- Home
- Entertainment
- Mohan Babu: లేడీస్ మధ్య లిప్ లాక్ సీన్లు, విష్ణు వద్దన్నా ఓకే చేశా.. వెధవలు పేర్ని నాని రాకని రాజకీయం చేశారు
Mohan Babu: లేడీస్ మధ్య లిప్ లాక్ సీన్లు, విష్ణు వద్దన్నా ఓకే చేశా.. వెధవలు పేర్ని నాని రాకని రాజకీయం చేశారు
ఆదివారం రోజు మోహన్ బాబు మీడియాతో ముచ్చటించారు. సన్నాఫ్ ఇండియా చిత్ర విశేషాలు, తన ఫ్యూచర్ ప్లాన్స్, ప్రస్తతం రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలపై మోహన్ బాబు తనదైన శైలిలో స్పందించారు.

సీనియర్ నటుడు మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన 'సన్నాఫ్ ఇండియా' చిత్రం ఫిబ్రవరి 18న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అలాగే ఆదివారం రోజు మోహన్ బాబు మీడియాతో ముచ్చటించారు. సన్నాఫ్ ఇండియా చిత్ర విశేషాలు, తన ఫ్యూచర్ ప్లాన్స్, ప్రస్తతం రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలపై మోహన్ బాబు తనదైన శైలిలో స్పందించారు.
మోహన్ బాబు మాట్లాడుతూ.. సన్నాఫ్ ఇండియా చిత్ర కథ ప్రయోగాత్మకమైనది. డైమండ్ రత్నబాబు కథ చెప్పగానే నచ్చింది. అయితే ఇందులో రిస్క్ ఉంది. రిస్క్ చేయకపోతే ఎలా అని ఈ సినిమా మొదలు పెట్టాం. విష్ణు ఈ చిత్రానికి నిర్మాత. నా అనుభవాన్ని బట్టి ఈ చిత్రం ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని చెప్పలేను. హిట్ అయితే అవుతుంది లేదంటే లేదు. కానీ మోహన్ బాబు మంచి సినిమా చేసారు అని అంటారు.
ఈ చిత్రంలో అమ్మాయిల మధ్య లిప్ లాక్ సీన్లు ఉన్నాయి. కథ డిమాండ్ చేయడం వల్లే వాటిని పెట్టాల్సి వచ్చింది. విష్ణు ఈ సన్నివేశాలకు ససేమిరా అన్నాడు. ఒప్పుకోలేదు.. వద్దు డాడీ అని చెప్పాడు. మనసు సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. విద్యాసంస్థలు కూడా నడుపుతున్నాం. అలాంటిది ముద్దు సన్నివేశాలు పెడితే ఎలా అని అడిగాడు.
నా ప్రవర్తన బాగాలేని రోజు మోహన్ బాబు బతకడానికే అర్హుడు కాదు అని నేనే భావిస్తా. మోహన్ బాబు ఎలాంటి వాడో అందరికి తెలుసు. కథ డిమాండ్ చేసింది కాబట్టే పెడుతున్నాం. తప్పులేదు. అందరూ దీనిని అర్థం చేసుకుంటారు అని విష్ణుని ఒప్పించా.
ఎమ్మెల్యే వల్ల జీవితం నాశనం చేసుకున్న వ్యక్తి జైలు నుంచి తప్పించుకుని ఏం చేసాడు అనేదే ఈ చిత్ర కథ. ఇది గంటన్నర మాత్రమే నిడివి ఉన్న చిత్రం. ఇందులో చాలా విశేషాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడే చెప్పకూడదు. ముందుగా ఈ చిత్రాన్ని ఓటిటికి ఇవ్వాలని అనుకున్నాం. ఆ తర్వాత థియేటర్స్ లో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాం. థియేటర్ రిలీజ్ తర్వాత ఓటిటిలో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది అని మోహన్ బాబు అన్నారు.
ఇక తనకు దర్శకత్వంపై కూడా ఆసక్తి ఉందని మోహన్ బాబు రివీల్ చేశారు. దర్శకత్వం చేసేందుకు రెండు కథలు రెడీ చేసిపెట్టుకున్నాం. అయితే నా కోపమే నాకు భయాన్ని కలిగిస్తోంది. దర్శకత్వం చేస్తే రోజుకు ఒకరిని అయినా కొట్టాల్సి వస్తుంది. ఆలస్యంగా షూటింగ్స్ కి వస్తే అస్సలు నచ్చదు. అలాగే తన బయోపిక్ పై కూడా ఆలోచన ఉన్నట్లు మోహన్ బాబు పేర్కొన్నారు.
చిరంజీవి నేతృత్వంలో సినీ ప్రముఖులు జగన్ ని కలసిన తర్వాత మంత్రి పేర్ని నాని మోహన్ బాబు ఇంటికి వెళ్లారు. ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అయితే టాలీవుడ్ సమస్యలపై చర్చించడానికి వెళ్లినట్లుగా విష్ణు ట్విట్టర్ లో పేర్కొనడం.. ఆ తర్వాత ట్వీట్ ని డిలీట్ చేయడం జరిగింది. కానీ నాని మాత్రం తాను మోహన్ బాబు ఆహ్వానిస్తేనే వెళ్లానని క్లారిటీ ఇచ్చారు.
దీనిపై మోహన్ బాబు మరింత క్లారిటీ ఇస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెధవలు పేర్ని నాని రాకని కూడా రాజకేయం చేశారు. పేర్ని నానిని బ్రేక్ ఫాస్ట్ కి రమ్మని ఆహ్వానించా. అందులో తప్పేముంది. నానికి మా ఫ్యామిలీతో మంచి రిలేషన్ ఉంది. బొత్స కుమారుడి వివాహానికి వెళ్ళినప్పుడు పేర్ని నానిని ఆహ్వానించినట్లు మోహన్ బాబు తెలిపారు.