MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Guntur Kaaram Review: గుంటూరు కారం ప్రీమియర్ టాక్: మహేష్ బాబు ఊర మాస్ జాతర, ఫ్యాన్స్ కి పూనకాలే!

Guntur Kaaram Review: గుంటూరు కారం ప్రీమియర్ టాక్: మహేష్ బాబు ఊర మాస్ జాతర, ఫ్యాన్స్ కి పూనకాలే!

దాదాపు 13 ఏళ్ల తర్వాత మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన గుంటూరు కారం ప్రీమియర్స్ ముగిశాయి. టాక్ ఏంటో చూద్దాం...   

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jan 12 2024, 04:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Guntur Kaaram Review

Guntur Kaaram Review

మహేష్ బాబు ఫుల్ ఫార్మ్ లో ఉన్నారు. ఆయన వరుస హిట్స్ ఇస్తున్నారు. అదే సమయంలో త్రివిక్రమ్ గత చిత్రం అల వైకుంఠపురంలో ఇండస్ట్రీ హిట్ కొట్టింది. వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన గుంటూరు కారం చిత్రం పై సాధారణంగానే అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ట్రైలర్, సాంగ్స్ హైప్ పెంచేశాయి. సంక్రాంతికి గుంటూరు కారంతో గట్టిగా కొడుతున్నామని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Guntur Kaaram Review

Guntur Kaaram Review

గుంటూరు కారం మూవీలో మహేష్ మాస్ రోల్ చేశారు. ఆయనకు జంటగా శ్రీలీల నటించింది. మీనాక్షి చౌదరి మరొక హీరోయిన్. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతిబాబు, సునీల్ కీలక రోల్స్ చేశారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించగా, థమన్ సంగీతం అందించారు. 

 

37
Guntur Kaaram Review

Guntur Kaaram Review

ఇక జనవరి 11 అర్ధరాత్రి నుండే యూఎస్ లో ప్రీమియర్స్ మొదలయ్యాయి. దీంతో టాక్ బయటకు వచ్చింది. గుంటూరు కారం మూవీ మాస్ కమర్షియల్ అంశాలతో కూడిన మదర్ సెంటిమెంట్ మూవీ. తల్లి బహిష్కరణకు గురైన ఓ కొడుకు కథ. తల్లీ కొడుకులుగా రమ్యకృష్ణ, మహేష్ బాబు నటించారు. 

47
Guntur Kaaram Review

Guntur Kaaram Review

మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయంలో గుంటూరు కారం త్రివిక్రమ్ మార్క్ కమర్షియల్ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. మహేష్ బాబు కామెడీ, డైలాగ్స్, మేనరిజమ్స్, డాన్సులు ఫ్యాన్స్ కి ఫీస్ట్. మహేష్ బాబు వన్ మ్యాన్ షో చేశాడు. 

57

కుర్చీ మడతపెట్టి సాంగ్, మిర్చి యాడ్ లో శ్రీలీల-మహేష్ డాన్స్ ఎపిసోడ్ హైలెట్ గా ఉంటాయి. మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్, క్యారెక్టరైజేషన్ మెప్పిస్తాయి. యాక్షన్ ఎపిసోడ్స్ సైతం అద్భుతంగా ఉన్నాయి. 

 

67
Guntur Kaaram

Guntur Kaaram

అయితే సెకండ్ హాఫ్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. హీరోయిన్ శ్రీలీల డాన్సుల పరంగా ఓకే, ఆమె నటన అసహజంగా ఉంటున్నారు. రెండో హీరోయిన్ మీనాక్షి చౌదరి పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. మదర్ సెంటిమెంట్ అంతగా వర్క్ అవుట్ కాలేదు. సినిమాలో త్రివిక్రమ్ మార్క్ డైరెక్షన్, డైలాగ్స్ మిస్ అయ్యాయనే వాదన వినిపిస్తోంది. 

77
Guntur Kaaram

Guntur Kaaram


థమన్ సాంగ్స్ లో కుర్చీ మడతపెట్టి మాత్రమే అలరిస్తుంది. బీజీఎం పర్లేదు అంటున్నారు. మొత్తంగా గుంటూరు కారం మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్. మహేష్ ఫ్యాన్స్ కి ఫీస్ట్. మహేష్ తన భుజాలపై సినిమా నడిపించాడు. త్రివిక్రమ్ డైరెక్షన్ మాత్రం నిరాశపరిచింది అంటున్నారు. ఫ్యాన్స్ కి, మాస్ చిత్రాలు ఇష్టపడే వారు ఎంజాయ్ చేసే చిత్రం. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Suriya: ఏకంగా మూడుసార్లు సూర్యను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా ? కారణం ఏంటి?
Recommended image2
AK 47 6 Days Collections: ఆదర్శ కుటుంబం కలెక్షన్లు భారీ డ్రాప్‌.. వెంకీ, త్రివిక్రమ్‌ల సినిమాకి ఊహించని దెబ్బ
Recommended image3
Bigg Boss Telugu 10: నన్ను ఎలిమినేట్ చేసేయండి.. ఆడియన్స్ కు సుధీర్ రిక్వెస్ట్.. ముకేష్, అమన్ లతో గొడవ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved