నయాగార వొంపులు చూపిస్తూ రోడ్డుపైకొచ్చిన మీనాక్షి చౌదరి.. షర్ట్ లేకుండా ఒరిజినల్ లుక్‌తో కిర్రాక్ పోజులు..
`ఖిలాడి` బ్యూటీ మీనాక్షి చౌదరి ఇప్పుడిప్పుడే కెరీర్ పుంజుకుంటుంది. మంచి గాడిలో పడుతుంది. దీనికి గ్లామర్ డోస్‌ని యాడ్ చేస్తూ దాన్ని మరింతగా పెంచుతుంది. నెట్టింట రచ్చ చేస్తుంది.
మీనాక్షి చౌదరి.. జీవితంలో చాలా ఆటుపోట్లు, ఎత్తుపల్లాలున్నాయి. విభిన్న షేడ్స్ ఉన్నాయి. పడటం లేవడాలున్నాయి. జీవితం చాలా కోణాలకు, రూపాలకు ప్రతిరూపం. ఆ విషయాన్ని తాజాగా వెల్లడించింది మీనాక్షి చౌదరి. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ మేరకు ఆమె ఫోటోలను, తన భావాలను పంచుకుంది.
`హిట్` బ్యూటీగా పాపులర్ అయిన మీనాక్షి చౌదరి.. తన భావోద్వేగాలను పంచుకుంది. గత కొన్నాళ్లు గా తన లైఫ్ ఎలా సాగుతుందో తెలిపింది. ఇందులో తన డిఫరెంట్ లుక్స్ ని పోస్ట్ చేసింది. వివిధ ప్లేసుల్లో, విభిన్న లుక్స్ లో కనిపించి ఆకట్టుకుంటుంది.
ఇందులో మీనాక్షి చౌదరి టైట్ జీన్స్ ధరించింది. జాకెట్ లేకుండా స్లీవ్ లెస్ టాప్‌లో మెరిసింది. చిలిపి పోజులతో ఆకట్టుకుంటుంది. నెట్టింట గిలిగింతలు పెడుతుంది. దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
ఇటీవల రెడ్ డ్రెస్‌లో కనిపించి షాకిచ్చింది మీనాక్షి చౌదరి. ఉబికి వచ్చే ఎద అందాలతో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఇప్పుడు సరికొత్త గెటప్‌లతో మంత్రముగ్దుల్ని చేస్తుంది. ఆశ్చర్యపరుస్తుంది. ఇందులో ఆమె పేర్కొంటూ..
గత కొన్నేళ్లుగా ఎప్పుడూ అనుభవించని భావోద్వేగాలను జీవితంలోని వివిధ దశల రోలర్ కోస్టర్ రైడ్ ని చూసినట్టు తెలిపింది. ఈ క్రమంలో తాను పడిపోయానని, ప్రయత్నించానని, లేచానని, మధ్యలో ఇవన్నీ జరిగినట్టు తెలిపింది.
ఈ క్రమంలో తాను ఆత్మ పరిశీలన చేసుకుందట. అసలు జీవితాన్ని చూడటం నేర్చుకుందట. తాను ముందే ఇదంతా గ్రహించలేదని, ఇదొక లైఫ్‌ని మార్చే ఎక్స్ పీరియెన్స్ అని పేర్కొంది.
ప్రతి దశలోనూ స్థిరంగా ఉండే ఒక విషయం ఆ చిరు నవ్వు, కాలంతోపాటు ప్రతిదీ మెరుగుపడుతుందని, అది తనకు అర్థమయ్యేలా చేసిందని చెప్పింది.
ప్రస్తుతం జీవితంలోని ఏ దశలో ఉన్న వారైనా, మంచి చెడు, చిరు నవ్వు తెప్పించే జీవితంలో మీరు ఆలోచించగలిగే ఒక విషయం గుర్తుంచుకోవాలని తెలిపింది. ఇటీవల కాలంలో తన జీవితంలోని వివిధ దశల్లోని కొన్ని యాదృచ్చిక చిత్రాలను పోస్ట్ చేస్తున్నట్టు తెలిపింది.
`ఖిలాడి` సక్సెస్ ఇవ్వకపోయినా `హిట్ 2`తో హిట్ అందుకుని బిజీ అయిపోయింది మీనాక్షి. ప్రస్తుతం వరుసగా ఆఫర్లు అందుకుని బిజీగా గడుపుతుంది.
ఇప్పుడు విశ్వక్ సేన్‌తో ఓ సినిమా చేస్తుంది. అలాగే `గుంటూరు కారం`లో మహేష్‌బాబుతో నటిస్తుంది. మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లతో ముందుకు రాబోతుంది.