- Home
- Entertainment
- అప్సరసలా మెరిసిపోతున్న మల్లు బ్యూటీ.. మ్యారేజ్ వైబ్స్ అంటూ ట్విస్ట్.. నెటిజన్ల రియాక్షన్ కేక!
అప్సరసలా మెరిసిపోతున్న మల్లు బ్యూటీ.. మ్యారేజ్ వైబ్స్ అంటూ ట్విస్ట్.. నెటిజన్ల రియాక్షన్ కేక!
మల్లు బ్యూటీ మాళవిక మోహనన్ నెక్ట్స్ ఒకటి రెండేళ్లతో టాలీవుడ్, కోలీవుడ్‌లో పెద్ద స్టార్ కాబోతుంది. ఆమె చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లున్నాయి.

మలయాళ భామ మాళవిక మోహనన్.. గ్లామర్ విస్పోటనంతో సోషల్ మీడియాని దున్నేస్తుంది. హద్దులు మీరే అందాల విందుతో నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తుంది. టాప్ టూ బాటమ్ స్కిన్ షోతో ఇంటర్నెట్‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.
మల్లు బ్యూటీ మాళవిక మోహనన్ ప్రస్తుతం మూడు భారీ సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో ప్రభాస్‌తో చేస్తుంది. మరోవైపు తమిళంలో విక్రమ్‌తో చేస్తుంది. అలాగే హిందీలోనూ ఓ భారీ సినిమా చేస్తుంది. ఇవన్నీ విడుదలైతే మాళవిక లెవల్ మారిపోతుంది.
ఈ క్రమంలో ఆ జోరు ముందుగానే కనిపిస్తుంది. ఆ ఊపు సోషల్ మీడియాలో చూపిస్తూనే ఉంది. తాజాగా మాళవిక మోహనన్‌లో పెళ్లి కళ కనిపిస్తుంది. అంతేకాదు తాను కూడా వెడ్డింగ్ వైబ్స్ అంటూ పేర్కొంది.
మాళవిక మోహనన్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే ఫోటోలను పంచుకుంది. ఇందులో దేవలోకంలో ఉండే అప్సరసలా ఉంది. ఉబికి వచ్చే క్లీవేజ్ అందాలు, డిజైనింగ్ వేర్ దుస్తుల్లో ఓ వైపు దేవకన్యలా, మరోవైపు పెళ్లి కూతురులా కనిపిస్తుంది.
దీనికితోడు ఆమె వెడ్డింగ్ వైబ్స్ అంటూ పేర్కొంటూ ఆమె ఈ ఫోటోలను పంచుకోవడం విశేషం. అయితే అందులోనే కండీషన్స్ అప్లై అని చెప్పింది. పెళ్లి తనకు కాదు అని పేర్కొంది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త రచ్చ లేపుతుంది.
దీనికి నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. పెళ్లి నాతో కదా, అందుకే ఇప్పుడు నీ పెళ్లి కాదు అంటున్నారు. దేవకన్యలా మెరిసిపోతున్నావని, ఏంజెల్‌లా ఉన్నావని ఆమె అందంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె ఫోటోలను వైరల్ చేస్తున్నారు.
మాళవిక మోహనన్ తెలుగులోకి ఎంట్రీ ప్రభాస్‌తో `ది రాజాసాబ్` చిత్రంలో నటిస్తుంది. ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉండగా మెయిన్ ఫీమేల్ లీడ్‌గా మాళవిక కనిపించబోతుందట. ఆమె పాత్ర గ్లామర్‌తోపాటు కీలకంగానే ఉంటుందని తెలుస్తుంది.
మరోవైపు తమిళంలో విక్రమ్ సరసన `తంగలాన్` చిత్రంలో నటిస్తుంది. ఇందులో డీ గ్లామర్ పాత్ర పోషిస్తుంది. యాక్షన్ కూడా చేస్తుందట. కొన్ని స్టంట్స్ కూడా చేస్తున్నట్టు ఆమె గతంలో పేర్కొంది. కర్ర తిప్పుతూ కనిపించింది. ఆమెది బలమైన రోల్ అని తెలుస్తుంది.
అలాగే హిందీలో `యోధ` చిత్రం చేస్తుంది. ఇలా ఈ మూడు బిగ్ మూవీస్‌తో బిజీగా ఉంది. అయితే ఈ మూవీ సినిమాలు విడుదలై హిట్ అయితే మాత్రం మాళవిక రేంజ్ మారిపోతుంది. స్టార్ హీరోయిన్ల జాబితాలోకి వెళ్లిపోతుంది. సౌత్‌లో మోస్ట్ హాట్ కేక్ అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.