- Home
- Entertainment
- సౌందర్యతో పాటు నేను కూడా చనిపోయేదాన్ని, ఆ రోజు ఏం జరిగిందంటే.. ఒళ్ళు గగుర్పొడిచే విషయం బయటపెట్టిన మీనా
సౌందర్యతో పాటు నేను కూడా చనిపోయేదాన్ని, ఆ రోజు ఏం జరిగిందంటే.. ఒళ్ళు గగుర్పొడిచే విషయం బయటపెట్టిన మీనా
Actress Meena : సౌందర్య మరణం గురించి నటి మీనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు తాను ఎలా ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నాను అనే విషయాన్ని రివీల్ చేశారు.

సౌందర్య హెలికాప్టర్ ప్రమాదం
చిత్ర పరిశ్రమలో సౌందర్య కెరీర్ ఎంతటి విషాదకరంగా ముగిసిందో తెలిసిందే. 2004 లో సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. కేవలం 32 ఏళ్ళ చిన్న వయసులోనే సౌందర్య మృతి చెందడంతో చిత్ర పరిశ్రమ ఆ విషాదాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఇప్పటికీ సినీ ప్రముఖులు సౌందర్యని గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతుంటారు. అలాంటి ఎమోషనల్ సంఘటన తాజాగా చోటు చేసుకుంది.
జయమ్ము నిశ్చయమ్మురా షోలో మీనా
సీనియర్ నటి మీనా, సౌందర్య కంటే ముందుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మీనా అంతకు ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించింది. ఆ తర్వాత సౌందర్య మీనా ఇద్దరూ హీరోయిన్లుగా పోటీ పడ్డారు. జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోకి మీనా అతిథిగా హాజరైంది. మీనా, జగపతి బాబు కలసి కొన్ని చిత్రాల్లో నటించారు. ఈ సందర్భంగా మీనా తన కెరీర్ గురించి, ఫ్యామిలీ గురించి అనేక విషయాలు వివరించింది.
సౌందర్య ఫోటో చూసి మీనా ఎమోషనల్
జగపతి బాబు ఒక ఫోటో చూపించి.. ఈ ఫోటో చూస్తుంటే నీకు ఏం గుర్తుకు వస్తోంది అని అడిగారు. ఆ ఫొటోలో పోలీస్ గెటప్ లో ఉన్న సౌందర్యతో మీనా ఉన్నారు. ఆ ఫోటో చూడగానే మీనా ఎమోషనల్ అయ్యారు. సౌందర్య మరణం గురించి మీనా మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. మా మధ్య కాంపిటీషన్ చాలా హెల్దీ గా ఉండేది. సౌందర్య చాలా అమేజింగ్ పర్సన్. నాకు బెస్ట్ ఫ్రెండ్. సౌందర్య నేను చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం.
ఆ రోజు నేను కూడా వెళ్ళాల్సింది
కానీ ఆమె మరణవార్త వినగానే నాకు చెమటలు పట్టేశాయి. ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయాను. వాస్తవానికి ఆ రోజు క్యాపైనింగ్ కి సౌందర్యతో పాటు నేను కూడా వెళ్ళాల్సింది. క్యాపైనింగ్ కి నన్ను కూడా పిలిచారు. కానీ నాకు పాలిటిక్స్, ఎన్నికల ప్రచారాలు ఇవన్నీ ఇష్టం లేదు. దీనితో షూటింగ్ ఉందని చెప్పి తప్పించుకున్నా. కానీ ఆ సంఘటన జరిగిందని తెలియగానే ఓ మై గాడ్.. నేను కూడా వెళ్లాల్సిన క్యాంపైనింగ్ అది అని మీనా గుర్తు చేసుకున్నారు.
సౌందర్యతో కలిసి నటించిన మూవీ
సౌందర్య, మీనా, జగపతి బాబు కలిసి చిలకపచ్చ కాపురం అనే చిత్రంలో నటించారు.ఈ షోలో మీనా ఇంకా అనేక విషయాల గురించి మాట్లాడింది. తన భర్త మరణం.. రెండో పెళ్లిపై వచ్చిన రూమర్స్ గురించి కూడా మీనా స్పందించింది.