు. అది అందరికి రిస్క్ తో కూడుకున్నది. కానీ మోక్షజ్ఞ మూవీని సుమారు వంద కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారట. ప్రశాంత్‌ వర్మ చాలా గ్రాండియర్‌గా ప్లాన్‌ చేసినట్టు సమాచారం. దర్శకుడిపై నమ్మకంతో బాలయ్య కూడా ఓకే చెప్పాడట. ఏ విషయంలోనూ రాజీపడకుండా ది బెస్ట్ ఉండేలా చూసుకుంటున్నారట. 
 

57

ఏ హీరోకైనా ఎంట్రీనే చాలా ముఖ్యం. ఎలాంటి కథతో వస్తున్నారు? ఎలా చేశారు? హిట్‌ అయిందా? లేదా అనేది చాలా ముఖ్యం. ఆ సినిమాని బట్టి నెక్ట్స్ ఫ్యూచర్‌ ఉంటుంది. నెక్ట్స్ సినిమాలు ఆధారపడి ఉంటాయి. అందుకే బాలకృష్ణ కొడుకు విషయంలో రాజీపడటం లేదని సమాచారం. నిర్మాతలు కూడా ఆ విషయంలో సపోర్టివ్‌గానే ఉన్నారట.

అయితే కొత్త హీరోపై ఇంత బడ్జెట్‌ అంటేనే ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పటి వరకు టాలీవుడ్‌లో ఏ కొత్త హీరోకి ఈ రేంజ్‌లో ఎంట్రీ జరగలేదని చెప్పొచ్చు. ఈ విషయంలో మోక్షజ్ఞ ఎంట్రీతోనే సరికొత్త రికార్డు క్రియేట్‌ చేయబోతున్నారని చెప్పొచ్చు. 
 

67

మరోవైపు ఈ మూవీకి మోక్షజ్ఞకి పారితోషికం ఎంత అనేది ఆసక్తికరంగా మారింది. అయితే వినిపిస్తున్న సమాచారం మేరకు షాకింగ్‌ పారితోషికం ఇస్తున్నారట. సుధాకర్‌ చెరుకూరి బాలయ్య ఫ్యామిలీకి దగ్గర కావడంతో ఎంతైనా ఇచ్చేందుకు రెడీగా ఉన్నారని, అందులో భాగంగా ఇరవై కోట్లు పారితోషికంగా అందిస్తున్నారని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.

77

అదే సమయంలో ఇందులో హీరోయిన్‌ గురించి చర్చ మొదలైంది. శ్రీలీల పేరుతోపాటు అతిలోక సుందరి శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్‌ పేర్లు వినిపిస్తున్నాయి. ఎక్కువగా శ్రీలీలకి ఓటు వేస్తున్నారట. ఇప్పటికే ఆమె బాలయ్య తో `భగవంత్‌ కేసరి` చిత్రంలో నటించింది. అప్పుడే ఆమెని ఫిక్స్ చేసుకున్నారట బాలయ్య.ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌ అవుతుంది. త్వరలోనే ఈ మూవీ గ్రాండ్‌గా ఓపెనింగ్‌ నిర్వహించబోతున్నారని, దీనికి ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
వెంకటేష్ తో చేతులు కలిపిన నందమూరి హీరో.. క్రేజీ మల్టీస్టారర్ ప్రకటించిన అనిల్ రావిపూడి, రిలీజ్ డేట్ ఫిక్స్
Recommended image2
విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి ఫోటోలు ఇవిగో.. ఆమె ఆనందం చూశారా, ఇద్దరినీ ఇలా చూడడానికి రెండు కళ్ళు సరిపోవు
Recommended image3
Rajini Kamal Movie: నాగార్జున అయిపొయింది, రజినీకాంత్ కి విలన్ గా మరో స్టార్ హీరో..ఇది కూడా బెడిసికొడుతుందా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved