MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • వాళ్లతో నన్ను ఎందుకు లింక్ చేస్తున్నారు? రెండో పెళ్లి రూమర్స్‌పై మీనా ఎమోషనల్

వాళ్లతో నన్ను ఎందుకు లింక్ చేస్తున్నారు? రెండో పెళ్లి రూమర్స్‌పై మీనా ఎమోషనల్

Meena: హీరో జగపతి బాబు జయమ్ము నిశ్చయమ్మురా షోలో మీనా తన కెరీర్‌లో ఎదుర్కొన్న అనుభవాలు, పర్సనల్ లైఫ్‌లో ఎదురైన కష్టాలను పంచుకున్నారు. స్టార్ హీరోయిన్‌గా మెప్పించిన మీనా రెండో పెళ్లి రూమర్స్ పై ఎమోషనల్ అయ్యారు.

2 Min read
Author : Rajesh K
Published : Sep 15 2025, 05:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మీనా సినీ ప్రయాణం
Image Credit : Social Media

మీనా సినీ ప్రయాణం

సీనియర్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 1986లో చైల్డ్ ఆర్టిస్టుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మీనా, అతి తక్కువ కాలంలోనే తన టాలెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నటించే అవకాశాలు దక్కించుకున్నారు. అలాగే.. రజనీకాంత్, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ, కృష్ణ లాంటి స్టార్ హీరోలందరితోనూ నటించే ఛాన్స్ కొట్టేసింది. వరుస విజయాలతో సినీ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్ గా ఎదిగారు. తన నటనతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
‘జయమ్ము నిశ్చయమ్మురా’లో మీనా
Image Credit : google

‘జయమ్ము నిశ్చయమ్మురా’లో మీనా

తాజాగా మీనా, ‘జయమ్ము నిశ్చయమ్మురా’ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ టాక్ షో జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా మీనా తన కెరీర్, పర్సనల్ లైఫ్, ఫిల్మ్ అనుభవాలు, తన లైఫ్ లో జరిగిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మీనా మాట్లాడుతూ “చాలామంది నిర్మాతలు ఫ్లాప్‌లలో ఉన్నామని, తక్కువ అమౌంట్‌తో సినిమా చేయమని నన్ను సంప్రదించేవారు. నేను సరేనని అంగీకరించేదాన్ని. ఆ చిత్రాలు సూపర్ హిట్ అయ్యేవి. కానీ తర్వాత నన్ను మర్చిపోయేవారు. నా కెరీర్ అంతా ఇలాగే జరిగింది” అని తెలిపారు.

35
కెరీర్ పీక్‌లో పెళ్లి
Image Credit : stockphoto

కెరీర్ పీక్‌లో పెళ్లి

మీనా తన కెరీర్‌లో వరుసగా అవకాశాలు వస్తున్న సమయంలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 2009లో విద్యాసాగర్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తరువాత ఆమెకు కూతురు పుట్టింది. కూతురు రెండేళ్ల వయసులో ఉన్నప్పుడు మలయాళంలో దృశ్యం సినిమా కోసం మీనాను సంప్రదించారు. మొదట చిన్నారిని వదిలి వెళ్లలేక తిరస్కరించగా, చిత్రబృందం “ఈ పాత్రను మీకోసమే రాశాం, వేరొకరితో చేయలేం” అని రిక్వెస్ట్ చేయడంతో చివరికి అంగీకరించినట్లు ఆమె చెప్పారు. ఆ సినిమా భారీ విజయాన్ని సాధించి, మీనా కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది.

45
రెండో పెళ్లి రూమర్స్‌పై ఎమోషనల్
Image Credit : Instagram

రెండో పెళ్లి రూమర్స్‌పై ఎమోషనల్

అదే ఇంటర్వ్యూలో మీనా రెండో పెళ్లి రూమర్స్‌పై ఘాటుగా స్పందించారు. “ఎవరు విడాకులు తీసుకున్నా.. వారితో నా పేరు కలిపి పెళ్లి అని రాయడం చాలా బాధ కలిగిస్తుంది. భర్తను కోల్పోయిన వారం రోజుల్లోనే నేను రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అలాంటి వదంతులు నాకు అసహ్యం వేసేవి. వాళ్లకు కుటుంబాలు ఉండవా.. ఇలా రాయడానికి?” అంటూ తన మనసులోని బాధను వ్యక్తం చేశారు. 2022లో అనారోగ్యంతో మీనా భార్త విద్యాసాగర్ మరణించిన విషయం తెలిసిందే. భర్త మరణించిన తరువాత నుంచి మీనా రెండో పెళ్లి చేసుకుంటుందంటూ రూమర్స్ క్రియేట్ అయ్యాయి.

55
కెరీర్‌లో గుర్తుండిపోయే క్షణాలు
Image Credit : social media

కెరీర్‌లో గుర్తుండిపోయే క్షణాలు

మీనా తన కెరీర్ లో జరిగిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను స్టార్ హీరోలతో చేసిన సినిమాలను గుర్తుచేసుకున్నారు. కృష్ణ, రజనీకాంత్ ఇద్దరికీ ఒకసారి కూతురుగా, మరోసారి హీరోయిన్‌గా నటించడం తన కెరీర్‌లో ప్రత్యేకమైన అనుభవమని పేర్కొన్నారు. అలాగే, నటుడు జగపతి బాబుతో నటించినప్పుడల్లా “మీ పక్కన నేను ఉంటే ఎవరూ నన్ను చూడరని.. అందరూ మిమ్మల్నే చూస్తారు” అని సరదాగా చెప్పి నవ్వులు పూయించారు. ప్రస్తుతం మీనా మూకుతి అమ్మన్ 2 సినిమాలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా మరోసారి బలమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
మీనా (నటి)
ఏషియానెట్ న్యూస్
వినోదం
ఓటీటీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
సౌందర్యతో పాటు నేను కూడా చనిపోయేదాన్ని, ఆ రోజు ఏం జరిగిందంటే.. ఒళ్ళు గగుర్పొడిచే విషయం బయటపెట్టిన మీనా
Recommended image2
మీనా హార్ట్ బ్రేక్‌ లవ్‌ స్టోరీ, ఆ స్టార్‌ హీరోనే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో తెగేసి చెప్పింది, కానీ అంతలోనే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved