MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాజమౌళి, మహేష్ బాబు మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్.. స్వయంగా విజయేంద్ర ప్రసాద్ చెప్పేశారుగా

రాజమౌళి, మహేష్ బాబు మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్.. స్వయంగా విజయేంద్ర ప్రసాద్ చెప్పేశారుగా

ఒకవైపు మహేష్ బాబు అభిమానులు, మరోవైపు యావత్ సినీలోకం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రం. చాలా కాలంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూనే ఉంది. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Oct 09 2024, 05:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఒకవైపు మహేష్ బాబు అభిమానులు, మరోవైపు యావత్ సినీలోకం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రం. చాలా కాలంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూనే ఉంది.  అత్యంత భారీ బడ్జెట్ లో పాన్ వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేసేలా ఈ చిత్రం ఉండబోతోందని ఆల్రెడీ హింట్స్ ఇచ్చేశారు. దీనితో ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

మహేష్ బాబు ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం చిత్రంతో సందడి చేశారు. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి చిత్రం కోసం తన మేకోవర్ మార్చుకుంటున్నారు. మహేష్ ఎయిర్ పోర్ట్ లో కనిపిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గుబురు గడ్డంతో కనిపిస్తున్నారు. జుట్టు పొడవుగా పెంచుతున్నారు. ఇంత జరుగుతున్నా మూవీ అనౌన్స్ మెంట్ ఎందుకు ఆలస్యం అవుతోంది అనే అసంతృప్తి ఫ్యాన్స్ లో ఉంది. 

34

మొత్తంగా మహేష్ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. స్వయంగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. మహేష్ బాబు చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు. విజయేంద్ర ప్రసాద్ ఓ కార్యక్రమంలో పాల్గొనగా మీడియా నుంచి మహేష్ చిత్రానికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. విజయేంద్ర ప్రసాద్ వెంటనే బదులిస్తూ ఈ చిత్ర షూటింగ్ జనవరి నుంచి ప్రారంభం అవుతుంది అని తెలిపారు. 

44

గుంటూరు కారం చిత్రం సంక్రాంతికి విడుదలయింది. సరిగ్గా ఏడాదికి మహేష్ తన కొత్త చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ లోపు తప్పకుండా రాజమౌళి నుంచి అనౌన్స్ మెంట్ కానీ మీడియా సమావేశం కానీ ఉండే అవకాశం ఉంది. పూజా కార్యక్రమం ఎలాగూ ఉంటుంది. ఆ క్షణాల కోసం మహేష్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అటవీ నేపథ్యంలో వరల్డ్ మొత్తం చుట్టివచ్చే వీరుడి కథ అంటూ ఆల్రెడీ హింట్స్ వచ్చాయి. కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Sangeetha Reunion: త్రిషకి సీఎం దళపతి బిగ్‌ షాక్‌.. మళ్లీ ఒక్కటైన విజయ్-సంగీత?
Recommended image2
కృష్ణ తలచుకుంటే శోభన్‌బాబుని మించి వేల కోట్లు ఆస్తులు.. సగం చెన్నై, హైదరాబాద్‌ ఆయనదే.. సంచలన విషయాలు వెల్లడి
Recommended image3
Allu Arjun Peddi Review: నిన్ను చూస్తే గర్వంగా ఉంది బ్రదర్‌.. రామ్‌ చరణ్‌ పెద్దిపై అల్లు అర్జున్‌ సంచలన పోస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved