- Home
- Entertainment
- మోక్షజ్ఞ ఫస్ట్.. అకీరా, గౌతమ్ నెక్స్ట్... ఈ ముగ్గురిలో ఇండస్ట్రీని ఏలే మొనగాడు అతడేనా?
మోక్షజ్ఞ ఫస్ట్.. అకీరా, గౌతమ్ నెక్స్ట్... ఈ ముగ్గురిలో ఇండస్ట్రీని ఏలే మొనగాడు అతడేనా?
బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీకి సిద్ధం. దర్శకుడు కూడా ఫిక్స్. మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన వెంటనే అకీరా, గౌతమ్ కూడా హీరోలు కానున్నట్లు తెలుస్తుంది. ఈ ముగ్గురు స్టార్ కిడ్స్ లో ఇండస్ట్రీని ఏలేది ఎవరనే చర్చ మొదలైంది. మరి ఎవరికి అవకాశం ఉందో చూద్దాం...

స్టార్స్ వారసులు వచ్చేస్తున్నారు. ఒకటి రెండు ఏళ్ల వ్యవధిలో ముగ్గురు స్టార్ కిడ్స్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. మోక్షజ్ఞ, అకీరా, గౌతమ్ రానున్న రెండేళ్లలో హీరోలుగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అవుతారని విశ్వసనీయ సమాచారం. మరి వీరిలో పరిశ్రమను ఏలే మొనగాడు ఎవరో చూద్దాం..
Tollywood Stars
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ అందరూ నెపోకిడ్సే. వారసత్వం మీద విమర్శలు ఉన్నప్పటికీ జనాలు కూడా అదే కోరుకుంటున్నారు. హీరో కొడుకు హీరో అయితే తప్పేంటని వాదిస్తున్నారు. ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్,ఎన్టీఆర్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ సినిమా నేపథ్యం నుండి వచ్చిన వారే. వీరి నెక్స్ట్ జనరేషన్ సిద్ధమైంది.
ఎన్టీఆర్ మూడవ తరం వారసుడు మోక్షజ్ఞ. నందమూరి నటసింహం బాలకృష్ణ కుమారుడైన మోక్షజ్ఞ అరంగేట్రానికి చాలా ఆలస్యం అయ్యింది. ఇప్పటికే మోక్షజ్ఞ ఓ అరడజను సినిమాలు కంప్లీట్ చేయాల్సింది. కారణం తెలియదు కానీ మోక్షజ్ఞ లేటుగా పరిశ్రమలో అడుగుపెడుతున్నారు.
హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మకు బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే బాధ్యత ఇచ్చాడట. కథ కూడా సిద్ధం. మూవీ సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం అట. 2024లో మూవీ షూటింగ్ మొదలవుతుందట. మోక్షజ్ఞ మేకోవర్ సాధించి సిల్వర్ స్క్రీన్ ని దున్నేసేందుకు రెడీగా ఉన్నాడు.
మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చిన ఒకటి రెండేళ్లలో అకీరా అరంగేట్రం ఖాయం. అకీరా వయసు 20 ఏళ్ళు దాటేసింది. ఈ ఆరున్నర అడుగుల బుల్లెట్ పక్కా హీరో మెటీరియల్. అకీరా లుక్ కిక్ ఇచ్చేదిగా ఉంది. ఈ మధ్య తరచుగా మీడియా కంటపడుతూ హైలెట్ అవుతున్నాడు.
పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ కలిసి అకీరా ఎంట్రీకి ప్రణాళికలు వేస్తున్నారనే ఊహాగానాలు ఉన్నాయి. అకీరా ఆల్రెడీ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేశాడు. మ్యూజిక్ నేర్చుకున్నాడు. సినిమా మీద అవగాహన ఉంది. రానున్న ఒకటి రెండేళ్లలో అకీరాని సిల్వర్ స్క్రీన్ పై చూడొచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Mahesh Babu son Gautham
టాలీవుడ్ లో అతిపెద్ద ఫ్యాన్ బేస్ కలిగిన హీరో మహేష్ బాబు. మరి ఆయన వారసుడు ఎంట్రీ అంటే మామూలుగా ఉండదు. గౌతమ్ సైతం టీనేజ్ దాటేశాడు. గౌతమ్ చదువు కూడా పూర్తి కావచ్చిందని తెలుస్తుంది. కాకపోతే తండ్రి మాదిరే గౌతమ్ చాలా రిజర్వ్డ్ గా ఉంటారు . మోక్షజ్ఞ, అకీరా లతో పాటు గౌతమ్ హీరో అయ్యే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి.
మరి మోక్షజ్ఞ, అకీరా, గౌతమ్ లలో ముందుగా స్టార్ అయ్యేది ఎవరు? ఇండస్ట్రీని ఏలేది ఎవరు?.. చెప్పాలంటే, ఈ ముగ్గురికి సమాన అవకాశాలు ఉన్నాయి. భారీ బ్యాక్ గ్రౌండ్, ఫ్యాన్ బేస్ వారి సొంతం. ఇక ఎవరు రాణిస్తారు అనేది వారి టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఎంతటి సపోర్ట్ ఉన్నా... టాలెంట్ లేకపోతే ఎక్కువ కాలం నిలబడరు. అభిమానులు కూడా కొంత కాలమే మోయగలరు. నటన, డాన్స్, డైలాగ్స్ వంటి కీలక అంశాల్లో నైపుణ్యం చూపించిన వారు స్టార్ అవుతారు..