- Home
- Entertainment
- ట్రెడిషనల్ లుక్ లో మెహ్రీన్ అందాలు అదుర్స్.. వరుస ఫొటోషూట్లతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న హనీ బేబీ..
ట్రెడిషనల్ లుక్ లో మెహ్రీన్ అందాలు అదుర్స్.. వరుస ఫొటోషూట్లతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న హనీ బేబీ..
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పిర్జాదా (Mehreen Pirzada) అందాల ఆరబోతతో తన రూటే సపరేట్ అనిపిస్తోంది. లేటెస్ట్ గా హనీబేబీ ట్రెడిషనల్ లుక్ లో అదుర్స్ అనిపిస్తోంది.

పంజాబీ భామా మెహ్రీన్ పిర్జాదా టాలీవుడ్ హీరోయిన్ గా వరుస చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు అందుకుంటూ తన మార్క్ చూపిస్తోంది. అయితే ఇటు సోషల్ మీడియాలోనూ సత్తా చాటుతోంది.
లేటెస్ట్ ఫొటోషూట్లో ఈ ముద్దుగమ్మ అందాలను ఆరబోస్తూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నటన పరంగానే కాకుండా.. గ్లామర్ పరంగానూ యూత్ లో క్రేజ్ సంపాదించే పనిలో పడింది. ఈ మేరకు ట్రెండీ మరియు ట్రెడిషనల్ వేర్స్ లో దర్శనమిస్తూ మెస్మరైజ్ చేస్తోంది.
కేవలం రెండేసి పిక్స్ ను తన అభిమానులతో షేర్ చేసుకుంటూ.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఫిట్ నెస్ అందాలతో ముద్దుగమ్మ ఆటాడిస్తోంది. అదిరిపోయే ఫోజులతో కుర్రాళ్లను తనవైపు తిప్పుకుంటోంది. గ్లామర్ షోలో ఏమాత్రం తగ్గనంటోంది.
నిన్న ట్రెండీ వేర్ లో కనిపించిన ఈ బ్యూటీ.. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చింది. లెహంగా, వోణీలో అచ్చమైన తెలుగుమ్మాయిలా కనువిందు చేస్తోంది. చంద్రుడివోలె హనీ బేబీ మొహం ప్రకాశవంతంగా వెలిగిపోతోంది.
ఓ ఈవెంట్ కు హాజరైన ఈ బ్యూటీ అక్కడ ట్రెడిషనల్ లుక్ లో ఇలా అందరినీ ఆకట్టుకుంటోంది. ఏ దుస్తుల్లోనైనా ఇట్టే ఆకర్షించే అందం మెహ్రీన్ ది. దీంతో లేటెస్ట్ పిక్స్ ను తన అభిమానులు, నెటిజన్లు లైక్స్, కామెంట్లతో తెగ వైరల్ చేస్తున్నారు.
మెహ్రీన్ మ్యారేజ్ క్యాన్సిల్ కావడంతో ప్రస్తుతం కేరీర్ పైనే పూర్తిగా శ్రద్ధ వహిస్తోంది. రీసెంట్ గా ‘ఎఫ్3’ F3తో మంచి సక్సెస్ ను అందుకున్న ఈ బ్యూటీ.. తాజాగా స్పార్క్ అనే చిత్రంలో నటిస్తోంది. మరో కన్నడ ఫిల్మ్ లోనూ నటించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాల తర్వాత మెహ్రీన్ లిస్ట్ లో పెద్దగా సినిమాలేవీ లేవనే చెప్పాలి.