MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Janaki kalaganaledu: మల్లికకు జ్ఞానాంబ చివాట్లు.. 'అఖిల్' ప్రేమపై ప్రశ్నలు.. సీన్‌లోకి జానకి అన్న ఎంట్రీ!

Janaki kalaganaledu: మల్లికకు జ్ఞానాంబ చివాట్లు.. 'అఖిల్' ప్రేమపై ప్రశ్నలు.. సీన్‌లోకి జానకి అన్న ఎంట్రీ!

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఆగస్ట్ 17వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం..  

3 Min read
Author : Navya G
Published : Aug 17 2022, 11:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... మల్లిక వాళ్ళ తమ్ముడికి రాఖీ కడుతుంది.వాళ్ళ తమ్ముడు మల్లిక కి గిఫ్ట్ ఇస్తాడు. అప్పుడు మల్లిక అయ్యో జానకి నువ్వు రాఖీ కట్టలేదని బాధపడుతున్నావా? మీ అన్నయ్య మాటలకు అత్తయ్య గారికి ఇంకా కోపం తగ్గినట్లు లేదు అందుకే మా తమ్ముడ్ని పిలిచి మీ అన్నయ్యని పిలలేదు.నిన్ను చూస్తే జాలేస్తుంది అని అంటుంది. అప్పుడు జ్ఞానాంబ, నీకు సమయం సందర్భం తెలియదా ఒక మాట మాట్లాడితే ఎదుటి వాళ్ళు ఎలా బాధపడతారు అని తెలియదా అని మల్లిక ని తిడుతుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఆ తర్వాత జానకీ తన గదిలోకి వెళ్లి బాధపడుతుంది. రామ అక్కడికి వచ్చి అమ్మతో నేను మాట్లాడనా మీ అన్నయ్యకి రాఖీ కట్టడానికి అని అనగా అత్తయ్య గారికి ప్రేమించడం, క్షమించడం మాత్రమే తెలుసు.ఏ తప్పు అయినా క్షమిస్తారు దానికి మనమే ఉదాహరణ.కానీ అత్తయ్య గారు చెప్పినా సరే నేను మా అన్నయ్యకి రాఖీ కట్టను. మా ఇద్దరి మధ్య బంధం ఆ రోజుతోనే తెగిపోయింది నాకు బాధ ఉంటుంది అలాగని తను అన్న మాటల్లో నేను మర్చిపోలేను అత్తయ్య గారు ఆరోజు ఎంత బాధపడ్డారు నేను కళ్ళారా చూశాను.
 

37

ఇంక ఈ విషయాన్ని వదిలేద్దాం రామ గారు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జానకి. ఈ మాటలు అన్నీ జ్ఞానాంబ చాటున వింటుంది.ఆ తర్వాత సీన్లో ఇంట్లో వాళ్ళందరూ గుడికి వెళ్లడానికి బయలుదేరుతారు. అందరూ తయారయి అఖిల్ కోసం ఎదురు చూస్తారు. ఈ లోగా అఖిల్ అక్కడికి వస్తాడు ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడగగా మా ఫ్రెండ్ పుట్టినరోజు ఉంది అమ్మ కచ్చితంగా వెళ్లాలి అని అంటాడు. అప్పుడు మల్లికా అబ్బాయా? అమ్మాయా? లేకపోతే గర్ల్ ఫ్రెండ్ ఆ? అని ఎటకారంగా అంటాది. అఖిల్ మనసులో వదిన తెలిసి అందా? తెలియకన్నదా.
 

47

ఇప్పుడు పెంట పెట్టింది అని అనుకొని అబ్బాయే వదిన అంటాడు. అప్పుడు జ్ఞానాంబా నా కొడుకుకు ఫ్రెండ్స్ తప్ప అలాంటి ప్రేమ వ్యవహారాలు ఏవి తెలీదు. నువ్వు చదువుకునే వ్యక్తితో అలాంటి మాటలు చెప్పి వాడి మనసుని పాడు చేయొద్దు అని మల్లిక ని తిడుతుంది జ్ఞానాంబ. అప్పుడు మల్లిక కూతురు లాగా కొడుకు కూడా ఏదో ఒక పెంట పెట్టకపోడా అప్పుడు చెప్తాను అని అనుకుంటుంది. అప్పుడు జ్ఞానాంబా, ఏదైనా ముందు గుడికెళ్లి అట్నుంచి వచ్చాక నీ పని చూసుకో అని అంటుంది. అందరూ బయలుదేరుతున్నప్పుడు అఖిల్, గుడికి వెళుతున్నాము అమ్మ తిడుతుంది.
 

57

సాయంత్రం వచ్చి కలుస్తాను, సారీ అని జెస్సికి వాయిస్ మెసేజ్ పంపుతాడ. ఈ మాటల్ని జానకి వింటుంది. తర్వాత సీన్లో జెస్సి ఆటోలో వెళుతూ ఆ మెసేజ్ ని చదివి తన ఇంట్లో వాళ్లని పరిచయం చేయమంటే మంచి రోజు చూసుకొని చెప్తాను అని అన్నాడు. ఈరోజు అందరూ గుడికి వెళుతున్నారు పైగా నా పుట్టినరోజు నేనే అక్కడికి వెళ్లి వాళ్ళందరినీ పరిచయం చేసుకుంటాను అఖిల్ ని ఆశ్చర్య పరుస్తాను అని అనుకుంటుంది జెస్సి.
 

67

ఆ తర్వాత సీన్లో ఇంట్లో వాళ్ళందరూ గుడికి వెళ్తారు. అక్కడ జానకి వాళ్ళ అన్నయ్య కనిపిస్తాడు. ఎలాగున్నావు జానకి? అని అనగా జానకి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళ అన్నయ్య నన్ను క్షమించు జానకి అప్పుడు అన్న మాటలకి నేను ఇంకా బాధ పడుతూనే ఉన్నాను అని అంటాడు. అప్పుడు జానకి నా భర్తని వంటవాడు అన్నప్పుడు నాకు ఎంత బాధగా ఉంటుంది నేను క్షమించి వదిలేయలేను అని అనగా గోవిందరాజు పాపం బాధపడుతున్నాడు కదమ్మా క్షమించే అని అంటాడు.
 

77

తను బాధపడడం చూసి మీరు క్షమించే అంటున్నారు మావయ్య గారు. కానీ తను నా భర్తతో అన్న మాటలకు నా భర్త ఎంతో కుమిలిపోయారో  నేను చూశాను. దాని నేను మర్చిపోలేను అని అంటుంది. అప్పుడు జ్ఞానాంబ నాకు బాధ గా ఉంది జానకి కానీ  ఈరోజు రాఖీ పండగ. ప్రతి సంవత్సరంలో మీ అన్నయ్యకి రాఖీ కట్టే దానివి ఈ సంవత్సరం కూడా కట్టు అని చికిత దగ్గర నుంచి రాఖీ తీసుకొని జానకి ఇచ్చి నేనే మీ అన్నయ్యని రమ్మన్నాను రాఖీ కట్టించుకోవడానికి అని అంటుంది జ్ఞానాంబ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Anasuya: అనసూయ ఏం చేసిన వైరల్ అయిపోద్ది.. షార్ట్ హెయిర్ తో గ్లామరస్ లుక్ చూశారా
Recommended image2
Shooting Secrets: బాబోయ్.. ఇంటిమేట్ సీన్స్ ఇలా చేస్తారా? హాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
Recommended image3
Udayabhanu: ఆమెది మలయాళీ బిజినెస్ బ్లడ్, ఆ తెలివితేటలు అందరికీ ఉండవు.. సుమపై ఉదయభాను కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved