పసి ప్రాణాలకు మహేశ్ బాబు రక్షణ.. ఇలా సాయం చేయడానికి కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు
Mahesh Babu : సూపర్‌స్టార్ మహేష్ బాబు సినిమా ద్వారా ప్రేక్షకులను అలరించడం మాత్రమే కాకుండా, సామాజిక సేవా కార్యక్రమాలలోనూ ముందుండటం తెలిసిందే. అయితే.. మహేష్ బాబు ఇలా చిన్నపిల్లలకు సాయపడడం వెనుక అసలు కారణం ఏంటో తెలుసా ?

రియల్ హీరో మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా.. ఎన్నో సేవాకార్యక్రమాలు చేపడుతుంటారు. అందులో భాగంగా చిన్నారుల గుండె సంబంధిత సమస్యలకు శస్త్రచికిత్సలు ఉచితంగా చేయిస్తారు. ఇప్పటివరకు మహేష్ బాబు వెయ్యికి పైగా ఆపరేషన్స్ చేయించారు. అసలు మహేష్ ఇలా చిన్నపిల్లలకు వైద్య సాయం చేయడానికి వెనుక అసలు కారణం ఏంటో తాజాగా చెప్పుకొచ్చారు.
చిట్టి గుండెలను కాపాడే 'సేవియర్'
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించే ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ టాక్ షోలో మహేష్ బాబు తన ఆలోచన వెనుక ఉన్న నిజాన్ని వెల్లడించారు. చిన్న పిల్లలకు వైద్య సాయం చేయడానికి, సేవా కార్యక్రమం వెనుక అసలు కారణాన్ని అభిమానులతో పంచుకున్నారు. మహేష్ బాబు మాట్లాడుతూ.. ‘గౌతమ్ ఆరు వారాల ముందు పుట్టాడు. వాడిది ప్రీమెచ్యూర్డ్ బర్త్’అని చెబుతూ బాధ పడ్డారు. సాధారణ డెలవరీ కంటే ముందుగా పుట్టడం వల్ల అలాంటి పిల్లలలో సరైన డెవలప్ మెంట్ ఉండదు. అలాంటి వారిలో శ్వాస, వేడి, ఫీడింగ్ సమస్యలు ఉంటాయి. అందుకే పుట్టిన వెంటనే NCIUలో ఉంచాం," అని పేర్కొన్నారు.
MB ఫౌండేషన్ స్థాపనకు ప్రేరణ
ఆ సమయంలో గౌతమ్ అతి చిన్న, తన అరచేతి పొడవు మాత్రమే ఉన్నాడని, ఆ తరువాత గౌతమ్ ఆరోగ్యం క్రమంగా సెట్ అయ్యిందని తెలిపారు. ఇప్పుడు గౌతమ్ 6 అడుగుల పొడవు ఉన్నాడంటూ ఎమోషనల్ అయ్యారు. ఆ సమయంలో తన కొడుకు రక్షణ కోసం లక్షల్లో ఖర్చు చేసి కాపాడుకున్నాననీ మహేష్ బాబు భావోద్వేగానికి లోనయ్యారు.
"మాకు డబ్బులు ఉన్నందున బతికించుకోగలిగాం, కానీ పేదల పరిస్థితి ఏంటో ఆలోచించాను," అని చెప్పారు. ఇదే ఆలోచన MB ఫౌండేషన్ స్థాపించడానికి కారణమైందని ఆయన చెప్పారు. MB ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు ఉచిత హార్ట్ ఆపరేషన్, క్రిటికల్ సిచ్యుయేషన్‌లో ఉన్నవారికి వైద్య ఖర్చులు, వైద్య సదుపాయం అందిస్తున్నట్లు మహేష్ బాబు వెల్లడించారు.
మహేశ్ బాబు ఫౌండేషన్
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఉచిత గుండె ఆపరేషన్లు అందించేందుకు మహేశ్ బాబు ఫౌండేషన్ ను స్థాపించారు. ఫౌండేషన్ వెబ్‌సైట్ ద్వారా డైరెక్ట్‌గా రిక్వెస్ట్ పెట్టే అవకాశం కల్పించడం విశేషం. మహేశ్ బాబు ఫౌండేషన్‌ను ఆయన తన సతీమణి నమ్రతా శిరోద్కర్‌తో కలిసి 2020లో స్థాపించారు. మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా చిన్నపిల్లల గుండె ఆపరేషన్ల కోసం ఏటా సుమారు రూ. 50 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని సమాచారం.
మహేష్ బాబు తన సంపాదనలో సుమారు 30% భాగాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయిస్తున్నారట. మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు 4,500కి పైగా సర్జరీలు జరగడం విశేషం. ఉచిత వైద్య శిబిరాలు, బాలికలకు గర్భకోశ క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్లు వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాల ద్వారా మాత్రమే కాకుండా, సామాజిక బాధ్యతను కూడా కొనసాగిస్తూ అభిమానులకు నిజమైన హీరోగా నిలిచారు. చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఆయన చేసిన ప్రయత్నాలు నిజంగా ప్రశంసనీయమైనవని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
మహేష్ బాబు ‘SSMB29’తో నయా రికార్డు
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్న చిత్రం ‘SSMB29’ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. 2021లో సినిమా లేకపోవడం వల్ల కొంత విరామం తీసుకున్న మహేష్ బాబు, దర్శకుడు పరశురాంతో కలిసి పని చేసిన తర్వాత 2022లో ‘సర్కారు వారి పాట’ విడుదల చేశారు. కీర్తి సురేష్ ప్రధాన హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది.
ఆ తరువాత భారీ అంచనాల మధ్య మహేష్ బాబు-రాజమౌళి కాంబోలో ‘SSMB29’ రాబోతుంది. ఈ గ్లోబల్ మూవీలో మహేష్ బాబు నటిస్తున్నట్టు ప్రకటించినప్పటి నుండి సినిమా పై భారీ బజ్ నెలకొంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతంది. ఇటీవల ఒడిశా షెడ్యూల్ పూర్తయింది. ‘SSMB29’విడుదల కోసం కేవలం మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాదు సినిమా లవర్స్ ఇగర్ గా వేయిట్ చేస్తున్నారు.