- Home
- Entertainment
- కుర్రాళ్లను లైన్లో పెట్టిన క్రేజీ హీరోయిన్స్... మహేష్ వైఫ్ నమ్రతతో పాటు చిన్నోళ్లను పెళ్లి చేసుకున్న భామలు!
కుర్రాళ్లను లైన్లో పెట్టిన క్రేజీ హీరోయిన్స్... మహేష్ వైఫ్ నమ్రతతో పాటు చిన్నోళ్లను పెళ్లి చేసుకున్న భామలు!
భార్య కంటే భర్త వయసులో పెద్దవాడై ఉండాలనేది హిందూ సాంప్రదాయం. అందుకు విరుద్ధంగా కొందరు హీరోయిన్స్ కుర్రాళ్ళను లైన్లో పెట్టారు. పెళ్లి చేసుకుని జీవిత భాగస్వాములుగా తెచ్చుకున్నారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Actress married younger man
పెళ్ళికి ఈడు జోడు కావాలంటారు. వధువు కంటే వరుడు పెద్దవాడై ఉండాలనేది ఆనవాయితీ. దీనికి విరుద్ధంగా కొందరు హీరోయిన్స్ ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నారు. తమకంటే వయసులో చిన్నవారితో ఏడడుగులు వేశారు. నమ్రత శిరోద్కర్, ఐశ్యర్య రాయ్, ప్రియాంక చోప్రాతో పాటు పలువురు హీరోయిన్స్ ఈ లిస్ట్ లో ఉన్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, హీరోయిన్ నమ్రత శిరోద్కర్ ప్రేమ వివాహం చేసుకున్నారు. 2005లో నిరాడంబరంగా కేవలం కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి జరిగింది. మహేష్ కంటే నమ్రత దాదాపు నాలుగేళ్లు పెద్దది. 1975 ఆగస్టు 9న మహేష్ పుట్టాడు. నమ్రత 1972 జనవరి 22న జన్మించారు.
1973 సెప్టెంబర్ 1న జన్మించిన ఐశ్వర్య రాయ్ ప్రస్తుత వయసు 50 ఏళ్ళు. 1976లో పుట్టిన అభిషేక్ బచ్చన్ ఆమె కంటే రెండేళ్లకు పైగా చిన్నోడు. 2007లో అభిషేక్-ఐశ్వర్య వివాహం చేసుకున్నారు. ఈ మధ్య విడాకులు తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతుంది.
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తనకంటే వయసులో పదేళ్ల చిన్నవాడిని పెళ్లి చేసుకుంది. 1982 జులై 18న జన్మించిన ప్రియాంక చోప్రా వయసు 41 ఏళ్ళు. ఆమె భర్త నిక్ జోనాస్ వయసు 31 ఏళ్ళు. వీరు 2018 లో ప్రేమ వివాహం చేసుకున్నారు.
హీరోయిన్ శిల్పా శెట్టి సైతం వయసులో తనకంటే చిన్నవాడైన రాజ్ కుంద్రాను వివాహం చేసుకుంది. అయితే రాజ్ కుంద్రా-శిల్పా శెట్టి మధ్య వయసులో నెలల వ్యత్యాసం మాత్రమే ఉంది. 1975లో వీరిద్దరూ పుట్టారు. ఆ మధ్య రాజ్ కుంద్రా నీలి వీడియోల ఆరోపణలపై అరెస్ట్ కాబడ్డారు.
హీరో విక్కీ కౌశల్ ని కత్రినా కైఫ్ 2021లో వివాహం చేసుకుంది. విక్కీ కంటే కత్రినా 5 ఏళ్ళు పెద్దది. కత్రినా వయసు 40 ఏళ్ళు కాగా, విక్కీ కౌశల్ వయసు 35.
Image: Google
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య అమృతా సింగ్ ఆయనకంటే వయసులో పెద్దది. 1970 ఆగస్టు 11న జన్మించిన సైఫ్ అలీ ఖాన్ వయసు 53 ఏళ్ళు కాగా... అమృతా సింగ్ ఏకంగా 65 ఏళ్ళు. అంటే ఏడేళ్ల ఏజ్ డిఫరెన్స్ ఉంది. ఇద్దరు పిల్లలు పుట్టాక 2004లో విడాకులు తీసుకున్నారు. సైఫ్ అనంతరం కరీనా కపూర్ ని వివాహం చేసుకున్నారు.
1988 మే 1న జన్మించిన అనుష్క శర్మ వయసు 34 ఏళ్ళు. ఆమె స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని వివాహం చేసుకున్నారు. 1988 నవంబర్ 5న జన్మించిన విరాట్ కోహ్లీ ఓ నాలుగు నెలలు భార్య కంటే చిన్నవాడు. ఇలా కొందరు హీరోయిన్స్ వయసులో తమకంటే చిన్న వాళ్ళను పెళ్లి చేసుకున్నారు.
Also Read Children's day: ఎన్టీఆర్, మహేష్ వంటి టాప్ స్టార్స్ నటించిన బెస్ట్ చైల్డ్ ఓరియెంటెడ్ చిత్రాలు!