- Home
- Entertainment
- ఆ లెజెండ్రీ హీరోయిన్ బయోపిక్ చిత్రానికి రష్మిక సరిపోతుందా ? చిరంజీవి చెప్పిన నిజం వైరల్
ఆ లెజెండ్రీ హీరోయిన్ బయోపిక్ చిత్రానికి రష్మిక సరిపోతుందా ? చిరంజీవి చెప్పిన నిజం వైరల్
విజయ్ దేవరకొండతో ఎంగేజ్మెంట్ తర్వాత రష్మిక టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. ఓ లెజెండ్రీ నటి బయోపిక్ చిత్రంలో రష్మిక నటించాలనే డిమాండ్ పెరుగుతోంది. ఆ వివరాలు ఈ కథనంలో చూద్దాం.

రష్మిక, విజయ్ దేవరకొండ నిశ్చితార్థం
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ రిలేషన్ షిప్ లో అధికారికంగా తొలి అడుగు ముందుకు వేశారు. శుక్రవారం రోజు విజయ్, రష్మిక నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విజయ్, రష్మిక వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. గీత గోవిందం చిత్రం నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఎట్టకేలకు పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. విజయ్, రష్మిక నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి వీరిద్దరి గురించి అనేక ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సౌందర్యపై రష్మిక అభిమానం
రష్మిక మందన్న బెంగళూరు నుంచి వచ్చిన నటి. లెజెండ్రీ నటి సౌందర్య కూడా బెంగుళూరుకి చెందిన వారే. దాదాపు దశాబ్దం పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమని ఏలిన సౌందర్య ప్రమాదవశాత్తూ పిన్న వయసులోనే మరణించారు. రష్మిక మందన్నకి సౌందర్య అంటే చాలా ఇష్టం అట. రష్మిక తండ్రి తరచుగా ఆమెతో నువ్వు సౌందర్య లాగా ఉంటావు.. ఆమె పోలికలు ఉన్నాయి అని చెబుతూ ఉండేవారట. అభిమానులు కూడా రష్మిక, సౌందర్య మధ్య స్పష్టమైన పోలికలు ఉన్నాయని పలు సందర్భాల్లో కామెంట్స్ చేస్తుంటారు.
సౌందర్యలాగా ఉంటానని అంటుంటారు
ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. ' నేను సౌందర్య గారిలా ఉంటానని మా నాన్న అంటుంటారు. అవకాశం ఉంటే సౌందర్య బయోపిక్ లో నటించాలని ఉంది' అంటూ రష్మిక తన కోరిక బయటపెట్టింది. మరి రష్మిక కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి. ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి కూడా రష్మికని సౌందర్యతో పోల్చారు.
చిరంజీవి కూడా సౌందర్యే గుర్తుకు వచ్చిందట
కుబేర మూవీ సక్సెస్ ఈవెంట్ లో చిరంజీవి రష్మిక పై ప్రశంసలు కురిపించారు. రష్మిక తొలి చిత్రం ఛలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా చిరంజీవి హాజరయ్యారు. రష్మికని ఆమె తొలి చిత్రం నుంచి గమనిస్తున్నాను అని చిరంజీవి అన్నారు. 'రష్మిక రోజు రోజుకి తన ఇమేజ్ పెంచుకుంటోంది. ఆమె నేషనల్ క్రష్ కాదు ఇంటర్నేషనల్ క్రష్. కుబేర మూవీలో రష్మిక అమాయకంగా తాను ప్రేమించిన వాడి కోసం కుటుంబాన్ని వదిలేసి వస్తుంది. ఆమె పాత్ర చూసినప్పుడు చూడాలని ఉంది చిత్రంలో సౌందర్య గుర్తుకు వచ్చింది. ఆ మూవీలో సౌందర్య కూడా తాను ప్రేమించిన అప్పారావు కోసం వచ్చేస్తుంది అని చిరంజీవి ఫన్నీగా చెప్పారు.
సౌందర్య బయోపిక్
మొత్తంగా రష్మికని అభిమానులు సెలెబ్రిటీలు ఏదో విధంగా సౌందర్యతో పోల్చుతూనే ఉన్నారు. సౌందర్య బయోపిక్ లో రష్మిక నటిస్తే బావుంటుందనే అభిప్రాయం చాలామందిలో ఉంది. మహానటి సావిత్రి బయోపిక్ లో కీర్తి సురేష్ నటించి మెప్పించడం మాత్రమే కాదు.. జాతీయ అవార్డు సైతం కొల్లగొట్టింది.