- Home
- Entertainment
- పరువాల జోరు చూపిస్తూ రాజకుమారిలా వెలిగిపోతున్న మంచు లక్ష్మి.. భారీ డిజైనింగ్ వేర్‌లో సూపర్ హాట్ లుక్
పరువాల జోరు చూపిస్తూ రాజకుమారిలా వెలిగిపోతున్న మంచు లక్ష్మి.. భారీ డిజైనింగ్ వేర్‌లో సూపర్ హాట్ లుక్
మంచు లక్ష్మి అనేక అవరోదాలను, అడ్డంకులను దాటుకుని ఇప్పుడు తనని తాను ఆవిష్కరించుకుంటుంది. మొదట్నుంచి ఆమెకి కావాల్సినంత స్వేచ్ఛ ఉంది. అదే ఆమెని డేర్ డెవిల్‌గా మార్చింది. ఇప్పుడు తన సత్తాని చాటుతుందీ మంచు లచ్చక్క.

మంచు మోహన్‌బాబు కూతురు మంచు లక్ష్మి.. మల్టీటాలెంటెడ్‌గా రాణిస్తుంది. ఆమె నటిగా, నిర్మాతగా, యాంకర్‌గా రాణించి ఆకట్టుకుంది. నటిగా, యాంకర్‌గా తనలోని విలక్షణతని చాటుకుంది. అనేక షోస్ చేసింది. అలాగే డిఫరెంట్ రోల్స్ చేసింది. ఇప్పుడు అన్నింటికి దూరమైంది. సోషల్ మీడియాలో బిజీగా ఉంది. సొంత వ్యాపారాలపై ఫోకస్ పెట్టింది.
అయితే సోషల్ మీడియా ప్రభావం పెరిగిన నేపథ్యంలో దాన్ని తన సొంత వ్యాపారాలకు వాడుకుంటోంది మంచు లక్ష్మి. అదే సమయంలో తనలోని మరో యాంగిల్‌ని ఆవిష్కరిస్తుంది. గ్లామర్ సైడ్ ఓపెన్ అవుతుంది. డిజైనింగ్ వేర్లో అదరగొడుతుంది. అంతేకాదు ట్రెండీ వేర్‌లోనూ కట్టిపడేస్తుందీ మంచు భామ.
లేట్ వయసులో ఘాటు అందాలతో రచ్చ చేస్తుంది. తాజాగా భారీ డిజైనర్ వేర్‌లో మెరిసింది. అందాల రాజహంసలాగా, రాజకుమారిలా మెరిసిపోతుంది. అయితే ఇందులో పరువాల జోరు చూపిస్తూ కిర్రాక్ పోజులిచ్చిందీ మంచు లక్ష్మి. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇందులో ఓ అదిరిపోయే పోస్ట్ పెట్టింది మంచు లక్ష్మి. `నేను ఆర్ట్ ని, మరి మీరు? అంటూ ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ , ఆమె ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. వీటిపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. లచ్చక్కి కిల్లర్ పోజులు అని, సూపర్ హాట్‌గా ఉందని, వామ్మో రాజకుమారిలా వెలిగిపోతుందని కామెంట్ చేస్తున్నారు.
దీంతోపాటు ఇటీవల తాను హాలీవుడ్‌లో ఉండాల్సిన నటిని అని, టాలీవుడ్‌లోకి వచ్చి తప్పుచేసినట్టు కామెంట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కూడా రియాక్ట్ అవుతూ హాలీవుడ్ యాక్టర్ అంటూ జాగ్రత్త అని అంటున్నారు. తెలుగు అమ్మాయిలను ఇక్కడ ఎంకరేజ్ చేయరని, ఇతర భాషల్లో స్టార్ లుగా వెలిగిపోవచ్చు అని అంటున్నారు. మంచు లక్ష్మి అభిప్రాయం కూడా అదే అని చెప్పొచ్చు.