ఐశ్వర్య - అభిషేక్‌ల పెళ్లిలో ఎన్నో విశేషాలు.. అవేంటో మీకు తెలుసుకోవాలని ఉందా!
బాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షించిన అతి పెద్ద సెలబ్రిటీ వెడ్డింగ్ ఐశ్వర్య - అభిషేక్‌లది. అతిలోక సుందరిని ఐశ్వర్య, బిగ్ బీ తనయుడు బాలీవుడ్ హీరో అభిషేక్‌ల వివాహం గురించి బాలీవుడ్ లో ఇప్పటీ మాట్లాడుకుంటారు..? అంతలా పెళ్లి వేడుకలో ఏం విశేషం ఉంది అనుకుంటున్నారా..? అయితే మీరు ఓ లుక్కేయండి.
బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్‌ల వివాహం జరిగి 13 ఏళ్లు అవుతుంది.
వీరి వివాహ వేడుక 2007లో భారీ రాయల్ సెట్టింగ్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మథ్య ఘనంగా జరిగింది.
గతంలో బాలీవుడ్‌లో ఎన్నడూ జరిగన విధంగా గ్రాండ్ ఈ వివాహ వేడుకను నిర్వహించారు ఇరు కుటుంబాలు.
తులు సాంప్రదాయం ప్రకారం వీరిద్దరి వివాహ వేడుక జరిగింది.
ఈ పెళ్లిలో ఐశ్వర్య బంగారు రంగు చీరలో దేవ కన్యలా కనిపించింది.
పెళ్లి ఐశ్వర్య ధరించిన చీరను ప్రముఖ బాలీవుడ్ డిజైనర్ నీతా లుల్లా ప్రత్యేకంగా రూపొందించారు.
అమితాబ్ బచ్చన్ కుటుంబ సభ్యుల కోసం ప్రముఖ డిజైనర్‌లు అబు జైన్, సందీప్ కోస్లాలు ప్రత్యేకంగా ఖరీదైన దుస్తులను రూపొందించారు.
కేవలం ఈ పెళ్లి వేడుకకు మాత్రమే కాదు.. బచ్చన్ ఫ్యామిలీలో జరిగే అన్నిఫంక్షన్స్‌కు వీరే దుస్తులు డిజైన్ చేస్తుంటారు.
పెళ్లి సెట్, దుస్తులు, ఇతర ఏర్పాట్లు ప్రతీ దాంట్లోనూ రాజసం ఉట్టిపడేలా జాగ్రత్తలు తీసుకున్నారు బచ్చన్ కుటుంబ సభ్యులు.
ముఖ్యంగా ఐశ్వర్య పెళ్లి కూతురు డ్రెస్‌లో చూపుతిప్పుకోలేనంత అందంగా ఉంది. ఆమె స్వచ్చమైన బంగారంతో నేసిన చీరను పెళ్లిలో ధరించింది. అలాగే నగల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని డిజైన్ చేయించారు.
దక్షిణాదికి చెందిన అమ్మాయి కావటంతో ఆ సాంప్రదాయలు చాలా వీరి పెళ్లి వేడుకలో కనిపించాయి. ముఖ్యంగా ఐశ్వర్య ధరించిన నగలు ఎక్కువగా సౌత్ సాంప్రదయం ప్రకారం రూపొందించినవే.
ఎక్కువ హడావిడి లేకపోయిన ఎంతో అంతమైన జ్యువెలరినీ ఐష్ ధరించింది. చేతికి చిన్న బంగారు బ్రాస్‌లెట్‌తో పాటు ఆకర్షనీయమైన పాపటి బిల్లను ధరించింది ఐష్.
ఇక అభిషేక్ బచ్చన్ హాఫ్ వైట్ షేర్వానీలో కనిపించాడు. ఎమరాల్డ్స్ పొదిని పగిడితో ఐష్ అచ్చు రాకుమారుడిలా కనిపించాడు.
మిగత బచ్చన్ ఫ్యామిలీ అంతా రెడ్ షేడ్స్ ఉన్న దుస్తులను ధరించారు.
పెళ్లి తరువాత అభిషేక్, ఐశ్వర్యలు అంబానీ ఫ్యామిలీతో కలిసి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వా ఆశీర్వాదం తీసుకున్నారు.