MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Janaki Kalaganaledu: తనకు అబార్షన్ అయ్యింది అని అబద్ధం చెప్పిన మల్లిక.. బాధతో కుమిలిపోతున్న విష్ణు?

Janaki Kalaganaledu: తనకు అబార్షన్ అయ్యింది అని అబద్ధం చెప్పిన మల్లిక.. బాధతో కుమిలిపోతున్న విష్ణు?

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు డిసెంబర్ 8వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. 

3 Min read
Author : Navya G
Published : Dec 08 2022, 12:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్లో జానకికి రింగు దొరకడంతో ఆ రింగు ఎవరిదో తెలుసుకోవడానికి గోల్డ్ షాప్ ల దగ్గరికి వెళుతుంది. అప్పుడు ఆ షాపు అతను ఇలా కస్టమర్స్ డీటెయిల్స్ చెప్పడం మంచిది కాదు నా దగ్గర గొప్ప గొప్ప రాజకీయ నాయకులు అందరూ ఆర్డర్స్ వేసి మరి బంగారు తీసుకుంటారు ఇలా చెప్పలేనమ్మ నన్ను క్షమించు అని అంటాడు. లేదండి నేను కాబోయే ఐఏఎస్ ఆఫీసర్ అని ట్రైనింగ్ లో భాగంగా ఒక కేసు ఇన్వెస్టిగేషన్లో ఈ ఉంగరం ఎవరిదో తెలుసుకోవాల్సి ఉంది అని అంటుంది జానకి. నేను వేరే ఊరి నుంచి వచ్చాను ఇలా చేస్తే నా వ్యాపారం దెబ్బ తింటుంది దయచేసి అర్థం చేసుకోండి అని అంటాడు అతను.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

 అలా మాట్లాడకండి మీరు చెప్పే ఒక్క నిజం ఒక అమ్మాయిని ప్రాణాలని ఒక కుటుంబ పరువును నిలబెడుతుంది అని అంటుంది జానకి. అప్పుడు అతను సరే అని అ ఉంగరం చూసి ఈ ఉంగరం కన్నబాబు అనే కష్టమర్ పేరు మీద ఉంది అనడంతో ఏ కన్నబాబు అని జానకి అడగగా కార్పొరేట్ సునంద గారి కొడుకు అనడంతో జానకి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరొకవైపు మల్లిక బయట అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి లీలావతి రావడంతో ఏంటి పెద్దమ్మ ఇంత లేటు వచ్చావు అని అంటుంది మల్లిక.

36

అప్పుడు ఏంటి ఇలా రమ్మని చెప్పావు మల్లిక అని అనగా అప్పుడు మల్లిక నా దొంగ కడుపు విషయం జానకి తెలిసిపోయింది అనడంతో వెంటనే లీలావతి తప్పించుకోవడం కోసం పోయి మీద కందిపప్పు పెట్టాను వెళ్ళొస్తాను అని అక్కడి నుంచి పారిపోతూ ఉండగా మల్లిక వెంటపడుతుంది. నీ నాటకంలో నేను కూడా భాగం అని తెలిస్తే మీ అత్తయ్య నన్ను ఇక్కడే పాతిస్తుంది అని టెన్షన్ పడుతూ ఉండగా అప్పుడు ఏం కాదు పెద్దమ్మ ధైర్యంగా ఉండు అని అంటుంది మల్లిక. అప్పుడు నన్ను వదిలే మల్లికా అని అనగా ప్లీజ్ పెద్దమ్మ ఒక హెల్ప్ చెయ్ ఆ కడుపు విషయం బయటపడకుండా ఉండటానికి ఒక ప్లాన్ చేసాము అని లీలావతిని బ్రతిమిలాడడంతో సరే అని అంటుంది.
 

46

అప్పుడు ప్లాన్ మొత్తం లీలావతికి వివరిస్తుంది మల్లిక. నాకు భయంగా ఉంది అనడంతో ఏం కాదు పెద్దమ్మ అని ధైర్యం చెబుతుంది మల్లిక. మరొకవైపు జానకి వంట చేస్తూ ఉండగా మల్లిక తొంగి చూస్తూ అందరు ఏం చేస్తున్నారో అనుకుంటూ ఉంటుంది. అప్పుడు అందరి గదిలోకి వెళ్లి ఏం చేస్తున్నారా అని చూసి అక్కడ కావాలనే కొబ్బరి నూనె వేసి జారీ పడినట్లు తన పై కుర్చీ పడినట్లు మింద వేసుకుని నాటకాలు వాడుతూ ఉంటుంది మల్లిక. దాంతో అందరూ ఒక్కసారిగా అక్కడికి వచ్చి మల్లికని చూసి టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ తర్వాత అందరూ కలిసి మల్లికను హాస్పిటల్ కి పిలుచుకొని వెళ్తారు.

56

 అప్పుడు డాక్టర్ మల్లికను లోపలికి తీసుకొని వెళ్లగా గోవిందరాజులు అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు విష్ణు చాలా టెన్షన్ ఉండగా ఇంతలోనే అక్కడికి డాక్టర్ వస్తుంది. అప్పుడు ఆ డాక్టర్ మల్లికకు అభార్షన్ అయింది అని అబద్ధం చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. కొద్దిసేపటి తర్వాత తనని ఇంటికి తీసుకొని వెళ్లొచ్చు అని డాక్టర్ అబద్ధం చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. అప్పుడు జానకి లీలావతి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది.
 

66

అప్పుడు వెంటనే లీలావతి తప్పించుకుని అక్కడినుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జ్ఞానాంబ వాళ్ళు లోపలికి వెళ్లడంతో మల్లిక నాటకాలు వాడుతూ ఉంటుంది. అప్పుడు జానకి మల్లిక లేని కడుపు పోయిందని అబద్ధాలు చెప్పి మల్లిక చాలా డ్రామాలు చేస్తుంది అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇంట్లో అందరూ బాధపడుతూ ఉండగా జానకి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Movies: టీమ్ లీడ్ తో ఆఫీస్ లో రొమాన్స్..ఈ వారం ఓటీటీలో అదిరిపోయే యాక్షన్, థ్రిల్లర్, రొమాంటిక్ సినిమాలు
Recommended image2
Nora Fatehi: ఒక్క పెర్ఫార్మెన్స్‌తో టాప్‌లో నోరా ఫతేహి.. గూగుల్‌ను షేక్ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ!
Recommended image3
Pawan Kalyan OG2: పవన్ కళ్యాణ్‌ను కలిసిన సుజీత్, ఇదేం స్పీడు బాబోయ్.. ఓజీ 2 కథా చర్చలు షురూ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved