మీనాక్షి చౌదరికి ఎవరిపై క్రష్ ఉందో తెలుసా.. ఆమె నెక్స్ట్ టార్గెట్ వీళ్ళే
ఇటీవల టాలీవుడ్ లో మీనాక్షి చౌదిరి పేరు గట్టిగా వినిపిస్తోంది. వరుస చిత్రాల్లో ఆమెకి అవకాశాలు దక్కుతున్నాయి. అంతే కాదు విజయాలు కూడా అందుకుంటోంది. గత ఏడాది మీనాక్షి చౌదరి ఏకంగా అర డజను చిత్రాల్లో నటించింది.

ఇటీవల టాలీవుడ్ లో మీనాక్షి చౌదిరి పేరు గట్టిగా వినిపిస్తోంది. వరుస చిత్రాల్లో ఆమెకి అవకాశాలు దక్కుతున్నాయి. అంతే కాదు విజయాలు కూడా అందుకుంటోంది. గత ఏడాది మీనాక్షి చౌదరి ఏకంగా అర డజను చిత్రాల్లో నటించింది. అన్నీ క్రేజీ చిత్రాలే. మహేష్ బాబు సరసన గుంటూరు కారం చిత్రంలో నటించింది. అయితే ఈ మూవీలో మీనాక్షి చౌదరికి అంతగా గుర్తింపు ఉన్న పాత్ర దక్కలేదు.
అదే విధంగా గోట్ చిత్రంలో నటించింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో, దుల్కర్ సల్మాన్ కి జోడిగా మీనాక్షి నటించిన లక్కీ భాస్కర్ చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది. అదే విధంగా వరుణ్ తేజ్ మట్కా, విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ చిత్రాల్లో మీనాక్షి నటించింది. తాజాగా సంక్రాంతికి రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో మీనాక్షి చౌదరి కొత్త ఏడాదిని గ్రాండ్ గా ప్రారంభించింది. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం బ్లాక్ బస్టర్ దిశగా పయనిస్తోంది.
గ్లామర్ తో యువతని ఆకర్షిస్తూ మీనాక్షి వరుస చిత్రాల్లో ఛాన్సులు కొట్టేస్తోంది. కెరీర్ బిగినింగ్ లో ఆమెకి ఫ్లాపులు పడ్డాయి. ఆమె నటించిన ఖిలాడీ చిత్రం డిజాస్టర్. కానీ గ్లామర్ పరంగా రెచ్చిపోయింది. రీసెంట్ ఇంటర్వ్యూలో మీనాక్షి చౌదరి తన క్రష్ ఎవరో తెలిపింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పై తనకి క్రష్ ఉన్నట్లు ఓపెన్ గా చెప్పేసింది. ప్రభాస్ తో ఎలాగైనా నటించాలని అనుకుంటోందట. అందరి హీరోలతో నటించాలని ఉంది. ఒక్కొక్కరిది ఒక్కో యూనిక్ స్టైల్ ఉంటుంది.
ముందుగా ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో నటించాలని ఉన్నట్లు మీనాక్షి పేర్కొంది. పవన్ కళ్యాణ్ గారితో ఛాన్స్ వస్తుందో రాదో తెలియదు. ఎందుకంటే ఆయన బిజీ. ఒక వేళ వస్తే మాత్రం ఛాన్స్ వదులుకోను అంటూ మీనాక్షి పేర్కొంది.
సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో మీనాక్షి చౌదరి వెంకటేష్ మాజీ ప్రేయసిగా, పోలీస్ అధికారిగా నటించింది. ఈ చిత్రంలో వెంకటేష్, మీనాక్షి, ఐశ్వర్య రాజేష్ మధ్య ఫన్ సీన్స్ బాగా పేలాయి. 2025 లో మీనాక్షి మరిన్ని క్రేజీ ఆఫర్స్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.