Megastar Chiranjeevi: యంగ్ హీరోలకు మెగా షాక్.. చిరంజీవి ఖాతాలో మరో రెండు సినిమాలు
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) జోరు మీద ఉన్నారు.. యంగ్ హీరోలకు షాక్ మీద షాకిస్తున్నారు మెగాస్టార్. 152 నుంచి వరుసగా సినిమాలు లైన్ లో పెట్టిన మెగాస్టార్(Megastar Chiranjeevi). 156వ సినిమా వరకు అనౌన్స్ చేశారు. ఇక మరో రెండు సినిమలు లైన్ పెట్టిన చిరూ... వాటిని కూడా సెట్స్ ఎక్కించే పనిలో ఉన్నారు. టాలీవుడ్ లో గ్యాప్ లేకుండా దూసుకెళ్తున్న మెగా సినిమాలేంటి... నెక్ట్స్ సెట్స్ పైకెళ్లబోయేవేంటో చూద్దాం
కొవిడ్ వల్ల సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. అయినా సరే ఈ గ్యాప్ ను కవర్ చేయడానికి.. ఫ్యాన్స్ కు తనకు గ్యాప్ లేకుండా చూసుకోవడానికి మెగా మంత్రం వేశారు చిరంజీవి(Megastar Chiranjeevi). వరుసగా సినిములు అనౌన్స్ చేయడమే కాకుండా ఒకదాని వెంట మరొకటి లైన్ లో పెట్టేస్తునారు. ఈ క్రమంలో చిరూ 157, చిరూ 158 ప్రాజెక్టలకులకు కూడా రంగం సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. వీటికి సంబంధించిన అనౌన్స్ మెంట్ ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది.
ఇప్పటికే వరుసగా ఆరు సినిమాలు లైన్ లో ఉండగా..చిరూ తన 157వ సినిమాను మారుతితో ఫైనల్ చేసారని తెలుస్తోంది. మారుతి( Maruthi) మార్క్ డైరెక్షన్ కి చిరూ(Megastar Chiranjeevi) యాక్షన్ తోడైతే సినిమా ఎలా ఉంటుందా అని.. ఇండస్ట్రీ అంతటా హాట్ టాపిక్ నడుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) 158 సినిమా చేసే ఛాన్స్ యంగ్ స్టార్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)కి ఇచ్చినట్టు తెలుస్తోంది. వరుస హిట్స్ తో ఫన్ డోస్ ఇస్తున్న అనిల్ రావిపూడి ఈమధ్యే చిరూకి కథ వినిపించాడని తెలుస్తోంది. ఈ కథకు మెగాస్టార్ కూడా.. ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎప్3 చేస్తున్న అనిల్ రావిపూడి... తర్వాత బాలకృష్ణతో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా తరువాత మెగా మూవీ చేయబోతున్నట్టు సమాచారం.
ఇక చిరు(Megastar Chiranjeevi) ప్రస్థుతం ఉన్న సినిమాల గురింరచి చూస్తే.. 152వ సినిమా ఆచార్య(Acharya) . ఈ మూవీ ఏప్రిల్ 29న రిలీజ్ కాబోతుంది. తన సినిమాలకు భారీ బడ్జెట్, రిచ్ లోకెషన్స్ వద్దంటున్నా... సినిమాల్లో స్టార్ కాస్ట్ ఉండేలా చూసుకుంటున్నారు మెగాస్టార్. ఆచార్యకు రామ్ చరణ్( Ram Charan) ఫుల్ సపోర్ట్. కానీ అంతటితో ఆగలేదు. చరణ్ కు జోడీగా పూజా హెగ్డే( Pooja Hegde) నటించింది. చిరూ జోడీగా కాజల్ ఆచార్యలో సందడి చేయబోతోంది.
మోహన్ రాజా డైరెక్షన్ లో చిరూ(Megastar Chiranjeevi) 153వ ప్రాజెక్ట్ గాడ్ ఫాదర్ చేస్తున్నారు. మలయాళ మూవీ లూసిఫర్ రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో నయనతార నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె మెగాస్టార్(Megastar Chiranjeevi) కి జోడీగా నటించడం లేదు. నయన్ భర్తగా సత్యదేవ్ కనిపించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే గాడ్ ఫాదర్ లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) కూడా నటించబోతున్నారు. ఈ పాత్ర మలయాళ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ చేశారు. ఇక ఓ సాంగ్ కోసం బ్రిట్నిస్పియర్స్ ను రంగంలోకి దింపబోతున్నారు.
ఇక భోళాశంకర్ మెగా 154 వ మూవీగా తెరకెక్కుతోంది. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో.. మెగాస్టార్(Megastar Chiranjeevi) చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్( Keerthi Suresh) నటిస్తోంది. మెగా చెల్లెలుగా నటిస్తోన్న కీర్తి కోసం హీరో నాగశౌర్యను సెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తమిళ మూవీ వేదాళం రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను మెహర్ రమేశ్ డైరెక్ట్ చేస్తున్నారు.
చిరూ - బాబీ కాంబినేషన్లో 155వ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. ఇందులో హీరోయిన్ గా శృతీ హాసన్ ను దాదాపు ఫైనల్ చేసినట్టే చిరూ అండర్ కాప్ గా కనిపించే బాబీ సినిమాలో మాస్ రాజా రవితేజ మెగాస్టార్ తమ్ముడిగా నటిస్తారని టాక్. అది కూడా సెకండాఫ్ లో రవితేజ(Ravi Teja) ఎంట్రీతో దడదడలాడిస్తారని సమాచారం. వాల్తేరు వీరయ్య అనే టైటిల్ బాగా ప్రచారంలో ఉన్న ఈ భారీ ఈ ప్రాజెక్ట్ లోనే బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ కూడా నటిస్తారని తెలుస్తోంది.
వరుసగా ఆచార్య, గాడ్ ఫాదర్, భోళాశంకర్, బాబీ సినిమాల తర్వాత రీసెంట్ గా మెగాస్టార్(Megastar Chiranjeevi) .. యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములాకు తన 156వ సినిమా చేసే అవకాశం ఇచ్చారు. ట్రిపుల్ ఆర్ నిర్మాత డివివి దానయ్య తో మెగా మూవీని ప్రకటించారు. ఆ తర్వాత మెగా కాంబినేషన్ లో మారుతి, అనిల్ రావిపూడి యాడ్ కాబోతున్నారు.
యంగ్ హీరోలు కుళ్లు కునేలా మెగాస్టార్(Megastar Chiranjeevi) యమా స్పీడ్ చూపిస్తున్నారు. అసలే చాలామంది యంగ్ స్టార్స్ సక్సెస్ లేక బావురుమంటుంటే.. మెగాస్టార్ మాత్రం వరుసగా సినిమాలు ప్రకటిస్తున్నారు. అది కూడా మంచి కంటెంట్ ఉన్న కథలను మాత్రమే మెగాస్టార్ తీసుకుంటున్నారు.