వైన్ షాప్‌లో మెహరీన్ అందాల రచ్చ.. పొట్టి డ్రెస్‌లో థైస్ షో చేస్తూ క్రేజీ పోజులు.. స్టఫ్ అదిరింది..
`ఎఫ్ 2` బ్యూటీ మెహరీన్.. టాలీవుడ్‌లో మళ్లీ పూర్వ వైభవం పొందేందుకు గట్టిగా ప్రయత్నిస్తుంది. ఆమె హీరోయిన్‌గా బిజీ అయ్యేందుకు తనవంతుగా కష్టపడుతుంది. అందులో భాగంగా ఏదో రకంగా వార్తల్లో నిలుస్తుంది.
మెహరీన్ తాజాగా సోషల్ మీడియాలో అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకుంది. ఆమె గ్లామర్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. అయితే ఇందులో ఆమె ధరించిన డ్రెస్, కెమెరాకి ఇచ్చిన పోజులు మాత్రం ఆశ్చర్యపరుస్తున్నాయి. నెటిజన్లకి మైండ్ బ్లాక్ చేస్తున్నాయి.
`ఎఫ్2` భామ మెహరీన్ ఈ నయా ఫోటోల్లో చాలా స్పెషల్‌గా నిలిచింది. ఆమె వైన్ షాప్‌లో కెమెరాకి పోజులివ్వడం విశేషం. ఓ క్లాసీ వైన్ షాప్‌లో వైన్ బాటిల్స్ వద్ద నిల్చొని ఫోటో షూట్ చేయడం, వాటిని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోవడంతో అవి నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నాయి. వైన్ షాప్‌ని ప్రమోట్ చేస్తున్నట్టుగా ఈ అమ్మడి పోజులుండటం విశేషం.
ఇందులో మెహరీన్ ధరించిన డ్రెస్ సైతం హాట్ టాపిక్ గా మారింది. ఆమె పొట్టి దుస్తులు ధరించింది. మోకాళ్లపైకున్న గౌనులో క్రేజీ పోజులిచ్చింది. తన థండర్ థైస్ చూపిస్తూ కెమెరా ముందు రెచ్చిపోయింది. అవి చూసి నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు. స్టఫ్ అదిరిందంటూ కామెంట్లు చేస్తున్నారు.
మెహరీన్ చివరగా `ఎఫ్ 3` చిత్రంతో ఆడియెన్స్ ని అలరించింది. తన ఆపిల్ బ్యూటీ అందాలు, మరోవైపు ఫన్నీ యాక్టింగ్‌తో మెప్పించింది. నవ్వులు పూయించింది. తమన్నాతో కలిసి రచ్చ రచ్చ చేసింది. వరుణ్ తేజ్‌ని బాగా ఆడుకుంది.
ఆ తర్వాత మెహరీన్‌కి కెరీర్ కి ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఓ వైపు పెళ్లి కాన్సిల్ కావడంతో పర్సనల్ లైఫ్‌లో ఇబ్బంది పడ్డ మెహరీన్.. దాన్నుంచి బయటపడేందుకు టైమ్ పట్టింది. నెమ్మదిగా మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యే ప్రయత్నాలు చేస్తుంది.
అందులో భాగంగా ఇప్పుడు `స్పార్క్` అనే చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం త్వరలోనే విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంతో సక్సెస్ అందుకుని మళ్లీ బిజీ కావాలనుకుంటుంది మెహరీన్.
ఆమె నాని హీరోగా నటించిన `కృష్ణగాడి వీర ప్రేమ గాథ` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే సక్సెస్ అందుకుంది. `మహానుభావుడు`, `రాజా ది గ్రేట్` చిత్రాలతో విజయాలు అందుకున్నారు. కానీ `కేరాఫ్ సూర్య`, `జవాన్`, `పంతం`, `నోటా`, `కవచం`, `ఎఫ్2`, `చాణక్య`, `ఎంత మంచి వాడవురా`, `అశ్వత్థామ`, `మంచి రోజులొచ్చాయి`, `ఎఫ్3` చిత్రాలు చేసింది. ఇందులో `ఎఫ్2` మాత్రమే హిట్ అయ్యింది. దీంతో ఆమె కెరీర్ డౌన్‌ఫాల్ అయ్యింది. మళ్లీ పుంజుకునే పనిలో బిజీగా ఉందీ ఆపిల్ బ్యూటీ.