MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మంచు మనోజ్ అరెస్ట్, తిరుపతిలో హైడ్రామా, అసలేం జరుగుతోంది.

మంచు మనోజ్ అరెస్ట్, తిరుపతిలో హైడ్రామా, అసలేం జరుగుతోంది.

గత కొంత కాలంగా మంచు ఫ్యామిలీ రచ్చ చూస్తూనే ఉన్నాం. ఈ గోడవలు హైదరాబాద్ నుంచి తిరుపతి చేరాయి. ప్రస్తుతం కథంతా అక్కడే నడుస్తోంది. ఈక్రమంలో మంచు మనోజ్ అరెస్ట్ వార్తలు వైరల్ అవుతున్నాయి. 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Feb 18 2025, 11:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12

మంచు ఫ్యామిలీ గొడవలు హైదరాబాద్ నుంచి తిరుపతికి చేరాయి. మోహన్ బాబు యూనివర్సిటీకి తాతగారి సమాధిని చూడటం కోసం  గతంలో మంచు మనోజ్  తన అనుచరులతో వెళ్లడం గందరగోళానికి దారి తీసింది. తిరుపతి పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఆ వివాదం అప్పటికి ముగిసింది. ఇక మరోసారి  తాజాగా  తిరుపతి తో మంచువారి సినిమా స్టార్ట్ అయ్యింది.

రకరకాల ఈవెంట్ల కోసం తిరుపతి వెల్ళిన మనోజ్ ను  బాకారావుపేట పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు సమాచారం.మంచు  మనోజ్ అరెస్ట్‌కు సంబంధించి పూర్తి  వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు అరెస్ట్ చేశారని కొందరు అంటుంటే.. లేదు మనోజ్ తన అనుచరులతో పోలీస్టేషన్ కు వెళ్ళిరని మరికొందరు అంటున్నారు.  

పూర్తి వివరాలను బాకారావుపేట పోలీసులు ఈరోజు తెలిపే అవకాశం కనిపిస్తోంది. ఇక గత గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు అందరికి తెలిసినవే. ఆస్తలు పంపకాలకు సబంధించిన స్టార్ట్ అయిన గొడవ.. ఇంట్లో రాజుకుని వీధిలో మంటలు రగిల్చింది. అది కాస్తా కోర్డ్ లు కేసుల వరకూ వెళ్ళింది. ఈలోపు జర్నలిస్ట్ పై దాడి. మోహాన్ బాబుపై కేసు, క్షమాపణాలు ఇలా జరుగుతండగా.. హైదరాబాద్ ఇంటిని వీడి తిరుపతిలో తన యూనివర్సిటీలో ఉంటున్నాడు మోహన్ బాబు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
22

ఇక అక్కడికి కూడా మనోజ్ వస్తుండటంతో మోహన్ బాబు కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేశారు. ఇక  మంచు మనోజ్ రీసెంట్ గా జల్లికట్టు కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఆయన జల్లికట్టు కార్యక్రమంలో పాల్గొన్నారు.. మంచు మనోజ్‌కు టిడిపి, జనసేన, ఎన్టీఆర్ అభిమానులు గ్రాండ్ వెల్‌కమ్ పలికారు.

అభిమానులు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి గజమాలతో మంచు మనోజ్‌ను ఆహ్వానించారు. అంతే కాదు తన బలం చాటుకోవడం కోసమో ఏమో తెలియదు కాని.. మంచు మనోజ్ తాజాగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ను కలిశారు నారా లోకేష్ ఈరోజు కుటుంబంలో కలిసి కుంభమేళాకు వెళ్లారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న విషయం తెలియడంతో మంచు మనోజ్ వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.  

ఇది జరుగుతుండగానే మనోజ్ ను అరెస్ట్ చేశారన్న వార్తలు వైరల్ అయ్యాయి. మంచు వారి గొడవలు ఎప్పుడు కొలిక్కి వస్తాయో తెలియదు  కాని... గత కొన్ని రోజులుగా తండ్రి కొడుకుల మధ్య వార్ మాత్రం నాన్ స్టాప్ గా జరుగుతూనే ఉంది. ఈ కేసుల్లో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
హైదరాబాద్
మంచు మనోజ్
తెలుగు సినిమా
తిరుపతి

Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi Movie Trailer: పెద్ది ట్రైలర్‌ రివ్యూ.. ఆట మాత్రమే కాదు, అంతకు మించి.. కానీ డిజప్పాయింట్‌ చేసేది ఇదే
Recommended image2
Folk Song: యూట్యూబ్‍లో 110 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్..ఈ పాట వింటే ప్రతి ఒక్కరి గుండె బరువెక్కాల్సిందే
Recommended image3
Sreeleela: క్రికెటర్ తో పీకల్లోతు ప్రేమలో శ్రీలీల..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved