- Home
- Entertainment
- ఆదిపురుష్ టీజర్ పై మంచు విష్ణు ఘాటు కామెంట్స్ .. డిజాస్టర్ మూవీతో పోల్చుతూ, అంత మాట అనేశాడు ఏంటి..
ఆదిపురుష్ టీజర్ పై మంచు విష్ణు ఘాటు కామెంట్స్ .. డిజాస్టర్ మూవీతో పోల్చుతూ, అంత మాట అనేశాడు ఏంటి..
ఇప్పటికీ ప్రభాస్ అభిమానులు ఆదిపురుష్ టీజర్ ని జీర్ణించుకోలేకున్నారు. వింత ఆకారాలు, యానిమేషన్ గ్రాఫిక్స్ తప్ప అందులో రామాయణం కనిపించడం లేదు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం సంక్రాంతికి విడుదలయ్యేందుకు సిద్ధం అవుతోంది. రామాయణ గాధతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు అభిమానుల్లో ఉండేవి. కానీ టీజర్ విడుదలయ్యాక అంచనాలన్నీ తలక్రిందులు అయ్యాయి. దర్శకుడు ఓం రౌత్ ఏదో చేయబోయే ఇంకేదో చేసినట్లు ఉన్నాడు. గ్రాఫిక్స్ మాయలో పడి రామాయణాన్ని, ఆ పాత్రలని కించపరిచారు అంటూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
ఇప్పటికీ ప్రభాస్ అభిమానులు ఆదిపురుష్ టీజర్ ని జీర్ణించుకోలేకున్నారు. వింత ఆకారాలు, యానిమేషన్ గ్రాఫిక్స్ తప్ప అందులో రామాయణం కనిపించడం లేదు. ఇప్పటికే పలువురు ఆదిపురుష్ టీజర్ ని, దర్శకుడు ఓం రౌత్ ని తీవ్రంగా విమర్శించారు. డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు త్వరలో చిత్ర యూనిట్ మరో టీజర్ రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉండగా హీరో మంచు విష్ణు ఆదిపురుష్ టీజర్ పై ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచు విష్ణు ఇలాంటి కామెంట్స్ చేస్తాడు అని ఎవరూ ఊహించరు. కానీ తన మనసులో విషయాన్ని విష్ణు ఉన్నది ఉన్నట్లుగా బయట పెట్టాడు.
ఒక తెలుగు వ్యక్తిగా ఆదిపురుష్ టీజర్ చూసి నేను చాలా నిరాశ చెందా. చిత్ర యూనిట్ ఎందుకో చీట్ చేస్తున్నట్లు అనిపించింది. రామాయణం తెరకెక్కిస్తున్నారు అని వినగానే మెయిన్ స్ట్రీమ్ లైవ్ యాక్షన్ మూవీ అనుకున్నా. కానీ టీజర్ లో వీరు పూర్తిగా యానిమేషన్ మూవీ చూపించారు. దీనితో అందరిలాగే నేను కూడా నిరాశ చెందా.
ముందుగానే ఇది యానిమేషన్ మూవీ అని చెప్పి ఉంటే ఈ రేంజ్ లో ట్రోలింగ్ జరిగేది కాదేమో. ఆడియన్స్ అంచనాలు గ్రహించకుండా యానిమేషన్ గ్రాఫిక్స్ ఎలా చూపించినా ప్రయోజనం ఉండదు. ఆదిపురుష్ టీజర్ చూస్తున్నప్పుడు నాకు రజనీకాంత్, దీపికా పదుకొనె కొచ్చాడియాన్ చిత్రం గుర్తుకు వచ్చింది అంటూ మంచు విష్ణు ఘాటు కామెంట్స్ చేయడం ఆసక్తిగా మారింది.
కొచ్చాడియాన్ చిత్రం బిగ్ డిజాస్టర్ గా నిలిచి తీవ్రమైన నష్టాలు మిగిల్చింది. ఇలాంటి సినిమాలు చేస్తున్నప్పుడు ముందుగానే ఆడియన్స్ ని ప్రిపేర్ చేయాలి. లేకుంటే ఇలాగే జరుగుతుంది. ఓం రౌత్ గత చిత్రం తానాజీ నేను చూసాను. ప్రభాస్ తో అతడు సినిమా చేస్తున్నాడు అంటే ఎవరైనా గ్రాండ్ గా ఆశిస్తారు. కానీ ఆదిపురుష్ టీజర్ మాత్రం అలా లేదు అని మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్ చేశాడు.