లిప్ కిస్ గురించి మ్యాటర్ లీక్.. సిద్ధు జొన్నలగడ్డ పరువు తీసిన మంచు మనోజ్
మంచు మనోజ్ ఉస్తాద్ అనే షోకి హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. నెమ్మదిగా ఈ షో పాపులర్ అవుతోంది. సిద్దు జొన్నలగడ్డ రొమాంటిక్ సీక్రెట్ ని బయట పెడుతూ మంచు మనోజ్ ఓ విషయం లీక్ చేశాడు. అసలు మ్యాటర్ బయటకి రావడంతో సిద్దు పరువు పోయినంత పని అయింది.

మంచు మనోజ్ తన కెరీర్ లో నెమ్మదిగా స్పీడ్ పెంచుతున్నారు. ఈ ఏడాది కొన్ని నెలల క్రితం మంచు మనోజ్ భూమా మౌనికని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత మంచు విష్ణు పూర్తిగా కెరీర్ పై ఫోకస్ చేశాడు. ఇటీవల ఓ ఛానల్ లో మంచు మనోజ్ ఉస్తాద్ అనే షోకి హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.
నెమ్మదిగా ఈ షో పాపులర్ అవుతోంది. బాలయ్య అన్ స్టాపబుల్ షోతో సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య స్థాయిలో కాకపోయినా ఉస్తాద్ షోతో మంచు విష్ణు అదరగొడుతున్నాడు. ఇప్పటికే ఫస్ట్ ఎపిసోడ్ లో నేచురల్ స్టార్ నాని పాల్గొన్నాడు. మంచు మనోజ్ తన కామెడీ టైమింగ్, హీరోలని ఇరుకున పెట్టే విధానం, అల్లరి చేష్టలతో ఆకట్టుకుంటున్నాడు.
తాజాగా సెకండ్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. ఈ ఎపిసోడ్ కి హాజరవుతున్న స్టార్ ఎవరో కాదు టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ. ప్రోమో ఫుల్ ఫన్నీగా ఉంది. మంచు మనోజ్ సెటైర్లతో సిద్దుపై విరుచుకుపడ్డాడు. సిద్దు ఎంట్రీ ఇవ్వగానే.. స్టేజిపై చాలా బొక్కలు ఉన్నాయి. ఎక్కడ పడిపోతానో అని భయం వేసింది అని చెప్పాడు. మనోజ్ రియాక్ట్ అవుతూ నీకు బొక్కలు ఇష్టం అని అలా పెట్టారు బాబాయ్ అని పంచ్ వేశాడు.
సిద్దు జొన్నలగడ్డ గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిజ్ లీల, డీజే టిల్లు లాంటి చిత్రాలతో రొమాంటిక్ హీరోగా మారిపోయాడు. సిద్దు జొన్నలగడ్డ రొమాంటిక్ సీక్రెట్ ని బయట పెడుతూ మంచు మనోజ్ ఓ విషయం లీక్ చేశాడు. అసలు మ్యాటర్ బయటకి రావడంతో సిద్దు పరువు పోయినంత పని అయింది.
నువ్వు ఏ సినిమాకి అయినా స్క్రిప్ట్ రెడీ చేసుకునేముందు ముద్దు సీన్ తో మొదలు పెడతావట కదా అని మంచు మనోజ్ ప్రశ్నించాడు. దీనితో సిద్దు సిగ్గుపడిపోయాడు. సిద్దు స్క్రిప్ట్ స్టార్ట్ చేసే ముందు రాసే ఫస్ట్ పదం KISS అని మంచు మనోజ్ లీక్ చేశాడు.
ఓ లేడీ అభిమాని.. నీకు ఎంతమంది ప్రపోజ్ చేసారు టిల్లు అని ప్రశ్నించింది. తనకి ఎవరూ ప్రపోజ్ చేయలేదని సిద్దు సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత మనోజ్ సిద్ధుతో కొన్ని ఫన్నీ గేమ్స్ ఆడించాడు. ఈ కంప్లీట్ ఎపిసోడ్ డిసెంబర్ 21న ప్రీమియర్ కానుంది.