మిల్కీ బ్యూటీ పంథా మార్చిందనే దానికిది నిదర్శనమా?
స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న తమన్నా.. ఒక్కసారిగా టర్న్ తీసుకుంది. అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఓ చిన్న బడ్జెట్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న సత్యదేవ్ సరసన రొమాన్స్ చేస్తుంది. కొత్త దర్శకుడు ఈ సినిమాని రూపొందిస్తుండటం విశేషం.
తాజాగా ఆదివారం ఈ సినిమాకి టైటిల్‌ని, టైటిల్ పోస్టర్‌ని విడుదల చేశారు. దీనికి విభిన్నంగా `గుర్తుందా శీతాకాలం` అనే టైటిల్‌ని ఖరారు చేశారు. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమా చేయడమే విచిత్రమంటే, సినిమా టైటిల్ కూడా విచిత్రంగా ఉండటం ఇంకాస్త విచిత్రంగా ఉంది.
కానీ దీనికి మంచి స్పందన లభిస్తుంది. అందరు ఇదేంటి? టైటల్ ఇలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలంటున్నారు. ఇందులో తమన్నా లుక్‌ని విడుదల చేయగా అది ఆకట్టుకుంటోంది.
ఇది కన్నడ చిత్రం `లవ్ మాక్ టైల్`కి రీమేక్. ఈ నెల 27న సినిమా ప్రారంభం కాబోతుంది. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణాలో పూజా కార్యక్రమాలతో సినిమాని ప్రారంభించనున్నట్టు చిత్ర బృందం తెలిపింది.
ఇక రెగ్యులర్ షూటింగ్‌ని సెప్టెంబర్ మధ్యలో ప్రారంభించనున్నారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఏకదాటిగా షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
ఈ సినిమాకి నాగశేఖర్ దర్శకత్వం వహిస్తుండగా, నాగశేఖర్ మూవీస్ పతాకంపై నాగశేఖర్, భావన రవి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సత్యా హెగ్డే సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.
గతేడాది `సైరా నరసింహా రెడ్డి`లో లక్ష్మీ పాత్రలో అద్భుత నటనతో మెస్మరైజ్ చేసింది తమన్నా. అందులో ఆమె నటన కట్టిపడేసింది. సినిమాకే హైలైట్‌గా నిలిచింది.
దీంతో తమన్నా సినిమాల ఎంపికలో తన పంథాని మార్చుకుందని అర్థమవుతుంది. గ్లామర్ పాత్రలు కాకుండ శక్తివంతమైన, ప్రాధాన్యత కలిగిన పాత్రలు పోషించాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె ఎంచుకుంటున్న సినిమాలను చూస్తే ఇదే విషయం అర్థమవుతుంది.
ప్రస్తుతం తమన్నా తెలుగులో `సీటీమార్` చిత్రంలో నటిస్తుంది. గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. మహిళా కబడ్డీ నేపథ్యంలో సాగుతున్న ఈ చిత్రంలో తమన్నా ఏపీ జట్టు మహిళా కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా కనిపించనున్నట్టు టాక్.
దీంతోపాటు హిందీలో `బోలె చుడియన్` చిత్రంలో నటిస్తుంది. హిందీలో తమన్నాకి కలిసి రాలేదనే చెప్పాలి. మరి ఈ సినిమా అయినా ఆమెకి పేరును తీసుకొస్తుందా? చూడాలి.
ఇదిలా తాజాగా సోషల్ మీడియాలో తమన్నా ఓ కొత్త ఫోటోను పంచుకుంది. వైట్ పిల్లో తనపై పెట్టుకుని పడుకున్నట్టు ఇచ్చిన స్టిల్ విశేషంగా ఆకట్టుకుంటుంది. కుర్రకారులో హీటు పుట్టిందని చెప్పొచ్చు.