- Home
- Entertainment
- గాగుల్స్ ధరించి సూపర్ కూల్ లుక్ లో కీర్తి సురేష్... ట్రెండీ వేర్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న మహేష్ హీరోయిన్
గాగుల్స్ ధరించి సూపర్ కూల్ లుక్ లో కీర్తి సురేష్... ట్రెండీ వేర్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న మహేష్ హీరోయిన్
ట్రెండీ వేర్ ధరించి కీర్తి సురేష్ మైండ్ బ్లాక్ చేసింది. గాగుల్స్ పెట్టుకొని సూపర్ కూల్ లుక్ లో మెస్మరైజ్ చేసింది. స్పెయిన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న కీర్తి నయా లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Keerthy suresh
ఇటీవల సర్కారు వారి షూటింగ్ కోసం స్పెయిన్ వెళ్ళింది కీర్తి సురేష్(Keerthy Suresh). అప్పుడు ఆ దేశంలో దిగిన త్రోబ్యాక్ ఫోటోలు ఫ్యాన్స్ కోసం షేర్ చేసింది. స్తున్నింగ్ లుక్ లో అదరగొడుతున్న అల్ట్రా స్టైలిష్ లుక్ క్షణాల్లో వైరల్ గా మారింది.
Keerthy suresh
ఇక కీర్తి కెరీర్ గురించి మాట్లాడితే... వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. మహానటి సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ ఆమెకు మరలా దక్కలేదు. నితిన్ తో చేసిన రంగ్ దే అనుకున్నంత విజయం సాధించలేదు. ఆమె లేటెస్ట్ మూవీ గుడ్ లక్ సఖి సైతం నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన గుడ్ లక్ సఖి మూవీలో విషయం లేదని ప్రేక్షకులు తేల్చేశారు.
Keerthy suresh
అయితే కీర్తి సురేష్ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. పల్లెటూరి అమ్మాయి పాత్రలో రెండు భిన్నమైన షేడ్స్ లో నటించి మెప్పించారు. షూటర్ గా ఆమె నటన చాలా సహజంగా సాగింది.మహానటి మూవీ కీర్తి సురేష్ ఫేట్ మార్చేసింది. ఆ మూవీతో వచ్చిన క్రేజ్ తో ఆమెకు వరుసగా సినిమాలు వస్తున్నాయి.
Keerthy suresh
కాగా ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న పెద్ద చిత్రం సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata). సూపర్ స్టార్ మహేష్ (Mahesh babu)నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ విజయం సాధించిన నేపథ్యంలో కీర్తి కెరీర్ కి ఇంకొన్నాళ్లు ఢోకా లేదు. సర్కారు వారి పాట సమ్మర్ కానుకగా మే 12న విడుదల కానుంది.
Keerthy suresh
సర్కారు వారి పాట మూవీతో పాటు చిరంజీవి(Chiranjeevi)-మెహర్ రమేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీలో కీర్తి సురేష్ కీలక రోల్ చేస్తున్నారు. ఆమె చిరంజీవి సిస్టర్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇది కూడా భారీ ప్రాజెక్ట్ అయినప్పటికీ చెల్లిగా చేస్తున్న నేపథ్యంలో ఆమె కెరీర్ కి అంతగా ఉపయోగపడకపోవచ్చు.
Keerthy suresh
స్టార్ హీరోయిన్ గా ఫార్మ్ లో ఉండి కూడా కీర్తి సిస్టర్ రోల్స్ చేయడం కొసమెరుపు. రజనీ కాంత్ లేటెస్ట్ హిట్ అన్నాత్తేలో కీర్తి సురేష్ సిస్టర్ రోల్ చేసిన విషయం తెలిసిందే. తమిళంలో మంచి విజయం సాధించిన ఈ మూవీలో తెలుగులో మాత్రం పరాజయం పొందింది. ప్రస్తుతానికి కీర్తి కెరీర్ కి మాత్రం ఢోకా లేదు. భోళా శంకర్, సర్కారు వారి పాట చిత్రాలతో పాటు తమిళంలో ఒక చిత్రం, మలయాళంలో మరో చిత్రం చేస్తున్నారు.
ఇటీవల నానికి జంటగా మరో చిత్రం ప్రకటించారు. దసరా టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా ఎంపికయ్యారు. నాని పూర్తి మాస్ డీగ్లామర్ రోల్ చేస్తుండగా పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది.