- Home
- Entertainment
- Janaki kalaganaledu: అఖిల్‌తో నా పెళ్లి మీరే చెయ్యాలి అక్క.. జానకితో మాట తీసుకున్న జెస్సి.. నెల తప్పిన మల్లిక!
Janaki kalaganaledu: అఖిల్‌తో నా పెళ్లి మీరే చెయ్యాలి అక్క.. జానకితో మాట తీసుకున్న జెస్సి.. నెల తప్పిన మల్లిక!
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఆగస్ట్ 22వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... మల్లికా ఇంటి బయట పనులన్నీ చేస్తూ తోటి కోడలు అంటే ఇష్టం లేదు పగ తీర్చుకుందాం అనుకుంటే తీరా తన పని కూడా నా చేత చేపిస్తున్నారు ఏంటో అనుకుంటూ ఉంటుంది. ఇంతట్లో జానకి కాలేజీకి బయలుదేరుతుంది అప్పుడు జ్ఞానాంబ, జానకి అసలు నా మాట కి విలువ ఉన్నదా, నేను నిన్ను రాత్రి బడికి వెళ్లొద్దు అన్నది ఎందుకు? ఉదయం నువ్వు చదువుకొని రాత్రి రామ తో సమయం గడపాలని కదా నువ్వు చదువుకుంటూ రామ పట్టించుకోవడం లేదు.
దీనికి నా మాట విలువ లేనట్టే కదా అర్థం అని అంటుంది. ఈ లోగ మల్లికా అక్కడికి వెళ్లి ఇలాంటి విషయాల్లో మాట్లాడనవసరమా అత్తయ్య గారు వెంటనే ఆ అవకాశంలో ఒక చెరిపేయండి అని అంటుంది. ఇంతట్లో గోవిందరాజు మల్లికని తిట్టి అవకాశం దొరికినప్పుడల్లా పుల్లలు పెట్టడానికి చూస్తావు కదా అని తిడతాడు. అప్పుడు జానకి పరీక్షలు దగ్గర పడుతున్నాయనే అత్తయ్య గారు అంతకుమించి ఏమీ లేదు ఇంకెప్పుడు మీ నోట్లో నుంచి మాట రాకుండా చూస్తాను అని అంటుంది.
ఆ తర్వాత సీన్లో జెస్సీ జ్ఞానాంబ అన్న మాటలు విని ఇప్పుడు ఆవిడ దగ్గర ఎలాగైనా మంచి పేరు తెచ్చుకోవాలి అని అంటుంది. ఇంతట్లో జానకి అక్కడికి వస్తుంది అక్క ఆవిడ మీ అత్తగార? నా గురించి ఏమైనా మంచి మాటలు చెప్పక్క. అప్పుడే మా పెళ్లి జరుగుతుంది అని అంటుంది జస్సీ. అప్పుడు జానకి పెళ్లేంటి అని అనగా మేము రెండు సంవత్సరాలు నుంచి ప్రేమించుకుంటున్నాం అక్క అఖిల్ నీకు చెప్పలేదా? అని అంటుంది.అప్పుడు జానకి అఖిలేమో ఫ్రెండ్స్ అన్నాడు తినేమో పెళ్లంతుంది ఏంటి అని అనుకుంటుంది.
ఇప్పుడు నా దగ్గర ఉన్న ఏకైక హోప్ నువ్వే ఎలాగైనా మీ అత్తగారికి మంచి మాటలు చెప్పు నేను కావాలంటే క్షమాపణలు అడుగుతాను అని అంటుంది. దానికి జానకి, మీరు ఇంకా చిన్న పిల్లలు ప్రేమ పెళ్లి విషయాలు గురించి ఆలోచించొద్దు. వెళ్లి చదువుకోండి మా అత్తగారికి కొన్ని సాంప్రదాయాలు పట్టింపులు ఉంటాయి. వాటిని దాటడానికి మాకు వీలు లేదు అయినా ఈ వయసులో ఇదంతా కేవలం ఆకర్షణ మాత్రమే అని జానకి అంటుంది.ఇది ఆకర్షణ కాదు ప్రేమ ఒకవేళ మీరందరూ కలిసి ఒప్పుకుంటే కలిసి జీవిస్తాం.
లేకపోతే కలిసి చేస్తామని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జెస్సీ.ఆ తర్వాత సీన్లో గోవిందరాజు జ్ఞానాంబ ఇంటి బయట మాట్లాడుకుంటూ ఉండగా మల్లిక కి వాంతులు అవుతాయి. ఇంతట్లో పక్కింటి ఆవిడ పంచదార కోసం అక్కడికి వస్తుంది. అప్పుడు మల్లిక కి వాంతులు అవ్వడం చూసి చేయి పట్టుకొని తిను గర్భవతి అయింది అని అంటుంది. ఇంట్లో వాళ్ళందరూ ఆనందపడతారు ఆ తర్వాత గోవిందరాజు జ్ఞానాంబా ఇంట్లో కూర్చొని ఈ విషయం అందరికీ చెప్పి స్వీట్లు పంచాలి అని జ్ఞానాంబ అంటుంది.
అప్పుడు గోవిందరాజు నువ్వు ఒకప్పుడు ఒక విషయం అన్నావు గుర్తున్నదా? జానకి కి ముందు గర్వవతి అయితే బాగుండు లేకపోతే ఇంట్లో ఊర్లో వాళ్ళందరూ పెద్ద కోడలకి పిల్లలు లేకుండా చిన్న కోడలికి పిల్లలు పుడితే నవ్వుతారు అని అన్నావు. కానీ ఇప్పుడు జానకి కన్నా మల్లికాకి ముందు పిల్లలు పుడుతున్నారు అని అంటారు. ఇదంతా జానకి ఒక మూల నుంచి వింటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!