విరహవేదనతో అల్లాడిపోతున్న నిహారిక... మత్తుగా ముస్తాబై ఎవరికోసమో ఎదురుచూపులు!
నిహారిక కొణిదెల వరుస ఫోటో షూట్స్ తో సోషల్ మీడియా జనాలను ఉక్కిరిబిక్కరి చేస్తుంది. రకరకాల కోణాల్లో అందాలు విందు చేస్తుంది. నిహారిక లేటెస్ట్ ఫొటోస్ వైరల్ అవుతుంది.
Niharika Konidela
చీరలో నిండుగా ముస్తాబైన నిహారిక కళ్ళలో మాత్రం విరహ వేదన స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరి కోసమో ఎదుచూస్తున్న భావన ఆమె కళ్ళలో ఉంది. నిహారికలోని కొత్త కోణం ఆకట్టుకుంటుంది.
Niharika Konidela
ఇక వ్యతిరేకత మధ్య నిహారిక హీరోయిన్ గా మారింది. నాగ శౌర్య హీరోగా విడుదలైన ఒక మనసు ఆమె మొదటి చిత్రం. నిహారిక హీరోయిన్ కావడాన్ని మెగా ఫ్యాన్స్, ఫ్యామిలీ మెంబర్స్ వ్యతిరేకించారు. అయినా హీరోయిన్ కావాలన్న తన కోరిక నెరవేర్చుకుంది.
Niharika Konidela
హీరోయిన్ గా తెలుగులో నిహారిక మూడు చిత్రాలు చేశారు. తమిళంలో ఓ చిత్రంలో నటించారు. ఆమె నటించిన హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం ఆశించిన స్థాయిలో ఆడలేదు. చిరంజీవి పాన్ ఇండియా మూవీ సైరా నరసింహారెడ్డిలో గెస్ట్ రోల్ చేసింది.
Niharika Konidela
నటిగా ఫెయిల్ కావడంతో నాగబాబు కోరిక మేరకు వివాహం చేసుకుంది. పెళ్లి చేసుకున్నా యాక్టింగ్ కి దూరం కాకూడదని నిహారిక అనుకున్నారు. 2020 డిసెంబర్ నెలలో నిహారిక పెద్దలు చూసిన వెంకట చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది. కారణం తెలియదు కానీ ఇద్దరికీ మనస్పర్థలు తలెత్తాయి.
కొద్దిరోజుల క్రితం నిహారిక-వెంకట చైతన్య విడాకుల ప్రకటన చేశారు. విడాకుల ప్రకటన అనంతరం నిహారిక సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాము. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మద్దతుగా నిలిచారు. ఈ సమయంలో కొంత ప్రైవసీ కావాలి, దయచేసి అర్థం చేసుకోగలరంటూ నిహారిక పోస్ట్ పెట్టారు.
పెళ్లి అయ్యాక నిహారిక నటనకు దూరమైంది. మరలా ఇప్పుడు యాక్టీవ్ అయ్యింది. ఇటీవల డెడ్ ఫిక్స్సెల్స్ టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ చేసింది. కాంటెంపరరీ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో ప్రసారమవుతుంది. అయితే పెద్దగా ఆదరణ దక్కించుకోలేదు.
Niharika Konidela
అలాగే నిహారిక సొంత ఆఫీస్ ఓపెన్ చేసింది. ఆమెకు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ఉంది. ఈ బ్యానర్లో వెబ్ సిరీస్లు, చిన్న చిత్రాలు చేయాలని ప్లాన్ చేస్తుంది. యువ రచయితలు, దర్శకులతో చర్చలు జరుపుతోంది. ఇక నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి...