- Home
- Entertainment
- లెజెండ్రీ హీరోయిన్ కి తన పేరు చెప్పడానికి కూడా భయపడ్డ చిరంజీవి, ఆమె ఆశీర్వాదం వల్లే మెగాస్టార్ అయ్యాడా
లెజెండ్రీ హీరోయిన్ కి తన పేరు చెప్పడానికి కూడా భయపడ్డ చిరంజీవి, ఆమె ఆశీర్వాదం వల్లే మెగాస్టార్ అయ్యాడా
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎందరో గొప్ప నటులు, నటీమణులతో కలసి నటించారు. ఎన్ని చిత్రాల్లో నటించినప్పటికీ ప్రతి నటుడికీ కెరీర్ లో మరచిపోలేని క్షణాలు ఉంటాయి.

Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎందరో గొప్ప నటులు, నటీమణులతో కలసి నటించారు. ఎన్ని చిత్రాల్లో నటించినప్పటికీ ప్రతి నటుడికీ కెరీర్ లో మరచిపోలేని క్షణాలు ఉంటాయి. అలాంటి అరుదైన అనుభవం చిరంజీవికి కెరీర్ బిగినింగ్ లోనే ఎదురైంది.
చిరంజీవి తొలిసారి కెమెరా ఫేస్ చేసిన చిత్రం పునాది రాళ్లు. ఈ చిత్రంలో చిరంజీవి చిన్న పాత్రలో నటించారు. మెగాస్టార్ కి టాలీవుడ్ లో అదే తొలి అవకాశం. అప్పటికి తాను ఇంకా ఫిలిం ఇన్స్టిట్యూట్ కోర్సు పూర్తి చేయలేదు. కానీ అవకాశం వస్తే నటిస్తానని చెప్పాను. రాజమండ్రిలో షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో ఎవరు నటిస్తున్నారు అనే వివరాలు కూడా నాకు పూర్తిగా తెలియదు.
షూటింగ్ కి వెళ్ళాక నువ్వు ఎవరితో నటిస్తున్నావో తెలుసా అని చిత్ర యూనిట్ లో ఒకరు అడిగారు. తెలియదు అని చెప్పా. మహానటి సావిత్రి గారి కాంబినేషన్ లో నటించబోతున్నావు అని చెప్పారు. ఒక్కసారిగా నా ఒళ్ళు జలదరించింది. ఆమె హోటల్ రూమ్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆమెకి పరిచయం చేస్తాను అని నన్ను అక్కడికి తీసుకుని వెళ్లారు.
ఎంతగానో అభిమానించే సావిత్రి గారిని ఒక్కసారిగా చూడగానే నా నోట మాట రాలేదు. నీ పేరేంటి బాబు అని సావిత్రి గారు నన్ను అడిగారు. మహానటి అలా అడగగానే తడబడిపోయా. భయం వేసింది. అప్పటి వరకు నా పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. కానీ సినిమా కోసం చిరంజీవి అని మార్చుకున్నా. అది గుర్తు చేసుకుని కాస్త ధైర్యం తెచ్చుకుని చిరంజీవి అని చెప్పా. ఆమె వెంటనే శుభం, గాడ్ బ్లెస్ యు అని దీవించారు. ఆ విధంగా సావిత్రి గారితో తొలి సంభాషణ ముగిసింది.
Actress Savitri
ఇక షూటింగ్ జరుగుతున్న సమయంలో మధ్యలో వర్షం కురిసింది. నటీనటులంతా ఒక చోట కూర్చున్నారు. అందరికీ బోర్ కొడుతోంది. చిత్ర యూనిట్ లో నా ఫ్రెండ్ ఒకరు.. మీకు తెలుసా ఇతను చిరంజీవి, డ్యాన్స్ చాలా బాగా చేస్తాడు అని చెప్పారు. టైం పాస్ కోసం డ్యాన్స్ చేయమని అందరూ అడిగారు. డ్యాన్స్ అంటే నాకు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. వెంటనే టేప్ రికార్డర్ ఆన్ చేసి డ్యాన్స్ మొదలు పెట్టాను. సావిత్రి గారు కూడా చూస్తున్నారు.
వర్షం పడడంతో మధ్యలో కాలు జరిగింది. కింద పడ్డాను. కాని దానిని కూడా డ్యాన్స్ లాగా కవర్ చేశాను. అది సావిత్రి గారు గమనించి నాతో ఆ తర్వాత మాట్లాడారు. నువ్వు నాకు బాగా నచ్చావయ్యా. మంచి ఆర్టిస్ట్ అవుతావు. కింద పడ్డా కూడా తగ్గకుండా డ్యాన్స్ చేశావు. ఆ లక్షణం నాకు నచ్చింది అని ఆమె అన్నారు. ఆమె నోటి చలవ ఏమో కానీ ఈ రోజు ఇంతటి వాడిని అయ్యాను అని చిరంజీవి గుర్తు చేసుకున్నారు.