మహేష్ షాకింగ్ డెసిషన్.. రాజమౌళి చిత్రానికి రెమ్యునరేషన్ లెక్కలు ఇలా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అయితే స్క్రిప్ట్ వర్క్ జరుగుతుండడంతో ఈ చిత్రానికి కొంత గ్యాప్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

Mahesh Babu
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అయితే స్క్రిప్ట్ వర్క్ జరుగుతుండడంతో ఈ చిత్రానికి కొంత గ్యాప్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు.. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు.
ఈ క్రేజీ కాంబినేషన్ గురించి అప్పుడే హాలీవుడ్ స్థాయిలో చర్చ మొదలయింది. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ వరల్డ్ వైడ్ ప్రభంజనం తర్వాత జక్కన్న నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఊహించని క్రేజ్ మొదలైంది. హాలీవుడ్ నిర్మాణ సంస్థలు కూడా మహేష్, రాజమౌళి చిత్రంతో అసోసియేట్ అయ్యేందుకు, ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారట.
కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని కనీవినీ ఎరుగని బడ్జెట్ లో నిర్మించబోతున్నారు. ఈ చిత్ర కథ అడవులలో సాగే అడ్వెంచర్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే హీరో ప్రపంచం మొత్తం తిరుగుతూ సాహసాలు చేసే వీరుడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
మహేష్, రాజమౌళి చిత్రం గురించి బయటకి వస్తున్న ఒక్కో విషయం అభిమానుల్లో ఆసక్తిని పెంచేస్తోంది. రాజమౌళి చిత్రం అంటే బడ్జెట్ లెక్కలు, బిజినెస్ వ్యవహారాలు కళ్ళు చెదిరే రేంజ్ లో ఉంటాయి. దీనితో మహేష్ బాబు రెమ్యునరేషన్ గురించి చర్చ మొదలైంది. మహేష్ ఈ చిత్రానికి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడు అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం వినిపిస్తోంది.
ఈ చిత్రానికి రెమ్యునరేషన్ విషయంలో మహేష్ బాబు షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడట. తన రెమ్యునరేషన్ తగ్గించుకుని.. రాజమౌళితో లాభాల్లో వాటా తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
రాజమౌళి ఆల్రెడీ ఇదే పంథా కొనసాగిస్తున్నారు. రాజమౌళి తరహాలోనే మహేష్ కూడా ఈ చిత్రానికి లాభాల్లో వాటా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఒళ్ళు గగుర్పొడిచేలా మహేష్ బాబు సాహసాలని రాజమౌళి ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.