MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • చిరంజీవి విషయంలో తప్పులో కాలేసిన కృష్ణంరాజు, అల్లు అరవింద్.. మొగుడవుతాడు చూడండి అంటూ మరో హీరో అంచనా

చిరంజీవి విషయంలో తప్పులో కాలేసిన కృష్ణంరాజు, అల్లు అరవింద్.. మొగుడవుతాడు చూడండి అంటూ మరో హీరో అంచనా

మెగాస్టార్ చిరంజీవి 45 ఏళ్లుగా టాలీవుడ్ లో తిరుగులేని నటుడిగా రాణిస్తున్నారు. మెగాస్టార్ గా చిరంజీవి దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమలో తిరుగులేని ఆదిపత్యం ప్రదర్శించారు. 1979లో పునాదిరాళ్లు, ప్రాణం ఖరీదు చిత్రాలతో చిరంజీవి కెరీర్ ప్రారంభమైంది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : May 12 2025, 08:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Megastar Chiranjeevi

Megastar Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి 45 ఏళ్లుగా టాలీవుడ్ లో తిరుగులేని నటుడిగా రాణిస్తున్నారు. మెగాస్టార్ గా చిరంజీవి దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమలో తిరుగులేని ఆదిపత్యం ప్రదర్శించారు. 1979లో పునాదిరాళ్లు, ప్రాణం ఖరీదు చిత్రాలతో చిరంజీవి కెరీర్ ప్రారంభమైంది. నటనతో డాన్స్లతో నెమ్మదిగా ఎదుగుతూ ఖైదీ చిత్రంతో ఒక్కసారిగా టాలీవుడ్ లో విస్ఫోటనం సృష్టించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఖైదీ మూవీ చిరంజీవిని స్టార్ హీరోగా నిలబెట్టింది ఆ తర్వాత చిరు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తన కెరీర్ బిగినింగ్ లో చిరంజీవి కృష్ణంరాజు, మురళీమోహన్ లాంటి హీరోలతో సన్నిహితంగా ఉండేవారు. వీళ్లంతా కలిసి కొన్ని చిత్రాల్లో నటించారు కూడా. చిరంజీవి చురుకుదనం చూసి.. లెజెండ్రీ కమెడియన్ అల్లు రామలింగయ్య అతడిని అల్లుడుగా చేసుకోవాలని భావించారు. తన కుమార్తె సురేఖని ఇచ్చి చిరంజీవికి వివాహం చేశారు.

Related Articles

Related image1
లండన్ లో RRR హీరోల సందడి.. వేదికపైనే ఎన్టీఆర్ కి సర్ప్రైజ్ ఇచ్చిన రాంచరణ్
35

అప్పటికే చిరంజీవి నటనలో నెమ్మదిగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు కానీ స్టార్ హీరో కాలేదు. అయితే చిరంజీవిని బిగినింగ్ లో చూసినప్పుడు కృష్ణంరాజు అల్లు అరవింద్ తప్పుగా అంచనా వేశారట. చిరంజీవి విషయంలో కృష్ణంరాజు అల్లు అరవింద్ అంచనా పూర్తిగా తప్పింది. కెరీర్ బిగినింగ్ లో చిరంజీవి రగ్గడ్ లుక్, యాక్టివ్  నెస్ చూసి కృష్ణంరాజు మురళీమోహన్ తో ఇలా అన్నారట. 'వీడు ఇండస్ట్రీలో మంచి విలన్ అవుతాడండి' అని కృష్ణంరాజు అన్నారట.

45

వెంటనే మురళీమోహన్ కృష్ణంరాజుకి సమాధానం ఇచ్చారట. ఇండస్ట్రీలో విలన్ అవడం ఏంటండీ బాబు.. ఇండస్ట్రీకి మొగుడు అవుతాడు చూడండి అని మురళీమోహన్ అంచనా వేశారట. కృష్ణంరాజు తరహాలోనే అల్లు అరవింద్ కూడా చిరంజీవి గురించి పొరపాటు పడ్డారు. మా చెల్లెలు సురేఖని చిరంజీవికి ఇవ్వాలనుకున్నాం. ఆ టైంలో చిరంజీవిని చూసినప్పుడు మంచి విలన్ అవుతాడు అని అనుకున్నా. కానీ ఇంత పెద్ద స్టార్ హీరో అవుతాడని ఊహించలేదు అని అల్లు అరవింద్ అన్నారట.

55

చిరంజీవి వచ్చాక తెలుగు సినిమా వేగం పూర్తిగా మారిపోయింది అని మురళీమోహన్ అన్నారు. అప్పటివరకు ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు ఇలాంటి హీరోలంతా ఒక స్టైల్ ఫాలో అయ్యేవారు. కానీ చిరంజీవి తెలుగు సినిమాకి కొత్త స్టైల్ తీసుకొచ్చారు. పాటల్లో హీరోయిన్లు మాత్రమే కాదు హీరోలు కూడా హైలెట్ అవ్వచ్చు అని చిరంజీవి నిరూపించినట్లు మురళీమోహన్ అన్నారు.

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
కృష్ణంరాజు

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Related Stories
Recommended image1
లండన్ లో RRR హీరోల సందడి.. వేదికపైనే ఎన్టీఆర్ కి సర్ప్రైజ్ ఇచ్చిన రాంచరణ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved