- Home
- Entertainment
- Ennenno Janmala Bandham: చేతులు జోడించి బ్రతిమాలుకుంటున్న మాళవిక.. పెళ్లి కార్డు చూసి షాకైన కావ్య!
Ennenno Janmala Bandham: చేతులు జోడించి బ్రతిమాలుకుంటున్న మాళవిక.. పెళ్లి కార్డు చూసి షాకైన కావ్య!
Ennenno Janmala Bandham: స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాలని కట్టిపడేస్తుంది. ఒక ఆడదానిని మోసం చేసి మరొక ఆడదాని మెడలో తాళి కట్టాలని చూస్తున్న ఒక ప్రబుద్ధుడి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 18 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న అభి ఫ్రెండ్స్ మీద చెయ్యి ఎత్తుతుంది వేద. ఆ చేతిని పట్టుకొని ఏమనుకుంటున్నావు నా ఫ్రెండ్స్ మీద చెయ్యెత్తుతావా అంటూ అసభ్యంగా మాట్లాడుతాడు అభి. అభి చేతిని పట్టుకొని నా భార్య మీదే చెయ్యెత్తుతుతావా అంటూ అభిని నెట్టేస్తాడు యష్. అప్పుడే వచ్చిన మాళవిక నా అభి మీదే చెయ్యెత్తుతావా అంటూ కోప్పడుతుంది.
ఇలాంటి వీధి కుక్కలకి చెప్పు దెబ్బలే కరెక్ట్ అంటాడు యష్. ఏం మాట్లాడుతున్నావు మేమేమీ గతిలేక ఇక్కడ పెళ్లి చేసుకోవట్లేదు ఇద్దరు పెళ్లిళ్లు కలిపి జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఉంటున్నాము అంటుంది మాళవిక. రెండు పెళ్లిళ్లు కలిపి జరపవలసిన అవసరం ఏమీ లేదు వసంత పెళ్లి గుళ్లో చేద్దాం అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు యష్.
అతని వెనకే వస్తుంది వేద. అప్పటికే కోపంతో ఊగిపోతూ ఉంటాడు యష్. వాడు రెండు రోజుల నుంచి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అయినా ఊరుకున్నాను కానీ నీ జోలికి వచ్చాడు నేను ఊరుకోను అంటూ ఆవేశంతో ఊగిపోతాడు యష్. అతని ఆదేశాన్ని చల్లార్చడానికి యష్ ని హత్తుకొని నేనంటే ఎంత ప్రేమ మీకు అంటుంది.
అసలు ఇదంతా నీ వల్లే రెండు పెళ్లిళ్లు కలిపి చేయవలసిన అవసరం ఏముంది అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను వసంత పెళ్లి గుడిలో చేద్దాము అంటే కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు యష్. ప్రశాంతంగా వేడుక జరుగుతుంటే అంతా చెడగొట్టాడు పాపాత్ముడు అని తిట్టుకుంటుంది వేద. మరోవైపు మత్తులో ఉన్న అభి మొహాన నీళ్లు కొడుతుంది మాళవిక.
నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా అంటూ నిలదీస్తుంది. అప్పుడే మెలకువలోకి వచ్చిన అభి ఏదో మత్తులో అలా చేశాను దానికి ఎందుకు అంత హడావుడి అంటాడు. యష్ కి కోపం వచ్చి వసంత్ వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయాడు వాళ్లకి గుడిలో పెళ్లి చేస్తాడంట అని చెప్తుంది మాళవిక. ఒక్కసారిగా అభికి తల తిరిగిపోతుంది. తాగిన మత్తులో అలా చేశాడంట.. కావాలంటే వేదకి క్షమాపణ చెప్తాడంట అని వెళ్లి వేద ని బ్రతిమాలు.
నావల్ల మీ రిలేషన్స్ పాడైపోకూడదు అని మాళవిక ని నమ్మించి వేద దగ్గరికి పంపిస్తాడు అభి. మనసులో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని వసంత్ తో చిత్ర పెళ్లి జరగకూడదు అనుకుంటాడు. ఆ తర్వాత మాళవిక యష్ వాళ్ల ఇంటికి వెళ్ళి రెండు పెళ్లిళ్లు ఒకే ముహూర్తానికి చేయమని బ్రతిమాలుతుంది. యష్, మాలిని వద్దు అని ఖరాఖండీగా చెప్తారు. వాళ్లందర్నీ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తుంది మాళవిక.
ఇప్పుడు పెళ్లి అవ్వకపోతే అభి మళ్ళీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో తెలియదు. అప్పుడు నా జీవితం ఆదిత్య జీవితం రోడ్డుపాలవుతుంది అని బ్రతిమాలుతుంది. వసంత్ ని చిత్రని కూడా మీరైనా యష్ కి చెప్పండి అని చెప్తుంది. వాళ్ళిద్దరూ కూడా యష్ కి నచ్చ చెప్తారు కానీ యష్ వినిపించుకోడు. ఆఖరికి చిత్ర ఖుషిని బ్రతిమాలుతుంది.
కరిగిపోయిన ఖుషి తల్లికి సైగ చేస్తుంది. అప్పుడు వేద యష్ దగ్గరికి వెళ్లి మీరు మాళవిక వాళ్ల గురించి కాకుండా కేవలం వసంత వాళ్ల గురించి మాత్రమే ఆలోచించి ఒప్పుకోండి అని నచ్చచెప్తుంది. మాలిని ని కూడా ఒప్పిస్తుంది వేద. ఇదే మీకు ఇచ్చే ఆఖరి అవకాశం అని చిత్రని హెచ్చరించు మరీ పెళ్లికి ఒప్పుకుంటుంది మాలిని. మీరు పెళ్లికి ఒప్పుకున్నారు అంతే చాలు ఏ గొడవ జరగకుండా నేను చూసుకుంటాను నాది పూచి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మాళవిక.
ఆ తర్వాత చిత్రని పెళ్లికూతురని చేస్తుంది వేద. అన్నోన్ నెంబర్ తో అభి ఫోన్ చేసి ఫ్రెండ్ తో మాట్లాడుతున్నట్లుగా మాట్లాడుతూ బయటికి రా నీతో మాట్లాడాలి లేకపోతే వీడియో బయట పెట్టేస్తాను అని బెదిరించడంతో బయటికి వెళ్లి మాట్లాడుతుంది చిత్ర. తరువాయి భాగంలో పెళ్ళికి రాజ్, కావ్య దంపతులు వస్తారు.
వాళ్లని ఆనందంగా రిసీవ్ చేసుకుంటారు యష్ దంపతులు. మండపం దగ్గర ఉన్న ఒక పెళ్లి కార్డు ని చూస్తుంది కావ్య. దానిమీద చిత్ర వెడ్స్ అభిమన్యు అని రాసి ఉంటుంది. వేదని పిలిచి పెళ్లి చిత్రకి వసంత్ కి కదా మరి ఇలా రాసి ఉందేంటి అని అడుగుతుంది కావ్య. వేద కూడా ఆ కార్డు చూసి అయోమయం పడుతుంది.