Janaki kalaganaledu: మల్లిక గర్భవతి నాటకం.. జానకికి ధైర్యం ఇచ్చిన జ్ఞానాంబ!
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఆగస్ట్ 23వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం...

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... జ్ఞానాంబ, గోవిందరాజు వాళ్ళ గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు జ్ఞానాంబ, నేను పెద్ద కోడలు ముందు గర్భవతి కావాలి అని కోరుకున్నాను అలాగని చిన్న కోడలుకి తక్కువ చేయాలని కాదు. నాకు ఇద్దరు కోడలు ఒకటే మల్లికకి కూడా అన్ని సుఖాలు రావాలి జరగాల్సిన శుభకార్యాలు జరిపిద్దాము అని జ్ఞానాంబ అంటుంది.అప్పుడు గోవిందరాజు, మల్లికకి ఫంక్షన్లు పెడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ జానకిని వేలెత్తి చూపుతారు అని అంటాడు. అలాగని మల్లికాకి ఏ శుభకార్యము చేయించకపోతే నాకు నేనే తప్పు చేసిన దాన్ని అవుతాను అని అనుకుంటారు.
ఈ మాటలన్నీ జానకి ఒక మూల నుంచి వింటుంది ఆ తర్వాత సీన్లో మల్లిక ఒక పట్టు చీర తీసుకువచ్చి ఆ పక్కింటి ఆవిడకు ఇచ్చి ఇదిగో నువ్వు అబద్ధం చెప్పినందుకు నీకోసం ఈ చీర అని అంటుంది. అప్పుడు ఆ పక్కింటి ఆవిడ తలనొప్పి, కాలు నొప్పి అని అబద్ధం చెప్పొచ్చు కానీ కడుపు అని అబద్ధం చెప్పావేంటే, అసలు నీకు కడుపు అబద్ధమని తెలిస్తే అబద్ధం ఆడిన నీకు, చెప్పిన నాకు ఇద్దరికీ తోలు తీస్తుందా జ్ఞానాంబ. రేపో మాపో నిన్ను ఆసుపత్రికి తీసుకెళ్తారు ఆ డాక్టర్ని ఏం చేస్తావు అని అడగగా డాక్టర్ని కూడా ఇలాగే కొనేస్తాను అని అంటుంది.
పోని కనేసవు అనుకో ఐదొవ నెలకి కడుపు రావాలి కదా అక్కడికి పొట్ట లేకపోతే ఏం చెప్తావు అని అనగా అప్పుడే నా నాటకం మొదలుపెడతాను తను తల్లి కాలేదు అని నామీద కుళ్ళుతో జానకి నా పొట్టలో బిడ్డని తీసేసినట్టు అందరినీ నమ్మిస్తాను అని అంటుంది. ఆ తర్వాత రోజు రామా మల్లిగా కోసం కొన్ని బట్టలు వస్తువులు తీసుకొని వస్తాడు. అప్పుడు జానకి,మీకు నా మీద కోపం రావడం లేదా అని అడుగుతుంది. అప్పుడు రామ,ముందు మీకు ఒక లక్ష్యం ఉంది దాని గురించి ఆలోచించండి. మనకి పిల్లలు పుడతారు కాకపోతే కొంచెం అటు ఇటు అవుతుంది అంతేగాని పుట్టరని ఏమీ కాదు కదా బాధపడాల్సిన అవసరం లేదు మీరు వెళ్ళండి అని అంటాడు రామా. ఆ తర్వాత మల్లికని దీవించడానికి ముత్తైదువులందరూ వస్తారు.
జ్ఞానాంబ భోజనాలు కి కూడా ఏర్పాటు చేస్తుంది అప్పుడు మల్లికని తయారుచేసి హాల్లోకి తీసుకొస్తున్నప్పుడు మల్లిక మనసులో, ఇలాగ నటిస్తే నాకు ఎంత గౌరవం ఇస్తున్నారో, అలాగే పనులు కూడా చెప్పడం లేదు, నాకు మంచి రోజులు వచ్చాయి అని అనుకుంటుంది. అక్కడ అందరూ దీవిస్తారు ఇందులో ఆ పక్కింటి ఆవిడ మల్లికను దీవించడానికి వస్తుంది అప్పుడు మళ్లిక,ఆవిడ చెవిలో నీకు కానుక ఇస్తానని చెప్పాను కదా ఇంక నీ నటన మొదలుపెట్టు అని అంటుంది. అప్పుడు ఆవిడ జ్ఞానాంబ, ఆఖరికి నువ్వు నెల క్రితం ఇచ్చిన మాటను నెరవేర్చుకున్నావు మీ ఇద్దరు కోడలికి గర్భవతులు అవుతారు అని మాటిచ్చావు.
నీ చిన్న కోడలు నీ మాట నిలబెట్టింది నీ పెద్ద కోడలు కూడా నిలబట్టి ఉంటే బాగుండు అయినా పెళ్లై సంవత్సరమైనా ఇంకా కడుపు పండకపోవడమేంటి?. ఏవైనా లోపాలు ఉన్నాయా? ఒకసారి వెళ్లి ఆసుపత్రికి వెళ్లి చూపించాల్సింది ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా పిల్లలు పుడతారు అని అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారు. దానికి మల్లిక మనసులో, ఇంక పెంట పెంట అయిపోతది ఇల్లంతాన హమ్మయ్య అనుకుంటుంది. కానీ అక్కడ మిగిలిన వాళ్ళందరూ బాధపడతారు ఇంతట్లో గోవిందరాజు వచ్చి జ్ఞానాంబ మనసు ను ఓదార్పుతాడు నేను ముందే చెప్పాను జ్ఞానాంబ ఇలాగ అవుతాది అని అయినా బాధపడాల్సిన అవసరం లేదు.
జానకి కూడా రేపో మాపో తల్లి అవుతాది అని అంటారు. అప్పుడు జ్ఞానం జానకి తో వాళ్లు అన్న మాటలకు మీరు బాధపడుతున్నారని నాకు తెలుసు. ఆ మాటలు విని నేను నీకు ఎక్కడ చదువుకి అడ్డం చెప్తాను అని నువ్వు భయపడుతున్నావు. అలా చేస్తే వాళ్ళకి నాకు తేడా ఏముంటుంది నేను నీ ఆశయాన్ని గౌరవిస్తున్నాను. రేపు నీ ఆశయ సాధనలో నువ్వు మరింత ఉత్సాహంగా ఉండాలి అని అంటుంది జ్ఞానాంబ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురుచూడాల్సిందే!