- Home
- Entertainment
- శుభవార్త... అంటూ కవల పిల్లలపై స్పందించిన మంచు మనోజ్.. అసలు నిజం బయటపెట్టిన టాలీవుడ్ హీరో
శుభవార్త... అంటూ కవల పిల్లలపై స్పందించిన మంచు మనోజ్.. అసలు నిజం బయటపెట్టిన టాలీవుడ్ హీరో
మంచు మనోజ్ Manchu Manoj తనకు పుట్టబొయే బిడ్డపై స్పందించారు. తాజాగా తప్పుడు వార్తలు వస్తున్నాయంటూ... అసలు నిజాన్ని బయటపెట్టారు.

మంచు మనోజ్ Manchu Manoj - మౌనికా రెడ్డి (Mounika Reddy)ని గతేడాది పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ మధ్యలో మనోజ్ దంపతులు గుడ్ న్యూస్ కూడా చెప్పారు.
చివరి సారిగా తమకు పుట్టబోయే బిడ్డపై.. మౌనికా రెడ్డి ప్రెగ్నెన్సీని ప్రకటిస్తూ స్పందించారు. అప్పుడు తనకు రెండు నెల నడుస్తోందని దంపతులు సంతోషంగా చెప్పారు.
అయితే ప్రస్తుతం మళ్లీ వారికి పుట్టబోయే బిడ్డపై వార్తలు ఊపందుకున్నాయి. రీసెంట్ గానే శర్వానంద్ దంపతులు కూతురుకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మనోజ్ - మౌనికా కూడా తల్లిదండ్రులు అయ్యారని ప్రచారం.
తల్లిదండ్రలు అవ్వడమే కాదు... వారికి కవలలు పుట్టారంటూ అనాధికార సమాచారాన్ని నెట్టింట వైరల్ చేశారు. వార్తలు కూడా పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టాయి. ఇక దీనిపై మనోజ్ తాజాగా స్పందించారు. అసలు నిజం బయటపెట్టారు.
‘మా అభిమాన కుటుంబానికి శుభవార్త.. నా సతీమణికి ప్రస్తుతం ఏడోవ నెల. తను ఆరోగ్యంగా ఉంది. ఇంకొన్ని రోజుల్లో మా జీవితాల్లోకి రాబోతున్న బిడ్డల పట్ల ఎంతో సంతోషంగా ఎదురుచూస్తున్నాం.
కానీ ఒక విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాను. మాకు కవలలు పుట్టారంటూ బయట వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఆ సందర్భంగా వచ్చినప్పుడు మేమే తెలియజేస్తాం. దయచేసి అలాంటి వార్తలను పట్టించుకోవద్దు’ అంటూ అసలు నిజం బయటపెట్టారు.