MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Entertainment
  • చిరంజీవికి ఎన్నివేల కోట్ల ఆస్తులున్నాయో తెలుసా?లగ్జరీ హౌజ్‌, రోల్స్ రాయ్స్ కారు.. సంపాదన అదే

చిరంజీవికి ఎన్నివేల కోట్ల ఆస్తులున్నాయో తెలుసా?లగ్జరీ హౌజ్‌, రోల్స్ రాయ్స్ కారు.. సంపాదన అదే

మెగాస్టార్‌ చిరంజీవి నేడు తన 70వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆస్తులు, సంపాదనకి సంబంధించిన వివరాలు ఆసక్తికరంగా మారాయి. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Aug 22 2025, 04:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా వచ్చి మెగాస్టార్‌గా
Image Credit : Asianet News

బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా వచ్చి మెగాస్టార్‌గా

మెగాస్టార్‌ చిరంజీవి ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా సినిమా పరిశ్రమలోకి వచ్చి ఎంతో కష్టపడి నటుడిగా నిరూపించుకున్నారు. స్టార్‌గా ఎదిగారు. మెగాస్టార్‌ గా కీర్తిని పొందున్నారు. తన నటన, డాన్సులు, మ్యానరిజం, యాక్షన్‌తో కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. అదే సమయంలో వేల కోట్ల ఆస్తులు కూడా సంపాదించుకున్నారు. చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆయన ఆస్తులు, సంపాదనకు సంబంధించిన సమాచారం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి ఆ వివరాలు చూస్తే

DID YOU
KNOW
?
`ఖైదీ`తో బ్రేక్‌
చిరంజీవి `ప్రాణం ఖరీదు`తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కానీ ఆయనకు `ఖైదీ` మూవీ తొలి బ్రేక్‌ ఇచ్చింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
చిరంజీవిని ప్రత్యేకంగా మార్చిన డాన్సులు
Image Credit : The Indian Express

చిరంజీవిని ప్రత్యేకంగా మార్చిన డాన్సులు

చిరంజీవి నాన్న కానిస్టేబుల్. అప్పట్లో పెద్దగా జీతాలు ఉండేవి కావు, కానీ ఎలాగోలా కుటుంబాన్ని లాక్కొచ్చారు. చిరంజీవి స్టడీస్‌ పూర్తవగానే నటనపై దృష్టి పెట్టారు. మద్రాస్‌ వెళ్లి ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరి నటుడిగా నిరూపించుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.  అయితే స్వతహాగా చిరుకి డాన్సుల్లో మంచి నైపుణ్యం ఉంది. అదే ఆయన్ని ఇండస్ట్రీలో ప్రత్యేకంగా నిలిపింది. సూపర్‌ స్టార్‌గా ఎదగడంలో కీలక పాత్ర పోషించింది. అప్పటి వరకు ఇండస్ట్రీలో డాన్సులంటే ఏఎన్నార్‌, కృష్ణ వంటివారే చేసేవారు. కానీ డాన్సుల లెక్కలు మార్చేశారు చిరు. అలాగే తనకంటూ ఓ సెపరేట్‌ ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకున్నారు. కమర్షియల్‌ చిత్రాలతో విజయాలు అందుకుని అత్యంత సక్సెస్ ఫుల్‌ హీరోగా నిలిచారు.

Related Articles

Related image1
చిరంజీవి `మన శంకరవరప్రసాద్‌ గారు` గ్లింప్స్ రివ్యూ.. ఫ్యాన్స్ కి అసలైన మెగా ట్రీట్‌, కాకపోతే అదే మైనస్‌
Related image2
చిరంజీవి టాప్‌ 10 అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలు.. ఫ్లాప్‌ టాక్‌తోనూ దుమ్ములేపిన సినిమాలివే
36
కోటి పారితోషికం అందుకున్న తొలి హీరో
Image Credit : Facebook / Megastar chiranjeevi

కోటి పారితోషికం అందుకున్న తొలి హీరో

`ఖైదీ` మూవీ హిట్‌ తర్వాత చిరంజీవి లెక్క మారిపోయింది. ఆ తర్వాత నిర్మాతలు, దర్శకులు క్యూ కట్టారు. చిరుకి ఎంత పారితోషికం ఇచ్చేందుకైనా వెనకాడలేదు. ఎందుకంటే చిరంజీవి నుంచి సినిమా వస్తుందంటే థియేటర్లలో కాసుల వర్షం కురిసేది. ఆడియెన్స్ క్యూ కట్టేవారు. ఫ్లాప్‌ సినిమా అయినా మినిమమ్ గ్యారంటీగా ఆడేది. అందుకే చిరుకి అంత క్రేజ్. ఆయన పాటలు, డాన్సుల కోసమైనా ఆడియెన్స్ థియేటర్ కి వచ్చేవారంటే అతిశయోక్తి కాదు. అయితే ఇండియన్‌ సినిమాలో తొలిసారి కోటి రూపాయల పారితోషికం అందుకున్న హీరో చిరంజీవి అని అప్పట్లో మేగజీన్లు కూడా ప్రచురించాయి.

46
వేలకోట్లకు అధిపతిగా ఎదిగిన చిరంజీవి
Image Credit : Yourube/SHINE screens

వేలకోట్లకు అధిపతిగా ఎదిగిన చిరంజీవి

తన క్రేజ్‌ని క్యాష్‌ చేసుకున్నారు చిరు. వచ్చిన పారితోషికాన్ని సరిగ్గా వాడుకున్నారు. ఆస్తులు కూడబెట్టుకున్నారు. బాగా సెటిల్డ్ అయ్యారు. కుటుంబాన్ని సెటిల్‌ చేశారు. ఇద్దరు చెళ్లెళ్ల పెళ్లిళ్లు చేశారు. వారి కుటుంబాలను సెట్‌ చేశారు. అలాగే ఇద్దరు తమ్ముళ్లని సెట్‌ చేశారు. అయినా వేల కోట్లు సంపాదించారు. ప్రస్తుతం చిరంజీవి వద్ద సుమారు రూ.2000-2500 కోట్ల వరకు ఆస్తులున్నాయని సమాచారం. చిరంజీవికి జూబ్లీహిల్స్ లో లగ్జరీ హౌజ్‌ ఉంది. అలాగే బెంగుళూరులో ఫామ్‌ హౌజ్‌ ఉంది. వీటితోపాటు చెన్నైలోనూ ఇళ్లు ఉన్నట్టు సమాచారం. ప్రారంభం నుంచి రియల్‌ ఎస్టేట్‌ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టారు. దీంతో వాటి విలువ భారీగా పెరిగింది. అదే చిరంజీవిని వేల కోట్లకు అధిపతిని చేసింది. 

56
చిరంజీవి లగ్జరీ కార్ కలెక్షన్‌, లగ్జరీ హౌజ్‌
Image Credit : Youtube/ Curly Tales

చిరంజీవి లగ్జరీ కార్ కలెక్షన్‌, లగ్జరీ హౌజ్‌

చిరంజీవి వద్ద అత్యంత ఖరీదైన కార్ కలెక్షన్ ఉంది. రోల్స్ రాయిస్ వాటిలో ప్రత్యేకం. దానితో పాటు బెంజ్, రేంజ్ రోవర్, ఆడి, టయోటా హై ఎండ్ కార్స్ ఆయన కొనుగోలు చేశారు. వీటితోపాటు సెపరేట్‌గా ఒక విమానం ఉందని సమాచారం. చిరు ఫ్యామిలీ ఇండియాలో ఎక్కడికి వెళ్లినా ఈ విమానాన్నే వాడుతుంటారు. చాలా సార్లు అందులో ప్రయాణించి కనిపించారు. చిరంజీవి ఆదాయ మార్గం ప్రధానంగా సినిమాలే అని చెప్పొచ్చు. ఆయన ఒక్కో మూవీకి రూ.30 కోట్ల నుంచి రూ.50కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారట. ఏడాదికి ఒకటి రెండు సినిమాలు చేస్తున్నారు. అడపాదడపా యాడ్స్ కూడా చేస్తున్నారు. ఇలా ఏడాదికి ఓ వంద కోట్లు యాడ్‌ అవుతాయని చెప్పొచ్చు.  చిరుకి ఓ ప్రైవేట్‌ ఎయిర్‌ లైన్స్ లోనూ భాగం ఉందని సమాచారం.

66
రెండు సినిమాలతో సందడికి షురూ
Image Credit : youtube print shot/UV creations

రెండు సినిమాలతో సందడికి షురూ

ప్రస్తుతం చిరంజీవి రెండు సినిమాలు చేస్తున్నారు. వశిష్ట దర్శకత్వంలో `విశ్వంభర` మూవీ రూపొందుతుంది. ఈ మూవీ టీజర్‌ని చిరు బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇది వచ్చే ఏడాది సమ్మర్‌లో రాబోతుంది. ఇంకోవైపు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో `మన శంకరవరప్రసాద్‌ గారు` మూవీ చేస్తున్నారు.ఈ చిత్ర టైటిల్‌ గ్లింప్స్ ని ఈ రోజు ఉదయం విడుదల చేశారు. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి వస్తున్నారు. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Suhana Khan: వామ్మో.. సుహానా ఖాన్ డ్రెస్సుల ధరలు తెలిస్తే షాకవ్వాల్సిందే.. లక్షల్లో కాస్ట్!
Recommended image2
Kavya Kalyanram:కీరవాణి కొడుకుతో రిలేషన్ షిప్ కన్ఫర్మ్ చేసిన బలగం నటి.. తమ్ముడి సినిమా నుంచే మొదలైందా ?
Recommended image3
Veta Movie: చిరంజీవి పవర్‌ఫుల్‌ మూవీ టైటిల్‌తో కొత్త సినిమా.. 40 ఏళ్ల తర్వాత మరోసారి వేట షురూ
Related Stories
Recommended image1
చిరంజీవి `మన శంకరవరప్రసాద్‌ గారు` గ్లింప్స్ రివ్యూ.. ఫ్యాన్స్ కి అసలైన మెగా ట్రీట్‌, కాకపోతే అదే మైనస్‌
Recommended image2
చిరంజీవి టాప్‌ 10 అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలు.. ఫ్లాప్‌ టాక్‌తోనూ దుమ్ములేపిన సినిమాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved