Mahesh Babu : ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే టైం.. కలెక్షన్లలో మహేశ్ బాబు సరికొత్త రికార్డు.. టాలీవుడ్ లో ఫస్ట్ హీరో!
సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘గుంటూరుకారం’ Guntur Kaaram తో సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. కలెక్షన్ల పరంగా తెలుగు సినిమాల రికార్డులను బ్రేక్ చేశారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు Mahesh Babu లేటెస్ట్ ఫిల్మ్ ‘గుంటూరుకారం’. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలా Sreeleela, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.
సంక్రాంతి కానుక జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కాస్తా నెగెటివ్ టాక్ ను అందుకున్నా... బాక్సాఫీస్ వద్ద మాత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ రీజినల్ ఫిల్మ్ ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
ఈ క్రమంలో ‘గుంటూరు కారం’తో మహేశ్ బాబు తెలుగుసినిమాల పరంగా సరికొత్త రికార్డులను నెలకొల్పారు. గుంటూరు కారం లేటెస్ట్ వసూళ్ల వివరాలు రూ.212 కోట్లు కలెక్ట్ చేసింది. ఫస్ట్ వీక్ లోనే ఇంత కలెక్షన్ రాబట్టింది.
దీంతో వరల్డ్ వైడ్ గా ‘గుంటూరుకారం’ మొదటి వారంలోనే రూ.212 కోట్లు కలెక్ట్ చేయడం రీజినల్ ఫిల్మ్ లో ఆల్ టైమ్ రికార్డును సెట్ చేసింది. అలాగే ఈ చిత్రంతో బాబు మరో రికార్డును కూడా క్రియేట్ చేశారు.
ఇప్పటి వరకు టాలీవుడ్ లో వరుసగా రూ.100 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఐదు చిత్రాలను కూడా తన ఖాతాలో వేసుకున్నారు. దీంతో ఈ రికార్డు సెట్ చేసిన మొదటి హీరోగా మహేశ్ బాబు నిలిచారు.
భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట, గుంటూరు కారంతో ఆ రికార్డును సెట్ చేశారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ‘గుంటూరు కారం’ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.