- Home
- Entertainment
- Prema Entha Madhuram: భార్య డెలివరీ డబ్బుల కోసం కష్టపడుతున్న ఆర్య.. ల్యాండ్ అమ్మడానికి ప్లాన్ చేసిన మాన్సీ?
Prema Entha Madhuram: భార్య డెలివరీ డబ్బుల కోసం కష్టపడుతున్న ఆర్య.. ల్యాండ్ అమ్మడానికి ప్లాన్ చేసిన మాన్సీ?
Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. తమ్ముడు భవిష్యత్తు కోసం తపన పడుతున్న ఒక అన్న కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 5 ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో అప్పుడే మెలకువ వచ్చిన అనుని ఎలా ఉన్నావు అని అడుగుతాడు ఆర్య. మనకి కవల పిల్లలు పుట్టారు అని చెప్తాడు. ఆనందపడుతుంది అను. ఇంత చిన్న పొట్టలో ఎలా పుట్టారు అని అడుగుతాడు ఆర్య. ఎలా పుట్టారో తెలియదు కానీ ఎందుకు పుట్టారో తెలుసు. మీకు జూనియర్ అను కావాలి అందుకే పాప. నాకు జూనియర్ ఆర్య వర్ధన్ కావాలి అందుకే బాబు పుట్టాడు. అందుకే మనం దేవుడికి థాంక్స్ చెప్పాలి అంటుంది అను. ఇంతలో ఇద్దరు నర్సులు తీసుకువచ్చి పిల్లిలిద్దరినీ వాళ్ళిద్దరి చేతిలో పెడతారు. ఇద్దరూ ఆనందంతో పొంగిపోతారు.
ఇంతలో అను వచ్చి ఆర్యని గట్టిగా పిలుస్తుంది. ఇంకొక వారంలో మనకి పిల్లలు పుట్టేస్తారు అని చెప్తుంది. ఆల్రెడీ పుట్టేశారు నా కలలో అని చెప్తాడు ఆర్య. నేను కనకముందే మీరు కలలో చూసేసారా అంటూ నవ్వుతుంది అను. నా చెకప్ అంతా అయిపోయింది అంతా నార్మల్గానే ఉంది డాక్టర్ గారు మీతో మాట్లాడుతారంట రమ్మంటున్నారు అని చెప్తుంది అను. తన దగ్గరికి వచ్చిన ఆర్యతో ఇంకొక వన్ వీక్ లో డెలివరీ అయిపోతుంది త్రీ డేస్ తర్వాత జాయిన్ చేయండి. నార్మల్ డెలివరీ అయితే ఓకే.. సిజేరియన్ అయితే మాత్రం 2 1/2 లక్షలు వరకు ఖర్చవుతుంది అంటుంది డాక్టర్. సరే అని చెప్పి బయటికి వస్తాడు ఆర్య.
ఇప్పుడు అను కలలు కనడం చూసి ఆర్య నవ్వుతాడు. నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది ఇప్పుడే హాస్పిటల్లో జాయిన్ అయిపోతాను అంటుంది అను. మరోవైపు అంజలి నీరజ్ కి ఫోన్ చేసి నేను ఆర్య సర్ కి ఎంత చెప్పినా వినట్లేదు మీరైనా ఒకసారి చెప్పి చూడండి అంటుంది. దాదా ఒకసారి కమిట్ అయితే ఎవరి మాట వినడు. అతని మాటలు అన్నీ హార్ట్ నుంచి వస్తాయి. అసలే మదన్ కి నువ్వు హెల్ప్ చేయటం ఇష్టం లేదు ఇప్పుడు కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చెయొద్దు అంటూ ఫోన్ పెట్టేస్తాడు నీరజ్. ఆర్య సర్ కి హెల్ప్ చేసే అవకాశం ఇమ్మని దేవుణ్ణి వేడుకుంటుంది అంజలి.
మరోవైపు 50 ఎకరాల భూమిని అమ్మకానికి పెడుతుంది మాన్సీ. అప్పుడే అక్కడికి జెండే తో సహా వచ్చిన నీరజ్ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఎయిర్ పోర్ట్ పక్కనే ఉన్న భూమిని అమ్మకానికి పెట్టాను ఆ డబ్బుతో అప్పులన్నీ తీర్చేద్దాం అంటుంది మాన్సీ. నీకేమైనా పిచ్చా ఆస్తి అమ్మటం కుదరదు అంటూ బ్రోకర్ని వెళ్లిపోమంటాడు నీరజ్. నేను పిలిస్తే నువ్వు వెళ్లిపోమంటావ్ ఏంటి అంటుంది మాన్సీ. మీరు వెళ్ళండి అని గట్టిగా చెప్తాడు జెండే. బ్రోకర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక మీకు ఆస్తి అమ్మే హక్కు లేదు అది వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వర్కర్స్ కి ఇల్లులు కట్టించడానికి కేటాయించాడు ఆర్య. ఇప్పుడు ఆ భూమి ఆర్యది కాదు ఆ వర్కర్స్ ది అంటాడు.
ఆశ్చర్యపోయిన మాన్సీ ఎకరం 100 కోట్లు.. అక్కడ ఉన్నది 50 ఎకరాలు అంటే ఎన్ని వందల కోట్లు మన అప్పు తీరిపోగా ఇంకా చాలా డబ్బు మనకి మిగులుతుంది. ఇలాంటి పనికిమాలిన పనులు ఇంకా ఎన్ని చేశారు బ్రో ఇన్ లా.. ఆస్తి అంతా ఇలాగే తగలబెట్టేస్తున్నారా రేపటి రోజున మనకి చిప్పే మిగులుతుంది అంటూ గోల పెడుతుంది మాన్సీ. అది ఆయన సంపాదన ఆయన ఇష్టం అంటాడు నీరజ్. రేపు వేలంపాట ఎలా జరుగుతుందో నేను చూస్తాను అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మాన్సీ. నువ్వెందుకు చచ్చిపోవటం నేనే చచ్చిపోతాను అని నీరజ్ అన్నప్పటికీ పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది మాన్సీ.
కంట్రోల్ యువర్ సెల్ఫ్ నీరజ్ అంటాడు జెండే. నిజం నేను ఈ సిట్యువేషన్ ని హ్యాండిల్ చేయలేకపోతున్నాను అంటూ డిప్రెస్డ్ గా బిహేవ్ చేస్తాడు నీరజ్. మరోవైపు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్లాన్ గీస్తూ ఉంటాడు ఆర్య. ఏం చేస్తున్నారు సార్ అంటుంది అను. నిన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే రెండున్నర లక్షల వరకు ఖర్చు అవుతుంది అంట అందుకే ఒకరికి బిల్డింగ్ ప్లాన్ అవసరమంటే గీసి ఇస్తున్నాను అంటాడు ఆర్య. రేపు వందల కోట్లు సెటిల్ చేయబోతున్నారు ఈరోజు రెండు మూడు లక్షల కోసం కష్టపడుతున్నారు అంటూ ఎమోషనల్ అవుతుంది అను.
రేపు అప్పు తీర్చేది ప్రపంచానికి తెలిసిన ఆర్య వర్ధన్.. ఈరోజు కష్టపడేది ప్రపంచమే తెలియని ఈ పిల్లల తండ్రి. అయినా నాకు బాగా తెలిసిన పనే కదా చేస్తున్నాను ఒకప్పుడు ఇలాగే పనిచేసి కష్టపడే వాడిని ఇప్పుడు ఆ రోజులు గుర్తొస్తున్నాయి. అయినా ఎందుకు బాధపడతావ్ అంటూ భార్యని ఓదార్చుతాడు ఆర్య. తరువాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.