MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఇంద్ర, ఠాగూర్, గ్యాంగ్ లీడర్ చిత్రాలని ఏ హీరోలు రీమేక్ చేయాలో చెప్పిన చిరు.. మహేష్, ప్రభాస్ ఇంకా ఎవరెవరంటే

ఇంద్ర, ఠాగూర్, గ్యాంగ్ లీడర్ చిత్రాలని ఏ హీరోలు రీమేక్ చేయాలో చెప్పిన చిరు.. మహేష్, ప్రభాస్ ఇంకా ఎవరెవరంటే

చిరంజీవి, బాలయ్య గతంలో నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి, ఆదిత్య 369 లాంటి చిత్రాలకు సీక్వెల్స్ రావాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి తన పాత సినిమాల గురించి చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Dec 21 2024, 01:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఒకప్పుడు రీమేక్ చిత్రాల ట్రెండ్ ఎక్కువగా ఉండేది. ఓటీటీ వచ్చాక రీమేక్ చిత్రాల ప్రభావం తగ్గింది. ప్రస్తుతం సీక్వెల్స్ హవా సాగుతోంది. సూపర్ హిట్ చిత్రాలకు సీక్వెల్స్ చేయడానికి మేకర్స్ ఇష్టపడుతున్నారు. అందుకే డైరెక్టర్ శంకర్ లాంటి వాళ్ళు కూడా ఎప్పుడో పాతికేళ్ల క్రితం వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా భారతీయుడు 2 తెరకెక్కించారు. అది విజయం సాధించలేదు. రీసెంట్ గా పుష్ప 2 వచ్చింది. బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

చిరంజీవి, బాలయ్య గతంలో నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి, ఆదిత్య 369 లాంటి చిత్రాలకు సీక్వెల్స్ రావాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి తన పాత సినిమాల గురించి చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రాలకి సీక్వెల్స్ కానీ, రీమేక్స్ గాని వస్తే ఏ హీరోలు ఏ సినిమా చేయాలో కూడా వివరించారు. మెగాస్టార్ మాటలు వింటే ఆయన ఛాయిస్ పర్ఫెక్ట్ అనాల్సిందే. 

35

ముందుగా గ్యాంగ్ లీడర్ చిత్రం గురించి చెప్పారు. ఆ మూవీలో నా పాత్రని రాంచరణ్ కానీ, ఎన్టీఆర్ కానీ ఎవరో ఒకరు పోషించాలి. వారికి ఆ పాత్ర బాగా సెట్ అవుతుంది అని చిరు అన్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ అయితే మహేష్ బాబుకి బాగా సెట్ అవుతుంది. అదే విధంగా రాంచరణ్ కి కూడా బావుంటుంది అని అన్నారు. 

45

ఠాగూర్ సినిమాకి మాత్రం తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే పర్ఫెక్ట్ ఛాయిస్ అని చిరు తెలిపారు. ఇంద్ర చిత్రం అయితే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి బాగా సెట్ అవుతుందని చిరు తెలిపారు. 

55

ఇక ఛాలెంజ్ చిత్రం అయితే అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ ఇద్దరికీ బావుంటుంది అని తెలిపారు. రౌడీ అల్లుడు చిత్రం అల్లు అర్జున్ కి కానీ, రవితేజకి కానీ బావుంటుంది అని తెలిపారు. చివర్లో స్వయం కృషి మూవీ గురించి అడగగా అది చిరంజీవికి మాత్రమే సాధ్యం అని తన గురించి తాను చెప్పుకున్నారు. దీనితో అక్కడున్న వారంతా చప్పట్లతో మోతెక్కించారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
అల్లు అర్జున్
విజయ్ దేవరకొండ

Latest Videos
Recommended Stories
Recommended image1
నాగబాబు 'మేము కాప్‌లం' సిరీస్ షూటింగ్ లో మతిపోగొట్టే మ్యాటర్.. జస్ట్ 17 రోజుల్లోనే ఫినిష్, ఎలా సాధ్యమైంది ?
Recommended image2
Karuppu Movie: త్రిష, సూర్య మరోసారి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయాల్సింది.. ఎలా మిస్సయ్యారో తెలుసా ?
Recommended image3
Cast Fees: మృణాల్ ఠాకూర్ ముందు తేలిపోయిన పూజా హెగ్డే.. రెమ్యునరేషన్ లో క్లియర్ డామినేషన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved