- Home
- Entertainment
- Acharya: సూపర్ సర్ ప్రైజ్.. అప్పుడు జల్సా, ఇప్పుడు ఆచార్య.. మెగాస్టార్ కోసం మహేష్ బాబు
Acharya: సూపర్ సర్ ప్రైజ్.. అప్పుడు జల్సా, ఇప్పుడు ఆచార్య.. మెగాస్టార్ కోసం మహేష్ బాబు
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం ఏప్రిల్ 29న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Acharya
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం ఏప్రిల్ 29న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ఈ చిత్రం మెగా పవర్ స్టార్ రాంచరణ్ కామియో రోల్ లో నటించడంతో అంచనాలు తారా స్థాయికి చేరాయి.
Acharya
చిరంజీవి, రాంచరణ్ ఇద్దరూ ఈ చిత్రంలో కామ్రేడ్స్ గా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దేవాలయాల నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి మునుపటిలా ఫుల్ ఎనెర్జిటిక్ గా కనిపిస్తున్నారు.
Acharya
తాజాగా ఈ చిత్రం గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. ఈ న్యూస్ తో ఇటు మెగా ఫాన్స్, అటు మహేష్ బాబు ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఆచార్య చిత్రానికి వాయిస్ ఓవర్ అందిస్తున్నారట. ఇది దాదాపుగా ఖరారైందని.. ఇక అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉన్నట్లు చెబుతున్నారు.
Acharya
మహేష్ బాబుకి మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జల్సా చిత్రానికి మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించారు. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి మెగా ఫ్యామిలీ మూల వృక్షం అయిన చిరంజీవికి చిత్రానికి మహేష్ వాయిస్ ఓవర్ అందిస్తున్నారు.
mahesh babu
మెగా ఫ్యామిలీతో అనుబంధం కొనసాగిస్తూనే ఉన్నాడు మహేష్. ఈ రెండు కుటుంబాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి కొనసాగుతోంది. మహేష్ సినిమా పైరసీకి గురైనప్పుడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారు. దీనితో మహేష్ జల్సా చిత్రానికి వాయిస్ ఓవర్ అందించారు.
Acharya
సరిలేరు నీ కెవ్వరు చిత్రం చిరంజీవి అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఆ రుణం మహేష్ ఇప్పుడు ఇలా తీర్చుకుంటున్నారు. మహేష్ బాబుకి దర్శకుడు కొరటాల శివ తో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో శ్రీమంతుడు, భరత్ అనే నేను లాంటి రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. తప్పకుండా మహేష్ వాయిస్ ఓవర్ తో ఆచార్య చిత్రానికి ఎక్స్ట్రా మైలేజి యాడ్ కానుంది.