‘సలార్ 2’లో మరో స్టార్ హీరో, ఫ్యాన్స్ పండగ చేసుకునే న్యూస్
‘సలార్ పార్ట్ 1: సీజ్‌ఫైర్’ (Salaar: Part 1- Ceasefire) గతేడాది డిసెంబరులో విడుదలై, ప్రభాస్ అభిమానుల్లో జోష్ నింపింది. దీంతో, ‘శౌర్యాంగ పర్వం’ (shouryanga parvam) పేరుతో రూపొందనున్న పార్ట్ 2పై అంచనాలు నమోదయ్యాయి.
salaar 2
ప్రభాస్ (Prabhas)హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘సలార్’. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా ‘సలార్: పార్ట్-1 సీజ్ ఫైర్’ గతేడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆ చిత్రానికి కొనసాగింపుగా ‘సలార్: శౌర్యంగపర్వం’ ఉంటుందని సినిమా చివరిలో ప్రకటించారు.
ఇప్పుడీ చిత్రానికి అదనపుడు హంగులు, స్టార్స్ ని కలిపే పనిలో ఉన్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. అందులో భాగంగా మళయాళ స్టార్ హీరోని సీన్ లోకి తెస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఎవరా సూపర్ స్టార్
బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ అప్ డేట్స్, ఇంట్రెస్టింగ్ వార్తల కోసం ఇక్కడ చూడండి.
Salaar,
ప్రస్తుతం ‘సలార్’-2 చిత్రం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉంది. అతి త్వరలోనే షూటింగ్ మొదలుపెడుతున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. ఈ సినిమా స్క్రిప్టు పూర్తయిందని నిర్మాత విజయ్ కిరగందూర్ కొన్ని నెలల క్రితమే చెప్పడం గమనార్హం. హీరో, డైరెక్టర్ షూటింగ్ ప్రారంభించేందుకు ఆసక్తిగా ఉన్నారని తెలిపారు.
హాలీవుడ్ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’లా ‘సలార్ 2’ ఉంటుందన్నారు. అయితే ఈ సారి మరికొన్ని కొత్త పాత్రలతో ఫస్ట్ పార్ట్ కు మించి అన్నట్లు డిజైన్ చేసారట ప్రశాంత్ నీల్. అందుకోసం తన టీమ్ తో రాత్రింబవళ్లు కష్టపడి వర్కవుట్ చేసారట. ఈ క్రమంలో సినిమాలో కీలకమైన పాత్రకు మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ని తీసుకుని వస్తున్నారని సమాచారం.
తెలుగులోనూ మోహన్ లాల్ కు ప్రత్యేకమైన మార్కెట్ ఉండటంతో పాటు మళయాళ మార్కెట్ లో భారీగా రిలీజ్ కు ఈ నిర్ణయం దారి తీస్తుంది. అయితే మోహన్ లాల్ డేట్స్ ఎడ్జెస్ట్మెంట్ పై ఆయన సినిమాలోకి వచ్చేది లేనిది ఆధారపడి ఉంటుందంటున్నారు. ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్లు చెప్తున్నారు.
Prabhas Prithviraj Salaar 2
సలార్ పార్ట్ 1 సినిమా సూపర్ హిట్ అయినా అనుకున్న స్దాయిలో రెవిన్యూ రాలేదని ఆంధ్రాలో చాలా ప్రాంతాల్లో సెటిల్మెంట్స్ చేసారని తెలిసిందే. దాంతో ఈ సారి ఆ సమస్య ఎదురుకాకుండా మొదటనుంచి జాగ్రత్తలు తీసుకోబోతన్నారు. అందరూ అనుకున్నట్లుగా ఈ సినిమాకు భారీ బడ్జెట్ ని నిర్మాత విజయ్ కిరంగదూర్ పెట్టడం లేదట. మామూలు రెగ్యులర్ యాక్షన్ సినిమాకు పెట్టే బడ్జెట్ తో ఈ సినిమాని నీల్ ముగించనున్నారట.
అందుకోసం మొదట స్ట్రిక్ట్ గా ఐదు నెలల్లో మొత్తం ప్రొడక్షన్‌ను పూర్తి చేయాలని ప్రశాంత్ నీల్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఏప్రియల్ 2025న ఎట్టిపరిస్దితుల్లో సినిమా రిలీజ్ చేయాలనే టార్గెట్ ఫిక్స్ చేసారు. అలాగే ఈ సారి ఈ సినిమాలో ప్రభాస్, శృతిహాసన్ కు మధ్య రొమాంటిక్ డ్యూయట్ పెట్టబోతున్నారు. అవకాసం ఉంటే సెకండాఫ్ లో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉండవచ్చు. ఎందుకంటే మొదటి పార్ట్ లో రొమాన్స్ పార్ట్ మిస్సైందని ఆ మేరకు తన అభిమానులు చాలా మంది తగ్గారని ప్రభాస్ అభిప్రాయపడ్డారట.
సలార్ కు పనిచేసిన టీమే సలార్ 2 కు కూడా చేయనుంది. చిత్రాన్ని హెంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించారు. ఈ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందించారు. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ చేశారు.
అలాగే ఈ సినిమాలో ప్రభాస్ మాగ్జిమం బాడీ డబుల్ వాడకుండా చూస్తారట. యాక్షన్ స్టంట్స్ తనే స్వయంగా చేస్తానని ప్రభాస్ చెప్పారట. ఇంతకు ముందు మోకాలి ఆపరేషన్ కాబట్టి చేయలేకపోయాను కానీ ఈ సారి ఆ సమస్య రాదని హామీ ఇచ్చారట. దాంతో చాలా ఉత్సాహంగా ఈ సెకండ్ పార్ట్ లో ప్రభాస్ సీన్స్ ఉండబోతున్నాయని అంటున్నారు.