MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మహేష్‌ వాయిస్‌ ఓవర్‌, ఘంటసాల రిలీజ్‌ డేట్‌, క ఓటీటీపై కిరణ్‌ అబ్బవరం స్పందన, పా పా తెలుగు రిలీజ్‌ అప్‌ డేట్‌

మహేష్‌ వాయిస్‌ ఓవర్‌, ఘంటసాల రిలీజ్‌ డేట్‌, క ఓటీటీపై కిరణ్‌ అబ్బవరం స్పందన, పా పా తెలుగు రిలీజ్‌ అప్‌ డేట్‌

టాలీవుడ్‌ ఈ రోజు చాలా అప్‌ డేట్స్ ఉన్నాయి. వాటిలో మహేష్‌ వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడం, క సినిమాపై కిరణ్‌ అబ్బవరం స్పందించడం, ఘంటసాల రిలీజ్‌ డేట్‌ని వెంకయ్యనాయుడు రిలీజ్‌ చేయడం, పా పా సినిమా రిలీజ్‌ డేట్‌ అప్‌ డేట్స్ చూద్దాం.  

3 Min read
Author : Aithagoni Raju
Published : Dec 01 2024, 11:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

హాలీవుడ్‌ ఫిల్మ్ `ముఫాసా`కి మహేష్‌ బాబు వాయిస్‌ ఓవర్‌..

హాలీవుడ్‌ ఫిల్మ్స్ కి మన స్టార్స్ వాయిస్‌ ఓవర్‌ ఇస్తుంటారు. తాజాగా మహేష్‌ బాబు `ముఫాసాః ది లయన్‌ కింగ్‌` చిత్రానికి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. ఈ విషయాన్ని నమ్రత తెలిపారు. సోషల్‌ మీడియా ద్వారా మహేష్‌ బాబు తన ఆనందం వ్యక్తం చేశారు. బారీ జెంకిన్స్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ డిసెంబర్‌ 20న ఇండియాలో తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో విడుదల కానుంది. ఇందులో టాకా పాత్రకు వాయిస్ హీరో సత్యదేవ్‌,  టిమోన్‌ పాత్ర వాయిస్ ఇచ్చిన అలీ ఈ వేడుకలో పాల్గొన్నారు. పుంబా పాత్రకు బ్రహ్మానందం, కిరోస్‌ పాత్రకు అయ్యప్ప పి శర్మ వాయిస్ అందించారు.
 

25

`ఘంటసాల` మూవీ రిలీజ్‌ డేట్‌..

సింగర్‌ కృష్ణ చైతన్య టైటిల్‌ రోల్‌ చేసిన మూవీ `ఘంటసాల`. గానగాంథర్వుడు ఘంటసాల జీవితం ఆధారంగా ఈ సినిమాని సీహెచ్‌ రామారావు రూపొందించారు. సీహెచ్‌ శ్రీమతి ఫణి నిర్మించారు. ఇందులో ఘంటసాల వెంకటేశ్వరరావు భార్య సావిత్రి పాత్రలో కృష్ణ చైతన్య భార్య మృదులనే పోషించడం విశేషం. ఆదివారం హైదరాబాద్‌ రిలీజ్‌ డేట్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వచ్చి `ఘంటసాల` రిలీజ్‌ డేట్ ని ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న ఈ మ్యూజిక్‌ ఎంటర్‌టైనర్‌ని విడుదల చేయబోతున్నట్టు టీమ్‌ తెలిపింది. వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. ఇందులో ఆర్‌ నారాయణ మూర్తి కూడా పాల్గొనడం విశేషం. 
 

35

ఓటీటీలో దూసుకుపోతున్న కిరణ్‌ అబ్బవరం `క`..
 
కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించిన మూవీ `క`. నయన్‌ సారి, తన్వీ రామ్‌ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సుజీత్‌, సందీప్‌ దర్శకులు. ఈ మూవీ గత నెలలో విడుదలై బ్లాక్‌ బస్టర్‌ అయ్యింది. ఇప్పుడు ఈటీవీ విన్‌ లో ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో అద్బుతమైన స్పందన లభిస్తుందని కిరణ్‌ అబ్బవరం అన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీ నుంచి ఓటీటీలోకి వచ్చిన ఫస్ట్ తెలుగు సినిమా `క` కావడం విశేషం. దీని గురించి కిరణ్‌ చెబుతూ, అందుకు చాలా సంతోషంగా ఉంది. డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో మా సినిమా మరింత డీటెయిలింగ్ గా సౌండ్, విజువల్స్ మరింతగా ఆకట్టుకుంటాయి. థియేటర్ లో క సినిమా చూసిన వాళ్లు కూడా మరోసారి ఈటీవీ విన్ లో చూడండి అన్నారు.  
 

45

తెలుగులోకి `పా పా`గా తమిళ బ్లాక్‌ బస్టర్‌ `డా డా`..

తెలుగు తెర‌పైకి ఓ ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా రాబోతోంది. తమిళ సెన్సేష‌న‌ల్ బ్లాక్ బస్టర్ ‘డా..డా’ మూవీ తెలుగులో ‘పా.. పా..’ టైటిల్‌తో జెకె ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌పై, నిర్మాత నీరజ కోట విడుద‌ల చేయ‌బోతున్నారు. డిసెంబ‌ర్ 13న‌ ఈ చిత్రాన్నిఆంధ్ర, తెలంగాణతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా థియేట‌ర్‌ల‌లో గ్రాండ్‌గా విడుద‌ల కానుంది.

గ‌త ఏడాది త‌మిళంలో ‘డా..డా’ మూవీ సెన్సేష‌న‌ల్ హిట్ సాధించింది. కవిన్, అపర్ణ దాస్ ప్ర‌ధాన పాత్ర‌దారులుగా, డైరెక్ట‌ర్ గణేష్ కె బాబు తెర‌కెక్కించిన‌ ‘డా..డా’ చిత్రం త‌మిళ ఆడియన్స్‌ని విప‌రీతంగా ఆకట్టుకుంది. కోలీవుడ్ ఇండ‌స్ట్రీలో డిస్ట్రిబ్యూట‌ర్‌ల‌కు కాసుల వ‌ర్షం కురిపించింది. అతి త‌క్కువ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా సుమారు 30 కోట్లు వసూళ్లు సాధించి బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది.  
 

55

సంచలన కాన్సెప్ట్ తో `ఎం4ఎం`.. 

మూవీ మేక‌ర్ మోహన్ వడ్లపట్ల ద‌ర్శ‌కుడిగా, జో శర్మ (యూఎస్ఏ) హీరోయిన్‌గా తెర‌కెక్కిన పాన్ ఇండియా మూవీ 'ఎంఫోర్ఎం' (M4M - Motive For Murder) విడుద‌ల‌కు ముస్తాబ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల సినిమా హైలైట్స్ చెప్పారు. వ‌ర‌ల్డ్‌వైడ్‌గా అంద‌రికి క‌నెక్ట్ అయ్యే స‌బ్జెక్టుతో తెర‌కెక్కించామ‌ని చెప్పారు.

110 ఏళ్ల సినీ చరిత్రలో ఇంత‌వ‌ర‌కు ఎవ‌రూ తీసుకోని కాన్సెప్టుతో ఈ సినిమా చేసిన‌ట్టు తెలిపారు. రాబోయే ప‌దేళ్లు ఈ సినిమా గురించే మాట్లాడుకుంటార‌నే న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు. ఆయన ఆస‌క్తిక‌ర‌మైన కాంపిటీష‌న్ ప్ర‌క‌టించారు. విడుద‌లైన‌ ఫ‌స్ట్ డే ఈ సినిమా చూసి ఇందులో కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే ఒక్కోక్క‌రికి లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు.
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
హీరోగా చిరంజీవి.. నిర్మాతగా శ్రీదేవి.. షూట్ స్టార్ట్ చేసి మధ్యలో ఆగిపోయిన సినిమా ఏంటంటే.?
Recommended image2
Vishnu Vinyasam First Review: విష్ణు విన్యాసం మూవీ ఫస్ట్ రివ్యూ.. హైలైట్స్ ఇవే, మైనస్‌ ఏంటంటే
Recommended image3
Illu Illalu Pillalu Today Episode Feb 26: ప్రేమ నగలతో నర్మద, అడ్డంగా ఇరికించేసిన వల్లి, భాగ్యం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved